జాన్వీ టాలీవుడ్ ఎంట్రీ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. శ్రీదేవి కూతురు కావడంతో ఆమెకు సౌత్ లో హైప్ వచ్చిపడింది. ఇక ఆమె తెలుగు చిత్రం చేస్తున్నారంటూ పలుమార్లు కథనాలు ఇప్పటికే వెలువడ్డాయి. తాజా సమాచారం ప్రకారం.. ఎన్టీఆర్ (NTR),మూవీతో ఆమె ఎంట్రీ ఖాయం అంటున్నారు. ఎన్టీఆర్ అప్ కమింగ్ మూవీలో జాన్వీ హీరోయిన్ గా నటిస్తున్నారంటూ పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి.