రంగ రంగ వైభవంగా రివ్యూ...  ప్రీమియర్స్ టాక్, ఫస్ట్ హాఫ్ ఓకే... సెకండ్ హాఫ్ అండ్ క్లైమాక్స్ ?

First Published Sep 2, 2022, 5:44 AM IST

వైష్ణవ్ తేజ్, కేతికా శర్మ జంటగా తెరకెక్కిన చిత్రం రంగ రంగ వైభవంగా. దర్శకుడు గిరీశాయ తెరకెక్కించగా బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మించారు. సెప్టెంబర్ 2న ఈ చిత్రం విడుదల కాగా, ప్రీమియర్స్ ప్రదర్శన ముగిసింది. టాక్ ఎలా ఉందో చూద్దాం..

కథ:

రిషీ(వైష్ణవ్) రాధా(కేతిక శర్మ) చిన్నప్పటి నుండి కలిసి పెరుగుతారు. పక్క పక్క ఇళ్లలో వుండే వీరిద్దరికీ ఒకరంటే మరొకరికి అసలు పడదు. తరచూ కొట్టుకుంటూ,తిట్టుకుంటూ ఉంటారు. పెద్దయ్యాక మెడికల్ స్టూడెంట్స్ గా ఒకే కాలేజీలో చేరతారు. కాలేజ్ లో కూడా అదే పరిస్థితి. అయితే పైకి రాధా అంటే కోపం ప్రదర్శించే రిషికి ఆమెపై మనసులో అమితమైన ప్రేమ ఉంటుంది. అనూహ్యంగా వీరి రెండు కుటుంబాల మధ్య గొడవలు చోటు చేసుకుంటాయి. దీంతో ఆ రెండు కుటుంబాలను తిరిగి కలిపే బాధ్యత రిషీ, రాధా తీసుకుంటారు. అసలు ఆ రెండు కుటుంబాల మధ్య గొడవలకు కారణం ఏమిటీ? రాధా,రిషి ఆ కుటుంబాలను కలపడంలో విజయం సాధించారా? అలాగే రిషీ ప్రేమ కథ ఎలా ముగిసింది? అనేది మిగతా కథ...

ఉప్పెన మూవీతో  యూత్ లో ఇమేజ్ తెచ్చుకున్నాడు వైష్ణవ్ తేజ్. డెబ్యూ మూవీతో రికార్డులు నమోదు చేశాడు. రెండో చిత్రంగా వైష్ణవ్ తేజ్ చేసిన కొండపొలం విజయం సాధించలేదు. దర్శకుడు క్రిష్ తెరకెక్కించిన కొండపొలం దారుణ పరాజయం చవిచూసింది. ప్రయోగాత్మకంగా తెరకెక్కిన కొండపొలం ఫెయిల్ కాగా, అచ్చొచ్చిన రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ తో ప్రేక్షకులను పలకరించారు.


తమిళ చిత్రం ఆదిత్య వర్మ ఫేమ్ గిరీశాయ అవుట్ అండ్ అవుట్ యూత్ ఫుల్ రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ గా రంగ రంగ వైభవంగా తెరకెక్కించారు. రంగ రంగ వైభవంగా లీడ్ క్యారెక్టర్స్  చైల్డ్ హుడ్ సన్నివేశాలతో మొదలైన చిత్రం కాలేజ్ బ్యాక్ డ్రాప్ తో ముందుకు వెళుతుంది. మెడికల్ స్టూడెంట్స్ గా వైష్ణవ్, కేతికా శర్మ ఆకట్టుకున్నారు. వీళ్ళ మధ్య క్యూట్ ఫైట్స్, రొమాంటిక్ సీన్స్, సాంగ్స్ కొంత మేర ఆకట్టుకున్నాయి. 

హీరో హీరోయిన్ రొమాంటిక్ సన్నివేశాలతో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ కి కావలసిన డ్రామా, కామెడీ ఫస్ట్ హాఫ్ లో చూడవచ్చు. వైష్ణవ్, కేతికా రొమాన్స్ సైతం ఆకట్టుకునే అంశం. అయితే కథనం ఆసక్తి కలిగించదు.ప్రేక్షకుల అంచనాలకు అందుతూ మూవీ సాగుతుంది. ఇక క్లైమాక్స్ బ్యాంగ్ పర్వాలేదు. ఫస్ట్ హాఫ్ ఒకింత ఎంటర్టైనింగ్ గా, ఫ్యామిలీ ఆడియన్స్, యూత్ ని ఆకట్టుకునేలా దర్శకుడు తెరకెక్కించాడు.

సెకండ్ హాఫ్ పూర్తిగా నిరాశ పరిచినట్లు ప్రీమియర్ రిపోర్ట్స్ అందుతున్నాయి. రెండు ఫ్యామిలీలను కలిపే క్రమంలో దర్శకుడు రాసుకున్న సన్నివేశాలు విసుకు పుట్టిస్తాయి అంటున్నారు. ఏమాత్రం ఆకట్టుకోని కథనం ప్రేక్షకుడికి పరీక్ష పెడుతుందని ప్రీమియర్స్ ద్వారా అందుతున్న సమాచారం. సెకండ్ హాఫ్ పూర్తిగా నిరాశాజకంగా సాగింది అంటున్నారు.

ఫస్ట్ హాఫ్ ఒకింత ఎంటర్టైనింగ్ గా నడిపిన దర్శకుడు గిరీశాయ సెకండ్ హాఫ్ కి పూర్తి స్థాయిలో న్యాయం చేయలేకపోయాడనేది టాక్. కథలో కూడా కొత్తదనం లేదు. ఈ తరహా కథలు 20 ఏళ్ల క్రితం సక్సెస్ ఫార్ములాగా ఉన్నాయి. పాత చింతకాయ పచ్చడిని కొత్త జాడీలో సిద్ధం చేశారని అంటున్నారు. కాగా దేవిశ్రీ ప్రసాద్ సాంగ్స్ సినిమాకు ప్లస్. రెండు మూడు సాంగ్స్ బాగున్నాయి.

లీడ్ పెయిర్ వైష్ణవ్ తేజ్, కేతిక శర్మ నటన, రొమాన్స్ ఆకట్టుకుంటుంది. మ్యూజిక్ పర్వాలేదు. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి. మొత్తంగా కథా కథనాలు సినిమాను దెబ్బతీశాయి. అవుట్ డేటెడ్ ఎమోషనల్ క్లైమాక్స్ మరొక మైనస్ గా ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. రంగ రంగ వైభవంగా వైష్ణవ్ కి విజయం కట్టబెట్టడం కష్టంలానే కనిపిస్తుంది. అయితే పూర్తి రివ్యూ వస్తే కానీ సినిమా ఫలితంపై ఓ అభిప్రాయానికి రాగలం.

click me!