మొదటి చిత్రంతోనే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన కృతి (Krithi shetty) చాలా త్వరగా స్టార్డం తెచ్చుకుంది. ఉప్పెన విజయంలో సింహ భాగం కృతి శెట్టిదే. తన వయసుకు సరిగ్గా సెట్ అయ్యే పాత్రలో కృతి చాలా సహజంగా నటించింది. చేపకళ్ళు, చొట్ట బుగ్గలకు తోడు మెస్మరైజ్ చేసే ముఖకవళికలు కుర్రకారుకు నిద్ర లేకుండా చేశాయి. చిన్న చిత్రంగా విడుదలైన ఉప్పెన స్టార్ హీరో మూవీ రేంజ్ వసూళ్లు సాధించి ట్రేడ్ వర్గాలను షాక్ కి గురిచేసింది. ఉప్పెన వరల్డ్ వైడ్ గా వంద కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు రాబట్టడం ఊహించని పరిణామం. ఉప్పెన విజయం నేపథ్యంలో కృతి శెట్టికి టాలీవుడ్ లో అవకాశాలు వరుస కట్టాయి.