మహేష్ ఫ్యాన్స్ ని వణికిస్తున్న జగన్ సెంటిమెంట్.. బాలయ్య, పవన్, అల్లు అర్జున్ సేఫ్

Published : May 03, 2022, 01:17 PM IST

టాలీవుడ్ లో సెంటిమెంట్స్ గోల కొంచెం ఎక్కువగానే ఉంటుంది. ఇప్పుడు మహేష్ అభిమానులని కొత్త సెంటిమెంట్ వణికిస్తోంది.

PREV
17
మహేష్ ఫ్యాన్స్ ని వణికిస్తున్న జగన్ సెంటిమెంట్.. బాలయ్య, పవన్, అల్లు అర్జున్ సేఫ్

మెగాస్టార్ చిరంజీవి, రాంచరణ్ నటించిన ఆచార్య చిత్రం తీవ్రంగా నిరాశపరిచింది. దీనితో ఆర్ఆర్ఆర్ తర్వాత చరణ్ నటించిన సినిమా కావడంతో ఫ్యాన్స్ రాజమౌళి సెంటిమెంట్ అని మాట్లాడుకున్నారు. టాలీవుడ్ లో సెంటిమెంట్స్ గోల కొంచెం ఎక్కువగానే ఉంటుంది. హీరోయిన్ల విషయంలో కూడా తరచుగా సెంటిమెంట్ అంటూ కామెంట్స్ వినిపిస్తుండడం చూస్తూనే ఉన్నాం. 

27

ఇప్పుడు మహేష్ అభిమానులని కొత్త సెంటిమెంట్ వణికిస్తోంది. అదేంటంటే.. కొన్ని నెలల క్రితం టాలీవుడ్ లో టికెట్ ధరల సమస్య ఎంత వివాదంగా మారిందో అందరికి తెలిసిందే. దీనితో మెగాస్టార్ చిరంజీవి చొరవ తీసుకుని ఏపీ ముఖ్యమంత్రి జగన్ ని కలిశారు. చిరంజీవి వెంట మహేష్ బాబు, ప్రభాస్ కూడా నడిచారు. 

37

సీఎం జగన్ తో వీరి మీటింగ్ జరిగిన కొన్ని రోజుల్లోనే ఏపీ ప్రభుత్వం టికెట్ ధరల సమస్యని పరిష్కరించింది. చిరంజీవికి ప్రశంసలు కూడా దక్కాయి. రాజమౌళి అయితే తన దృష్టిలో ఇండస్ట్రీ పెద్ద చిరంజీవి గారే అని ప్రకటించారు. టికెట్ ధరలు పరిష్కారం అయ్యాక ప్రభాస్ నటించిన రాధే శ్యామ్ చిత్రం విడుదలయ్యింది. జగన్ ని కలసిన వారిలో ప్రభాస్ కూడా ఉన్నాడు. 

47

భారీ అంచనాల నడుమ విడుదలైన రాధే శ్యామ్ బయ్యర్లకు తీరని నష్టాలు మిగుల్చుతూ డిజాస్టర్ గా నిలిచింది. ప్రభాస్ కెరీర్ లోనే ఇది బిగ్గెస్ట్ డిజాస్టర్. ఇటీవల విడుదలైన ఆచార్య చిత్రం పరిస్థితి ఏమిటో అందరికి తెలుసు. ఈ మూవీ కూడా చిరు కెరీర్ లోనే బిగ్ ఫ్లాప్ గా మారుతోంది. ఇక జగన్ ని కలిసిన హీరోల్లో మిగిలింది మహేష్ మాత్రమే. మే 12న సర్కారు వారి పాట చిత్రం రిలీజ్ అవుతుండడంతో మహేష్ అభిమానుల్లో గుబులు మొదలైంది. 

57

అదే సెంటిమెంట్ రిపీట్ అయి సినిమా రిజల్ట్ ఏమవుతుందో అనేది వారి భయం. కానీ సర్కారు వారి పాటపై దర్శకుడు పరశురామ్ సూపర్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ట్రైలర్ ని మించేలా సినిమా అద్భుతంగా ఉంటుందని చెబుతున్నారు. జగన్ ని కలిసినోళ్లు సరే.. కలవని వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే.. బేషుగ్గానే ఉందని చెప్పొచ్చు. 

67

చిరంజీవితో పాటు నాగార్జున కూడా జగన్ ని కలుస్తారు అంటూ వార్తలు వచ్చాయి. జగన్ తో మీటింగ్ కంటే ముందుగానే బంగార్రాజు సంక్రాంతికి రిలీజ్ అయింది. కారణాలు ఏవైనా నాగార్జున.. జగన్ ని కలవలేదు. బంగార్రాజు చిత్రం మంచి విజయం సాధించింది. ఇక అఖండ రిలీజ్ సమయంలో బాలయ్య జగన్ ని కలిసేందుకు ట్రై చేశారు అని అప్పటి మంత్రి పేర్ని నాని స్వయంగా తెలిపారు. కనై జగన్ వద్దన్నారట. ఆ తర్వాత అఖండ రిలీజ్ కావడం.. బాలయ్య కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలవడం జరిగింది. 

77

అల్లు అర్జున్ కూడా జగన్ ని కలవలేదు. పుష్ప పాన్ ఇండియా చిత్రంగా విజయవంతం అయింది. ఇక పవన్ కళ్యాణ్ గురించి చెప్పేదేముంది. పవన్.. జగన్ ని కలవలేదు.. కలవడు కూడా.. టికెట్ బెనిఫిట్స్ లేకుండానే భీమ్లా నాయక్ హిట్ కొట్టింది. 

click me!

Recommended Stories