బిగ్ బాస్ ఎంట్రీ పై పాయల్ క్లారిటీ... సోషల్ మీడియా వేదికగా వివరణ!

First Published Jun 10, 2021, 7:09 PM IST

టాలీవుడ్ హాట్ బాంబ్ పాయల్ రాజ్ పుత్ త్వరలో ప్రసారం కానున్న బిగ్ బాస్ సీజన్ 5లో పాల్గొనబోతున్నారంటూ వరుస కథనాలు వస్తున్న నేపథ్యంలో ఆమె క్లారిటీ ఇచ్చారు. సోషల్ మీడియా వేదికగా స్పష్టత ఇచ్చారు.

ఆర్ ఎక్స్ 100 మూవీతో టాలీవుడ్ లో అడుగుపెట్టిన పాయల్ రాజ్ పుత్, కుర్ర గుండెలను కొంటె చూపులతో గిల్లేసింది. నెగిటివ్ షేడ్స్ కలిసిన బోల్డ్ రోల్ లో పాయల్ నటన అందరికీ తెగ నచ్చేసింది. అరంగేట్రంతోనే భారీ హిట్ కొట్టిన పాయల్ టాలీవుడ్ ని ఎలేయడం ఖాయమని అందరూ అనుకున్నారు.
undefined
అనూహ్యంగా పాయల్ కి అనుకున్నంత స్థాయిలో ఆఫర్స్ దక్కలేదు. కనీసం టూ టైర్ హీరోల పక్కన కూడా ఆమెకు వరుస ఆఫర్స్ రాలేదు. దీనితో బోల్డ్ రోల్స్, ఐటెం సాంగ్స్ కే ఆమె పరిమితం కావాల్సి వచ్చింది.
undefined
వెంకీ మామ మూవీలో సెకండ్ హీరోయిన్ గా అలరించిన పాయల్ కి ఆ మూవీ విజయం కూడా మేలు చేయలేకపోయింది. ఆమె ఎన్నో ఆశలు పెట్టనున్న డిస్కో రాజా అట్టర్ ప్లాప్ కావడం ఆమె కెరీర్ పై ప్రతికూల ప్రభావం చూపింది.
undefined
గ్లామర్ హీరోయిన్ అన్న బ్రాండ్ తో పాటు విజయాల శాతం తక్కువ కావడంతో పాయల్ ని దర్శక నిర్మాతలు పట్టించుకోవడం లేదు. సాలిడ్ ఫిగర్ తో మత్తెకించే ఈ అందగత్తెకు ఆఫర్స్ రాకపోవడం బాధాకరం.
undefined
ప్రస్తుతం అడపాదడపా ఆఫర్స్ మినహా చెప్పుకోదగ్గ స్థాయిలో ఆమెకు సినిమాలు లేవు. ఏంజెల్ మూవీతో కోలీవుడ్ లో అడుగుబెట్టనున్న పాయల్ అక్కడైనా సక్సెస్ కావాలని ప్రయత్నం చేస్తున్నారు.
undefined
సరైన ఆఫర్స్ లేని పాయల్ బిగ్ బాస్ సీజన్ 5 కంటెస్టెంట్ గా ఎంపికయ్యారని వార్తలు వస్తుండగా పాయల్ ఖండించారు. బిగ్ బాస్ షోలో ఆమె పాల్గొనడం లేదని, నిరాధారమైన వార్తలు ప్రచారం చేయకండి అంటూ పాయల్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు.
undefined
click me!