సోషల్ మీడియా సెన్సేషన్ బర్రెలక్క అలియాస్ శిరీష్ కు పెళ్లి కుదిరిన విషయం తెలిసిందే. ఇటీవల నిశ్చితార్థం కూడా జరిగింది. ఇక తనకు కాబోయేవాడిని మొదటిసారి పరిచయం చేసింది శిరీష.
తెలుగు రాష్ట్రాల్లో సెన్సేషన్ గా మారింది బర్రెలక్క అలియాస్ శిరీష. డిగ్రీ చదివిన శిరీష ఉద్యోగం దొరక్క బర్రెలు కాసుకుంటూ వీడియోలు చేసింది. నిరుద్యోగం కారణంగా బర్రెలు మేపుకోవాల్సి వస్తుందంటూ తన ఆవేదన వెళ్లగక్కింది. శిరీష వీడియోలు వైరల్ కాగా... బర్రెలక్కగా పాప్యులర్ అయ్యింది.
26
Barrelakka
బర్రెలక్క తల్లి రోజువారీ కూలీ. ఆమెకు ఇద్దరు తమ్ముళ్లు ఉన్నారు. సోషల్ మీడియా సెన్సేషన్ గా అవతరించిన బర్రెలక్క గత ఏడాది జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కొల్లాపూర్ నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసింది. బర్రెలక్క 5754 ఓట్లతో నాలుగో స్థానంలో నిలిచి ఔరా అనిపించింది.
ఈ క్రమంలో బర్రెలక్క పాపులారిటీ మరింత పెరిగింది. ఏకంగా ఏపీ సీఎం జగన్, రామ్ గోపాల్ వర్మ వంటి వారు బర్రెలక్క పేరు ప్రస్తావించడం జరిగింది. సోషల్ మీడియా ద్వారా బర్రెలక్క తన ఫ్యాన్స్ కి టచ్ లో ఉంటుంది. తాజాగా బర్రెలక్కకు వివాహం కుదిరింది. నిశ్చితార్థం జరిగింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా తెలియజేసింది.
46
Barrelakka alias Shirisha
బర్రెలక్కకు కాబోయే భర్త ఎవరనే క్యూరియాసిటీ ఫ్యాన్స్ లో ఏర్పడింది. అతని వివరాలు చెప్పాలంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఈ క్రమంలో బర్రెలక్క తనను చేసుకోబోయే కుర్రాడిని పరిచయం చేసింది. ప్రీ వెడ్డింగ్ షూట్ తో పాటు ఒక రొమాంటిక్ సాంగ్స్ రూపొందించి... ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది.
56
Barrelakka alias Shirisha
హీరో హీరోయిన్ లెక్క సదరు సాంగ్ లో బర్రెలక్క, అతగాడు కెమిస్ట్రీ కురిపించారు. ఇక వరుడు వివరాలు పరిశీలిస్తే... అతడి పేరు వెంకట్. తెలంగాణా నాగర్ కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి గ్రామానికి చెందినవాడు.ఎమ్ఎస్సి ఫిజిక్స్ చదువుకున్నాడట. పెద్దలు ఈ సంబంధం కుదర్చగా బర్రెలక్క ఓకే చేసిందట.
66
Barrelakka alias Shirisha
మార్చి 28న వెంకట్-శిరీషల వివాహం ఘనంగా జరగనుంది. ఈ విషయం తెలిసిన అభిమానులు శిరీషకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మొత్తంగా బర్రెలక్క కోడలిగా మరొక ఇంట్లో అడుగుపెడుతుంది. కాగా త్వరలో తెలంగాణలో పార్లమెంట్ ఎలక్షన్స్ జరగనున్నాయి. మరి బర్రెలక్క పోటీ చేస్తుందేమో లేదో చూడాలి...