మాకొద్దు మేం చేయం.. కోట్లు ఇచ్చినా ఆ పని మాత్రం మా వల్ల కాదు అంటున్న స్టార్స్.

Published : Feb 08, 2022, 05:57 PM ISTUpdated : Feb 08, 2022, 06:59 PM IST

ఫిల్మ్ సెలబ్రెటీలు అంటే ఇటు సినిమాలతో పాటు మల్టీ టాలెంట్ తో దూసుకుపోతూ ఉంటారు. సినిమాల సంపాదనతో పాటు.. బిజినెస్ లు.. మల్టీ బ్రాండ్ యాడ్స్ తో కోట్లకు కోట్లు సంపాదించేస్తుంటారు. కాని మాకు ఆ సంపాదన వద్దు..మేం యాడ్స్ చేయం అని నిక్కచ్చిగా చెప్పేసిన స్టార్స్ ఎవరో ఇప్పుడు చూద్దాం.

PREV
17
మాకొద్దు మేం చేయం..  కోట్లు ఇచ్చినా ఆ పని మాత్రం మా వల్ల కాదు అంటున్న స్టార్స్.

ఈ మధ్య ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) వరుసగా యాడ్స్ చేస్తున్నారు. అవి కాంట్రవర్సీలకు కూడా దారి తీస్తున్నాయి. ఫిల్మ్ స్టార్స్ ఇప్పుడు సినిమాల రెమ్యూనరేషన్ నే నమ్ముకోవడం లేదు. సినిమాకు కోట్లకు కోట్లు తీసుకుంటూనే.. కమర్షియల్ యాడ్స్  చేసుకుంటు.. ఇంకొన్ని కోట్లు ఇలా పక్కకు వేసకుంటున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) అయితే ఎన్నికంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నారో లెక్కేలేదు. ఇలా దాదాపు అందరు స్టార్లు కమర్షియల్స్ చేస్తున్నారు. కాని కొంత మంది మాత్రం ఇలాంటివి చేయడానికి ఇష్టపడంటంలేదు.మరి కమర్షియల్ యాడ్స్ చేయమూ  అని నిక్కచ్చిగా చెప్పిన స్టార్స్ ఎవరు...?

27

ఇప్పుడు టాలీవుడ్ లో ఉన్న సీనియర్ హీరోలలో మెగాస్టార్, నాగార్జున,వెంకటేష్ ముగ్గరు కమర్షియల్ యాడ్స్ చేసిన వారే. ఇప్పటికీ... నాగ్, వెంకీ యాడ్స్ చేస్తూ సంపాధిస్తున్నారు. కాని నట సింహం బాలయ్య(Balakrishna) మాత్రం లైఫ్ లో ఒక్క కమర్షియల్ యాడ్ చేయలేదు. చాలా మంది కోట్ల రూపాయలు ఆఫర్ చేసినా.. పేదవారికి ఉపయోగపడే యాడ్స్ ఏమైనా ఉంటే ఫ్రీగా చేస్తాను కాని. ఇటువంటి అబద్దపు ప్రచారాలు మాత్రం నేను చేయను అని తెగేసి చెప్పాట బాలయ్య.

37

అటు పవర్ స్టార పవన్ కళ్యాన్ (Pawn Kalyan)  కూడా తన లైఫ్ లో ఒకే ఒక కమర్షియల్ యాడ్ చేశారు. కెరీర్ బిగినింగ్ లో ఓ సాఫ్ట్ డ్రింక్ యాడ్ లో కనిపించాడు పవన్ కళ్యాణ్. ఆతరువాత ఇంత వరకూ వాటి జోలికి వెళ్లలేదు. తనకు చేయడం ఇష్టం లేదు అని ఎప్పుడో చెప్పేశాడు పవర్ స్టార్. చాలా కంపెనీలు పవన్ కళ్యాణ్ తో ఆ పని చేయించాలని చూసినా.. ఆయన మాత్రం కోట్ల  ఆఫర్స్ కు పక్కాగా నో చెప్పేశాడట.

47

సినిమాల విషయంలోనే ఆచి తూచి అడుగు వేస్తుంది సాయి పల్లవి( Sai Pallavi) .ఎంత పెద్ద స్టార్ హీరో పక్కన ఆఫర్ వచ్చినా.. ముందు కథ మొత్తం వింటుంది. హీరోయిన్ క్యారెక్టర్ కు పెర్ఫామెన్స్ స్కోప్ లేకుంటే.. సినిమా చేయను అని ముఖం మీదే చెప్పేస్తుంది సాయి పల్లవి. ఇక ఈ స్టార్ హీరోయిన్ కమర్షియల్ యాడ్స్ ను చేయనని ఎప్పుడో చెప్పేసింది. అలా యాడ్స్ చేసి ప్రజలను మోసం చేయడం.. మాన్యూప్లేట్ చేయడం తనకు ఇష్టం ఉండదూ అని వివరణ కూడా ఇచ్చింది ఓ సారి సాయి పల్లవి. ఓ ఫెయిర్నెస్ క్రీమ్ యాడ్ కోసం రెండు సార్లు సాయి పల్లవిని(Sai Pallavi) సంప్రదించారు. దాదాపు 2 కోట్ల వరకూ ఆఫర్ చేసినా.. ఆమె చేయడనని నిక్కచ్చిగా చెప్పేసిందట.

57

మరికొంత మంది స్టార్స్ కూడా ఇప్పటి వరకూ కమర్షియల్ యాడ్స్ జోలికి వెళ్ళలేదు. డైలాగ్ కింగ్ మోహన్ బాబు( Mohan Babu) ఫ్యామిలీ నుంచి  మెహన్ బాబు, మంచు విష్ణు కూడా చాలా వరకూ కమర్షియల్ యాడ్స్ కు దూరంగా ఉంటారు. ఇవీ అవీ అంటూ చాలా ఆఫర్లు తమ గుమ్మం తొక్కినా.. వాళ్లు చేయలేదు. ఫ్యామిలీ మొత్తానికి కలిసి కూడా కొన్ని ఆఫర్లు వచ్చాయట. కాని వారు ఆఫర్లు తీసుకోలేదని సమాచారం.

67

నందమూరి ఫ్యామిలో బాలయ్య (Balakrishna) తరువాత కమర్షియల్ యాడ్స్ కు దూరంగా ఉన్నది కళ్యాన్ రామ్. తమ్ముడు తారక్ టాప్ బ్రాండ్స్ కు అంబాసిడర్ గా ఉన్నా.. కళ్యాణ్ రామ్ (Kalyan Ram) మాత్రం వాటి జోలికి వెళ్ళడం లేదు. బాబాయి బాలకృష్ణ బాటలోనే నడుస్తున్నాడు.

77

అటు మెగా ఫ్యామిలీలో కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) బాటలో నడుస్తున్నాడు మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్. మెగా ఫ్యామిలీలో యంగ్ స్టార్స్ అంతా సినిమాలు, బిజినెస్ లు.. అంటూ సంపాదించుకుంటుంటే. సాయి తేజ్ (Sai Tej)  మాత్రం కమర్షియల్స్ కు దూరంగం ఉంటున్నాడు. వీళ్ళే కాదు.. కామెడీ హీరోగా... 50 సినిమాలు చేసిన అల్లరి నరేష్ లాంటి  మరికొం మంది హీరోలు కూడా కమర్షియల్స్  యాడ్స్ కు దూరంగా ఉంటున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories