Gehariyaan : ఇటు దీపికా పదుకొనే... అటు అనన్య పాండే గ్లామర్ షోస్.. ‘గేహరియా’ కోసం రోజుకో ఫొటోషూట్..

Published : Feb 08, 2022, 05:29 PM ISTUpdated : Feb 08, 2022, 05:34 PM IST

బాలీవుడ్ భామలు దీపికా పదుకునే, అనన్య పాండే  ఇటీవల తమ గ్లామర్ షో డోస్ ను పెంచుతున్నారు. వీరిద్దరూ నటించిన చిత్రం ‘గెహరియా’ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా రోజుకో లేటెస్ట్ అవుట్ ఫిట్ లో నెటిజన్లను తమవైపు తిప్పుకుంటున్నారు.    

PREV
18
Gehariyaan : ఇటు దీపికా పదుకొనే... అటు అనన్య పాండే గ్లామర్ షోస్.. ‘గేహరియా’ కోసం రోజుకో ఫొటోషూట్..

తెలుగు ఆడియెన్స్ కి బాలీవుడ్ హీరోయిన్లు, గ్లామర్ బ్యూటీలు కొత్త అందాలను పరిచయం చేస్తున్నారు. తమ మూవీల కోసం అందాలను ఆరబోస్తున్న నెటిజన్లను తమవైపు తిప్పుకునేందుకు ఎంతో కష్టపడుతున్నారు.  

28

వీరిద్దరూ తెలుగులో సినిమాలు చేస్తూ తెలుగు ఆడియెన్స్ ను అలరిస్తున్నారు. వినోదంతోపాటు అందాల విందును వడ్డిస్తూ తమ సినిమాల ప్రమోషన్స్ ను చేస్తున్నారు. ఆ జాబితాలో దీపికా పదుకొనె, అనన్య పాండే పేర్లు  చేరిపోయాయి. 

38

దీపికా పదుకొనె(Deepika Padukone) బాలీవుడ్‌లో నెంబర్‌ వన్‌ హీరోయిన్‌. లేడీ ఓరియెంటెడ్‌ చిత్రాలు, కమర్షియల్‌ మూవీస్‌, రెండు మేళవించిన చిత్రాలు చేస్తూ తనకంటూ స్పెషల్‌ ఐడెంటిటీని ఏర్పర్చుకుంది. హిందీ చిత్ర పరిశ్రమలో తిరుగులేని స్టార్‌ హీరోయిన్‌గా రాణిస్తున్న దీపికా పదుకొనె ఇప్పుడు సౌత్‌పై ఫోకస్‌ పెట్టింది. 

48

తన అందం, అభినయంతోనూ నార్త్ ఆడియెన్స్ ను ఆకట్టుకున్న అనన్య పాండే కూడా సౌత్ లో తన మార్క్ చూపించేందుకు సిద్ధమైంది. విజయ దేవరకొండ, పూరీ జగన్నాథ్ కాంబినేషనల్ తెరకెక్కుతున్న మూవీ ‘లైగర్’లో విజయ్ సరన నటిస్తోంది అనన్య పాండే. ఈ మూవీతో తెలుగు ఆడియెన్స్ కు పరిచయం కానుండటంతో పాటు, టాలీవుడ్ కు ఎంట్రీ ఇవ్వనుంది.

58

వీరిద్దరూ బాలీవుడ్ మూవీ ‘గెహరియా’లో నటించారు. ప్రస్తుతం ఈ మూవీనుంచి రిలీజైన ట్రైలర్ రెండు వారాల్లోనే 40  మిలియన్ల వ్యూస్ ను దక్కించుకుంది. మరోవైపు, మూవీ టైటిల్ ట్రాక్ కు కూడా దూసుకుపోతోంది. ఇప్పటికే 30 మిలియన్ల వ్యూస్ కు చేరుకుంది. 

68

కాగా, తాజాగా సోనీ మ్యూజిక్ వారు ‘గెహరియా’ మూవీ ఫుల్ ఆల్బమ్ ను రిలీజ్ చేసింది. ఈ సాంగ్స్ లో గెహరియా, దూబే, బేఖాబూ వంటి సాంగ్స్ సాంగ్స్ లవర్స్ ను బాగా ఆకట్టుకుంటున్నాయి. ఊహించిన రేంజ్ లో ఆడియెన్స్ నుంచి రెస్పాన్స్ వస్తోంది.

78

ప్రస్తుతం దీపికా  తెలుగులో ప్రభాస్‌తో `ప్రాజెక్ట్ కే` మూవీలో చేయనుంది. ఈ చిత్రానికి `మహానటి` ఫేమ్‌ నాగ్‌ అశ్విన్‌ దర్శకుడు. ఐదు వందల కోట్లతో ఇంటర్నేషనల్‌ రేంజ్‌లో ఈ చిత్రాన్ని నిర్మాత అశ్వనీదత్‌ నిర్మిస్తున్నారు. అలాగే అనన్య పాండే కూడా ‘లైగర్’ మూవీలో నటించింది. ఆగస్టు 25న ఈ మూవీ వరల్డ్ వైడ్ రిలీజ్ కానుంది. 

88

ఫిబ్రవరి 11న ఓటీటీ వేదికన అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజ్ కానుంది. ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా దీపికా, అనన్య లేటెస్ట్ అవుట్ ఫిట్ నెటిజన్లకు దర్శనిమిస్తున్నారు. తాజాగా అనన్య రెండు, మూడు గంటల వ్యవధిలోనే మూడు రకాల అవుట్ ఫిట్ లో కనిపించింది. దీపికా కూడా తాజాగా మరిన్ని ఫొటోలను తన అభిమానులతో పంచుకుంటూ ‘గెహరియా’ రిలీజ్ డేట్ ను గుర్తు చేసింది.
 

click me!

Recommended Stories