సుశాంత్ మృతిపై సినిమా.. బాలీవుడ్‌ ముసుగు తీసేస్తాడట!

First Published | Jun 19, 2020, 4:03 PM IST

బాలీవుడ్‌ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ ఆత్మహత్య సృష్టించిన ప్రకంపనలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా ఓ నిర్మాత సుశాంత్ మరణం నేపథ్యంలో సినిమాను తెరకెక్కించేందుకు రెడీ అయ్యాడు. ఈ మేరకు ప్రకటన చేసిన సదరు నిర్మాత బాలీవుడ్‌ ముసుగు తీస్తానంటూ గట్టి ప్రకటనే చేశాడు.

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్యకు కారణం ఇప్పటికీ మిస్టరీనే. అయితే జూన్‌ 14న సుశాంత్ మరణం తరువాత చాలా విషయాలు తెర మీదకు వచ్చాయి. ముఖ్యంగా నెపోటిజం, బాలీవుడ్‌లో కొంతమంది పెద్దల ఆదిపత్యం లాంటి అంశాలపై తీవ్రస్థాయిలో విమర్శలు వినిపిస్తున్నాయి.
తాజాగా సుశాంత్ కథతో సినిమాను తెరకెక్కించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. ఈ సినిమాకు సుసైడ్‌ ఆర్‌ మర్డర్‌? (ఆత్మహత్య లేక హత్య?) అనే టైటిల్‌ను ఫిక్స్ చేసినట్టుగా ప్రచారం జరుగుతోంది.

చిత్ర నిర్మాత శేఖర్‌ గుప్తా నవభారత్‌ టైమ్స్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కీలక విషయాలను వెల్లడించాడు. ఇండస్ట్రీలో నెలకొన్న మోనోపలిని ప్రశ్నించేందుకే ఈ సినిమాను రూపొందిస్తున్నట్టుగా వెల్లడించాడు నిర్మాత శేఖర్‌ గుప్తా.
బాలీవుడ్‌ ఇండస్ట్రీలోని సమస్యలను ఎత్తి చూపటమే తన ఇంటెన్షన్‌ అని చెప్పారు విజయ్‌. అంతేకాదు సినిమాతో సుశాంత్‌కు ఎదురైన అన్ని సమస్యలను ప్రస్థావించనున్నామని వెళ్లడించాడు.
`సినిమా ద్వారా బాలీవుడ్‌ను ఎక్స్‌పోజ్ చేయబోతున్నాం. ప్రస్తుతం ఇండస్ట్రీకి సంబంధం లేనివారు పరిశ్రమలోకి వస్తే వారికి ఎంత టాలెంట్‌ ఉన్నా ఎదగటం లేదు. అందుకు ఇండస్ట్రీలో ఉన్న మాఫియానే కారణం. ఈ మాఫియాను నేను అంతం చేయాలనుకుంటున్నాను. సుశాంత్ ను ఆత్మహత్య చేసుకునేంతగా వేధించిన పరిస్థితులను కూడా ఎత్తి చూపించనున్నాను` అని తెలిపాడు.
కేవలం సుశాంత్ గురించే కాదు ఇండస్ట్రీలో ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్న ఇతర హీరోల గురించి కూడా సినిమాలో చూపించబోతున్నామని చెప్పాడు విజయ్‌.
అయితే ఈ ఈ సినిమా బయోపిక్‌ కాదు సుశాంత్‌ జీవితం ఆధారంగా కొన్ని సంఘటనల నేపథ్యంలో రూపొందుతున్న సినిమా అని తెలిపారు. ఈ సినిమా ద్వారా బాలీవుడ్‌లో ప్రపంచానికి తెలియని సీక్రెట్స్‌ను బయటపెడతానని వెల్లడించాడు నిర్మాత విజయ్.
సుశాంత్ మరణం నుంచి ఆయన కుటుంబం ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. 15న సుశాంత్ అంత్యక్రియలు పూర్తి కాగా 18న అస్తికలను కుటుంబం సభ్యులుంగా నదిలో నిమజ్జనం చేశారు.

Latest Videos

click me!