ఇండస్ట్రీకి మరో నేషనల్ క్రష్ దొరికింది, ఎవరీ మేధా శంకర్..

Published : Jan 10, 2024, 10:33 AM IST

మేధా శంకర్ .. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఫిల్మ్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారిన పేరు. రష్మిక మందన్న, త్రిప్తి డ్రిమీ ని దాటుకుని ఒక్క సినిమాతో నేషనల్ క్రష్ గామారింది హీరోయిన్. ఇంతకీ ఎవరీ మేధా శంకర్..? 

PREV
17
ఇండస్ట్రీకి మరో నేషనల్ క్రష్ దొరికింది, ఎవరీ మేధా శంకర్..

ఫిల్మ్ ఇండస్ట్రీకి కొత్త నేషనల్ క్రష్ దొరికింది. ఇప్పటి వరకూ మనకు తెలిసిన నేషనల్ క్రష్ అంటే హీరోయిన్ రష్మిక మందన్నా.. ఆమె తరువాత తాజాగా యానిమల్ సినిమాతో త్రిప్తి డిమ్రీ నేషనల్ క్రష్ గా మారింది. ఆమె వైరల్ అవుతుండగానే.. మరో హీరోయిన్ నేషనల్ క్రష్ గా పేరు తెచ్చుంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా మారుమోగుతున్న సినిమా 12th fail. 
 

27

చిన్నసినిమాగా రిలీజ్ అయ్యి.. థియేటర్లలో రచ్చ రచ్చ చేసిందీమూవీ. ఐపీఎస్ అధికారి మనోజ్ కుమార్ శర్మ రియల్ లైఫ్ స్టోరీ ఆధారంగా వచ్చిన చిత్రం ‘ట్వెల్త్ ఫెయిల్’ 12th Fail. గతేడాదే ప్రేక్షకుల ముందుకు వచ్చి విజయవంతమైంది. అంతే కాదు..ప్రపంచ సినిమాలకు రేటింగ్ ఇచ్చే ఇంటర్నెట్ మూవీ డేటా బేస్ (IMDB) సంస్థ ఈ చిత్రానికి అత్యధిక రేటింగ్ ను ఇచ్చింది. 
 

37

అయితే ఈసినిమాలో మీర్జాపూర్ వెబ్ సిరీస్ ఫేమ్ విక్రాంత్‌ మెస్సీ హీరోగా నటించగా, మేథా శంకర్‌ హీరోయిన్‌గా నటించింది. ఇక ఈసినిమాతో మేధా శంకర్ పాపులారటి సాధించింది. బాలీవుడ్ లో సినిమాలు చేసుకుంటూ వస్తున్న మేథా పెద్దగా  ఆడియన్స్ కు తెలిసింది లేదు. కాని ఈసినిమాతో ఆమె ఒక్క సారిగా వెలుగులోకి వచ్చింది. 
 

47

ప్రస్తుతం మేధాశంకర్ పాపులారిటీ ఏవిధంగా ఉందంటే.. ఆమె గ్లామర్ కు నెటిజన్లు ఫిదా అవ్వడంతో పాటు.. ఆమెను ఫాలో అయ్యేవారి సంఖ్య కూడా పెరిగింది. మేధాను యానిమల్ బ్యూటీ త్రిప్తి దిమ్రీతో పోలుస్తూ.. కొత్త నేషనల్ క్రష్ వచ్చిందంటూ బ్యూటీ ప్రియులు పండగ చేసుకుంటున్నారు. అంతే కాదు సోషల్ మీడియాలో ఆమెకు నేషనల్ క్రష్ అంటూ.. ఓటింగ్ కూడా చేస్తున్నారు. 
 

57

నోయిడాకు చెందిన  మేధా శంకర్ మోడల్ గా తనకెరీర్ ను స్టార్ట్ చేసింది. అటు మోడలింగ్ లో.. ఇటు నటనలో తన సత్తా చాటింది బ్యూటీ.  ఫ్యాషన్ మేనేజ్ మెంట్ కోర్స్ చేసిన ఆమె... బాలీవుడ్ లో సినిమాలు, వెబ్ సిరీస్ లతో సందడి చేస్తోంది. అంతే కాదు.. తన బ్యూటీతో ఫ్యాన్స ను మెస్మరైజ్ చేస్తూ వస్తోంది. 

67

సోషల్ మీడియాలో మేధా చేసే హంగామాం అంతా ఇంతా కాదు.. లేత అందాలతో కుర్రకారును ఆకర్షించి.. ఘాటు అందాలతో ఉక్కిరిబిక్కిరి చేస్తుంటుంది. గతంలోనే ఆమెకు ఫాలోయింగ్ చాలా ఉండేది.. ఇక అది కాస్తా.. ఈ సినిమాతో డబుల్ అయ్యింది. మిలియన్ల కొద్ది ఫ్యాన్స్ ఆమెను ఫాల్ అవుతున్నారు. 
 

77

సోషల్ మీడియాలో మేధా చేసే హంగామాం అంతా ఇంతా కాదు.. లేత అందాలతో కుర్రకారును ఆకర్షించి.. ఘాటు అందాలతో ఉక్కిరిబిక్కిరి చేస్తుంటుంది. గతంలోనే ఆమెకు ఫాలోయింగ్ చాలా ఉండేది.. ఇక అది కాస్తా.. ఈ సినిమాతో డబుల్ అయ్యింది. మిలియన్ల కొద్ది ఫ్యాన్స్ ఆమెను ఫాల్ అవుతున్నారు. 
 

Read more Photos on
click me!

Recommended Stories