ఆరోజు ప్రమాదం, నేడు మరణం.. కత్తి మహేష్ ఇలా దూరం అయ్యారు!

First Published Jul 10, 2021, 6:43 PM IST

నటుడు దర్శకుడు, సినీ విమర్శకుడు కత్తి మహేష్ ఇకలేరు. నేడు ఆయన చెన్నైలో మృతి చెందారు. జూన్ 6వ తేదీన నెల్లూరు జిల్లా, కొడవలూరు మండలం, చంద్రశేఖర్ పురం జాతీయ రహదారిపై కత్తి మహేష్ ప్రయాణిస్తున్న ఇన్నోవా కారు, వెనుక నుండి లారీని ఢీకొట్టింది.

ఈ ప్రమాదం జరిగిన వెంటనే కత్తి మహేష్ ని నెల్లూరు మెడికేర్ హాస్పిటల్ లో చేర్చడం జరిగింది. ఈ ప్రమాదంలో కత్తి మహేష్ తలకి బలమైన గాయాలు అయ్యాయి. ఈ ప్రమాదంలో కత్తి మహేష్ తలకుకి బలమైన గాయాలు అయ్యాయి.
undefined
అనంతరం మెరుగైన వైద్యం కోసం కత్తి మహేష్ ని చెన్నైలోని అపోలో ఆసుపత్రికి తరలించారు. కత్తి మహేష్ ఆరోగ్యం విషమంగా ఉన్నట్లు మీడియాలో కథనాలు రావడం జరిగింది. ఈ కథనాలను ఆయన మిత్రులు ఖండించారు. కత్తి మహేష్ కోలుకుంటున్నారని, తప్పుడు ప్రచారాలు చేసి ఆయన కుటుంబ సభ్యులను ఆందోళనకు గురి చేయవద్దని విజ్ఞప్తి చేశారు.
undefined
కత్తి మహేష్ వైద్య ఖర్చుల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీఎం సహాయ నిధి నుంచి రూ. 17 లక్షలు విడుదల చేసింది. ఈ మేరకు అధికారికంగా ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం నుంచి లేఖ విడుదల చేశారు. రెండు వారాలుగా వైద్యుల పర్యవేక్షణలో కత్తి మహేష్ కి వైద్యం అందించారు. ఓ దశలో కత్తి మహేష్ ఆరోగ్యం నిలకడగా ఉందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. చివరకు ఆయన ప్రాణాలు కాపాడలేకపోయారు.
undefined
47 ఏళ్ల కత్తి మహేష్ నటుడిగా ఎడారి వర్షం అనే చిత్రంతో మారారు. బాలగంగాధర్ తిలక్ నవల ఆధారంగా ఆ మూవీ తెరకెక్కింది. మిణుగురు అనే మూవీకి సహరచయితగా పనిచేశారు. మిణుగురులు ఆస్కార్ లైబ్రరీ కోర్ కలెక్షన్స్ లో స్థానం దక్కించుకున్న మొదటి తెలుగు స్క్రిప్ట్ కాగా, 2014 బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో పోటీకి నిలిచిన మొదటి తెలుగు సినిమాగా నిలిచింది.
undefined
పెసరట్టు అనే చిత్రానికి కత్తి మహేష్ దర్శకత్వం వహించారు. హృదయ కాలేయం, కొబ్బరి మట్ట, అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు, క్రాక్, నేనే రాజు నేనే మంత్రి చిత్రాల్లో కత్తి మహేష్ నటించారు.
undefined
ఇక పవన్ కళ్యాణ్ పై అనేక విమర్శలు చేసిన కత్తి మహేష్ వివాదాలతో చాలా పాప్యులర్ అయ్యారు. కాటమరాయుడు మూవీకి నెగిటివ్ రివ్యూ ఇచ్చిన కత్తి మహేష్ పై పవన్ ఫ్యాన్స్ దాడికి దిగడం జరిగింది. అలాగే రామాయణం పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కత్తి మహేష్ గతంలో నగర బహిష్కరణకు గురి కావడం జరిగింది.
undefined
click me!