సీనయ్య ఆగిపోయింది.. రాజమౌళి సింహాద్రి రీమేక్ చేస్తా... అందుకే గ్యాప్ వస్తుంది!

First Published Jul 10, 2021, 5:02 PM IST

ఈ తరం దర్శకులలో మాస్ చిత్రాలలో స్టార్ గా ఎదిగారు వివి వినాయక్. అరంగేట్రం ఆది లాంటి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఆయన... చెన్నకేశవరెడ్డి, దిల్,ఠాగూర్ వంటి బ్లాక్ బస్టర్స్ తో అనతికాలంలోనే టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు.

వివి వినాయక్ చేసిన చిత్రాలలో చాలా వరకు విజయాలు అందుకున్నాయి. ఇక వినాయక్ గత చిత్రం ఇంటెలిజెంట్ ఘోరపరాజయం చవిచూసింది. దీనితో వివి వినాయక్ జోరు తగ్గింది. ఇక సీనయ్య మూవీతో హీరోగా మారడానికి సిద్ధం అయ్యారు. ప్రకటనకే పరిమితమైన ఆ మూవీ ముందుకు సాగలేదు. ప్రస్తుతం బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా ఛత్రపతి హిందీ రీమేక్ కి దర్శకత్వం వహిస్తున్నారు వివి వినాయక్. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు.
undefined
హిందీలో మొదటిసారి దర్శకత్వం చేస్తున్న అనుభవం ఎలా ఉందని అడుగగా.. హిందీలో చేయడం సరికొత అనుభూతి పంచుతుంది. అక్కడ చిత్రీకరణ పద్ధతి, ప్రణాళిక ప్రకారం నడుస్తుంది. లైన్ ప్రొడ్యూసర్ చెప్పిన దానిని అందరూ పాటించాలి. ఇక హిందీ చిత్రాల స్థాయి ఎక్కువ, మన ఆలోచనలు మరింత భారీగా చూసుకోవచ్చు. ఛత్రపతి షూటింగ్ హైదరాబాద్ లో జులై 15నుండి జరగనుంది.. అని అన్నారు.
undefined
మన తెలుగు సినిమాల హిందీ వర్షన్స్ ఇంటర్నెట్ లో విశేష ఆదరణ దక్కించుకుంటున్నాయి. హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సినిమాలను హిందీ ప్రేక్షకులు అమితంగా చూస్తారు. ఇది గమనించిన పెన్ స్టూడియోస్ అధినేత జయంతి లాల్ గడ ఛత్రపతి రీమేక్ కోసం బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ని ఎంచుకున్నారు. ఛత్రపతి హిందీ రీమేక్ హక్కులు, ఆయన దగ్గరే ఉన్నాయి.
undefined
హిందీ నేటివిటీకి తగ్గట్లుగా రచయిత విజయేంద్ర ప్రసాద్ కొన్ని మార్పులు సూచించారు. ఈ స్క్రిప్ట్ పై టీమ్ గా పనిచేశాం. అయితే రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ లో బిజీగా ఉండడంతో ఆయనను కలవలేదు.
undefined
ఇక రాజమౌళి సినిమాల్లో రీమేక్ చేయాలని అనిపిస్తే సింహాద్రి మూవీ ఎంచుకుంటా.. ఎందుకంటే అది ఓ గొప్ప స్క్రిప్ట్.
undefined
కామెడీ, హీరోయిజం, సాంగ్స్.. ఇవన్నీ మాస్ అంశాలు. ఇవన్నీ సమపాళ్లలో చక్కగా చెప్పగలిగితే సినిమా మంచి విజయం సాధిస్తుంది. అయితే మంచి కథ కుదరాలి.
undefined
ఇటీవల ఇండియన్ గవర్నమెంట్ సినిమాటోగ్రఫీలో చేసిన సవరణలు నిరాశ పరిచాయి. క్రియేటివిటీకి ఈ కొత్త చట్టాలు అడ్డంకులు అని చెప్పాలి. సినిమాకు సెన్సార్ ఉండగా ఇలాంటి ఆంక్షలు అవసరం లేదు. డిజిటల్ కంటెంట్ పై దృష్టి సారిస్తే బాగుంటుంది.
undefined
ఇక సినిమాల మధ్య గ్యాప్ అనుకోకుండా వస్తుంది. ఓ మూవీ చేద్దాం అనుకుంటే అది కుదరలేదు. హీరోగా సీనయ్య ప్రారంభించాం, అది కూడా సంతృప్తి కరంగా లేకపోవడంతో ఆపేశాం. ప్రస్తుతం హిందీ ఛత్రపతి చేస్తున్నాను.

vv vinayak

కరోనా అత్యంత దారుణ పరిస్థితులకు కారణం అయ్యింది. సినిమా పరిశ్రమ స్తంభించిపోయింది. ఇక ఖాళీ సమయాలలో నేను సినిమాలు చూస్తాను. అయితే వెబ్ సిరీస్ లు చేసే ఆలోచన లేదు. వరుసగా సినిమాలు చేయాలని అనుకుంటున్నాను.
undefined
click me!