షారుక్, ప్రియాంక చోప్రా, ఆమిర్ ఖాన్, కరణ్ జోహార్ సరోగసి ద్వారా తల్లీతండ్రులైన స్టార్స్ ఇంకెవరు...?

Published : Jun 02, 2022, 04:15 PM IST

ఆడవాళ్లకి తల్లి అవ్వడం అనేది ఒక అద్భుతమైన అనుభూతి. చాలామంది ఆడవాళ్ళు కూడా తమ జీవితంలో ఏదైనా గుర్తుండిపోయే క్షణాలు ఏవి అంటే వాటిలో తల్లి అవ్వడం అని ఖచ్చితంగా చెప్తారు. హీరోయిన్లు కూడా ఈ విషయంలో మినహాయింపు ఏమీ కాదు. రీసెంట్ గా కాజల్, సంజనా లాంటి హీరోయిన్లు బిడ్డల్ని కని.. మాతృత్వపు మధురిమలు అనుభవించారు. కాని కొంత మంది స్టార్స్ మాత్రం పిల్లల కోసం అద్దె గర్బాలను ఆశ్రయిస్తున్నారు. మరి సరోగసి ద్వారా తల్లీ తండ్రులుగా మారిన స్టార్స్ ఎవరు..? 

PREV
19
షారుక్, ప్రియాంక చోప్రా, ఆమిర్ ఖాన్, కరణ్ జోహార్ సరోగసి ద్వారా తల్లీతండ్రులైన స్టార్స్ ఇంకెవరు...?

 ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టార్లుగా వెలుగు వెలుగుతున్న హీరోయిన్లు చాలా మంది పిల్లల్ని కన్నారు. కొంత మంది సహజంగా పిల్లల్ని కన్నారు. కానీ వీరిలో కొంత మంది హీరోయిన్లు మాత్రం సరోగసీ పద్ధతి ద్వారా పిల్లల్ని కన్నారు. అలా సరోగసీ ద్వారా పిల్లల్ని కన్న నటులు ఎవరో ఇప్పుడు చూద్దాం.

29

ముందుగా మన టాలీవుడ్ ను చూసుకుంటే.. మంచువారి ఆడపడుచు.. మల్టీ టాలెంటెడ్ లక్ష్మీ మంచు సరోగసీ పద్ధతి ద్వారా ఒక పాపకు జన్మనిచ్చారు. ఆ పాపను అల్లారు ముద్దుగా  పెంచుకుంటుంది. వీడియోలు చేసి.. తన యూట్యూబ్ ఛానెల్ లో కూడా పోస్ట్ చేస్తోంది మంచు లక్ష్మీ. 

39

బాలీవుడ్ లో స్టార్స్ చాలా మంది అద్దె గర్బంతో పిల్లల్ని కన్నవారే. ముఖ్యంగా స్టార్ సెలబ్రిటీలు ఇందులో ఎక్కువగా ఉన్నారు. అందులో అమీర్ ఖాన్ కూడా ఉన్నారు. ఆయన రెండోవభార్య కిరణ్ రావు దంపతులు కూడా సరోగసీ పద్ధతిని ఆశ్రయించారు.ఈ మధ్యే విడాకులు కూడా తీసుకున్న ఈ జంట.. ప్రస్తుతం వీరి బాబు కోసం కలుసుకుంటున్నారు. 
 

49

బాలీవుడ్ నుంచి హలీవుడ్ చేరిన హీరోయిన్ ప్రియాంక చోప్రా. హాలీవుడ్ పాప్ సింగర్, తనకంటే చిన్నవాడు అయిన నిక్ జానస్ ను పెళ్లి చేసుకున్న ప్రియాంక కూడా సరోగసీ ద్వారా  ఒక పాపకు జన్మనిచ్చింది. అయితే ఈ విషయం సీక్రేట్ గా ఉన్న ప్రియాంక ఈ మద్యే ఈ రహస్యం రివిల్ చేసింది. 

59

బాలీవుడ్ ఖాన్స్ లో కింగ్ ఖాన్,  బాలీవుడ్ బాద్ షా.. షారుక్ ఖాన్, గౌరీ దంపతులు కూడా సరోగసి ద్వారా పిల్లల్ని కన్నారు. అయితే వారు వారి మూడవ సంతానం కోసం సరోగసీ పద్ధతిని ఆశ్రయించారు.

69

ఈ మద్య వరుస వివాదాలతో బాలీవుడ్ లో ప్రకంపనలు సృష్టించిన హీరోయిన్ శిల్పా శెట్టి కూడా సరోగసి ద్వారా ఓ పాపకు జన్మనిచ్చింది. శిల్ప బాలీవుడ్ ప్రోడ్యూసర్ రాజ్ కుంద్రనువివాహం చేసుకున్నారు.  అయితే ఈ మధ్యే ఓ  కాంట్రవర్సీలో ఇరుక్కున్నాడు రాజ్ కుంద్ర. ఈ దంపతులు ఈ మధ్య సరోగసీ ద్వారా వారికి ఒక పాప పుట్టినట్టు ప్రకటించారు.
 

79

బాలీవుడ్ మోస్ట్  ఎలిజిబుల్  డైరెక్టర్ అండ్  ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ పెళ్లి చేసుకోకుండా ఒంటరిగానే ఉన్నాడు. ఆయన తన తల్లిలో కలిసి ఉంటున్నారు. ఆయన పిల్లల కోసం  సరోగసీ పద్ధతిని ఎంచుకున్నారు. సరోగసి ద్వారా కరణ్ కు కవల పిల్లలు కలగడంతో.. వారితో తన జీవితాన్ని హ్యాపీగా గడిపేస్తున్నడు. 
 

89

వీరే కాదు బాలీవుడ్ ఐటమ్ బాంబ్ సన్నీలియోన్ దంపతులు కూడా సరోగసీ ద్వారా బిడ్డకు జన్మనిచ్చారు. అంతే కాదు సన్నీ కొంత మంది అనాధలను కూడా అడాప్ట్ చేసుకుని.. సొంత బిడ్డలకన్నా ఎక్కువగా చూసుకుంటోంది. 

99

వీళ్లే కాదు బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ ప్రీతి జింటా , బాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ ఏక్తా కపూర్, బాలీవుడ్ స్టార్ యాక్టర్ తుషార్ కపూర్ లాంటి చాలా మంది స్టార్స్  పిల్లలు రకరకాల కారణాల వల్ల.. పిల్లల్ని కనాలన్న తమ కోరికను సరోగసి ద్వారా తీర్చుకుంటున్నారు. అందులో కరణ్, తుషార్ కపూర్ లాంటి వారు సింగిల్ పేరెంట్స్ గా ఉండటానికి ఇష్టపడుతున్నారు. 

click me!

Recommended Stories