Prema Entha Madhuram: రాగసుధని వెతుకుతున్న అను.. ఆమె గురించి అసలు నిజం బయట పడటంతో!

Navya G   | Asianet News
Published : Jan 26, 2022, 10:04 AM IST

Prema Entha Madhuram: బుల్లితెరపై ప్రసారమవుతున్న ప్రేమ ఎంత మధురం (Prema Entha Madhuram) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. మంచి ప్రేమ కథ నేపథ్యంలో ఈ సీరియల్ కొనసాగుతుంది. ఇక ఈ రోజు ఈ సీరియల్ ఎపిసోడ్ హైలెట్ ఏంటో చూద్దాం.  

PREV
16
Prema Entha Madhuram: రాగసుధని వెతుకుతున్న అను.. ఆమె గురించి అసలు నిజం బయట పడటంతో!

బీరంగూడ గుడి కి అను (Anu) తీసుకెళ్ళమని అంటుందని ఆర్య తన తల్లితో చెబుతాడు. ఇక ఆమె ఆలోచనల్లో పడుతూ జాగ్రత్తగా వెళ్ళమని అంటుంది. పక్కనే ఉన్న మాన్సీ తన మాటలతో రెచ్చగొడుతూ ఉంటుంది. ఇక రాగసుధ (Ragasudha) వెంబడి కొందరు వెంటపడటంతో అక్కడినుంచి తప్పించుకుంటుంది.
 

26

అను (Anu), ఆర్య కారులో గుడికి బయలుదేరుతారు. ఇక అను ఆర్య తో సార్ మీకు ఇష్టం లేకపోయినా నేను గుడికి తీసుకొస్తున్నానా అంటూ బాధపడుతూ ఉండటంతో ఆర్య (Arya) అలాంటిదేమీ లేదని ధైర్యం చెబుతాడు. అను తన మనసులో రాగసుధ గురించి ఆలోచిస్తూ ఉంటుంది.
 

36

తను కనిపిస్తే మన జీవితం మొత్తం మళ్లీ కొత్తగా ప్రారంభించాలి అని అనుకుంటుంది. అందుకే ఇక్కడికి తీసుకు వస్తున్నానని అనుకుంటుంది. ఇక రఘుపతి (Raghupati) తన బంగారమంతా పోయిందని బాధపడుతూ ఉంటాడు. ఇక పోయిందంత దక్కించుకోవటానిక మాన్సీతో (Maanasi) మాట్లాడాలి అని అనుకుంటాడు.
 

46

ఇక రాగసుధ (Ragasudha) వాళ్ల నుంచి తప్పించుకోవడానికి ఒక వాహనం ఎక్కగా ఆ వాహనం ఓ చోట ఆగుతుంది. ఇక తిరిగి రాగసుధ ఆర్య (Arya) వాళ్ళ ఆఫీస్ కి వెళ్తుంది. అక్కడ రఘుపతి ఎవరో వచ్చారు అని గమనించి అక్కడే వెతుకుతూ వుంటాడు. ఎవరో ఆడవాళ్ళు వచ్చారు అని అనుకుంటాడు.
 

56

ఆర్య (Arya), అను గుడికి వెళ్తారు. ఇక అను ఆర్య సార్ పక్కన ఉంటే రాగసుధ గురించి తెలుసుకోవడం కష్టమని అనుకొని.. పూజ సామాన్లు తీసుకొని వస్తాను అని ఆర్య తో చెప్పి అక్కడి నుంచి బయటికి వస్తుంది. ఇక బయట రాగసుధ (Ragasudha) గురించి అందర్నీ అడుగుతూ ఉంటుంది.
 

66

ఇక ఆ ఫోటో అక్కడ గాలికి ఎగిరి ఒక పూజారి కాళ్ల దగ్గర పడుతుంది. ఇక ఆ పూజారి ఆ ఫోటో చూడటంతో అను అతడిని కూడా అడుగుతుంది. ఇక పూజారి తనకు ఆవిడ తెలుసని 20 ఏళ్ల క్రితం గుడి కి వచ్చి రాజనందిని (Rajanandhini) పేరు మీద అర్చన చేయిస్తుందని అనటంతో అను (Anu) షాక్ అవుతుంది.

click me!

Recommended Stories