తెలుగు సినిమా వాకిట్లో వికసించని పద్మాలు.. కారణం ఏమిటీ..?

First Published Jan 26, 2022, 9:13 AM IST

గణతంత్రదినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మా అవార్డుల్లో తెలుగు సినిమాకు మరోసారి మొండిచేయి ఎదురైంది. ప్రపంచ స్థాయి గుర్తింపు పొందుతున్న టాలీవుడ్ నుంచి ఎందరో మహానుభావులు ఉన్నా.. పద్మా అవార్దుల విషయంలో చిన్న చూపు తప్పలేదు.

పద్మ అవార్డుల విషయంలో మరోసారి తెలుగు సినిమా పరిశ్రమకు అవమానం తప్పలేదు. టాలీవుడ్ నుంచి ఎందరో మహామహులు ఉన్నా.. సినిమాకి మొండి చేయి తప్పలేదు. ఎప్పటిలాగానే ఈసారి కూడా పద్మా అవార్డ్ ల విషయంలో.. టాలీవుడ్‌ ప్రముఖుల పేర్లు ఈసారి అస్సలు కనిపించలేదు. ఈ విషయంలో రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు అన్న విమర్షలు గట్టిగా వినిపిస్తున్నాయి.

నిజానికి తెలుగు చిత్ర పరిశ్రమ ఇప్పుడు జాతీయ.. అంతర్జాతీయ స్థాయిలో తన సత్తా చూపిస్తోంది. ముఖ్యంగా బాలీవుడ్ ను కూడా దాటుకుని పరుగులు తీస్తోంది. ఇప్పటికీ టాలీవుడ్ లో అలనాటి తారలు ఎందరో ఉన్నారు. అవార్డ్ లకు సత్కారాలకు నోచుకోని లెజెండరీ యాక్టర్స్ ఉన్నారు. అందులో ముఖ్యంగా కైకాల సత్యనారాయణ లాంటి పాతతరం నటులు ఇప్పటికీ పద్మా అవార్డ్ లు దక్కలేదు. నట సార్వభౌముడిగా పేరుగాంచిన కైకాలకు పద్మశ్రీ కూడా రాకపోవడం ఆశ్యర్యనికి గురి చేస్తుంది.

ఈ దఫా అవార్డ్ లలో.. అలనాటి నటి షావుకారు జానకిని పద్మ వరించినా, అది మన తెలుగు రాష్ట్రాల నుంచి రాలేదు.  తమిళనాడు ప్రభుత్వ సిఫార్సుతో జానకికి పద్మా ప్రకటించారు. తెలంగాణా నుంచి జానపద కళాకారుడు.. భీమ్లా నాయక్ పాట ఫేమ్ మొగిలయ్యకు పద్మశ్రీ ప్రకటించింది కేంద్రం. అయితే ఇంకా టాలీవుడ్ లో గౌరవించాల్సి పెద్దలు చాల మంది ఉన్నారు. వారిని మిస్మరించారన్న విమర్శలు ఉన్నాయి.

పక్క రాష్ట్రాల సిఫార్సుతో పద్మాలు దక్కించుకోవడం ఇదేం తొలిసారి కాదు. ఎస్‌.పి. బాలసుబ్రహ్మణ్యం పద్మ, పద్మభూషణ్‌, పద్మ విభూషణ్‌ పురస్కారాలు అందుకున్నది తమిళనాడు కోటా నుంచే. రాజమౌళికి పద్మశ్రీ కోసం కర్నాటక ప్రభుత్వం కృషి చేసింది. వీళ్లంతా మన తెలుగువాళ్లు. మన ప్రభుత్వాలు గౌరవించుకోవాల్సిన కళాకారులు. వాళ్లని మన ప్రభుత్వాలు విస్మరించారన్న విమర్షలు గట్టిగా వినిపిస్తున్నాయి.

ఇక ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు.. తెలుగు ప్రభుత్వం సినిమా వాళ్లకు ఇస్తూ వచ్చిన నంది అవార్డ్ లు సైతం ఇప్పుడు ఇవ్వడం లేదు. రాష్ట్రాలుగా విడిపోయిన తరువాత తెలంగాణ ప్రభుత్వం సింహా అవార్డ్స్  ఇస్తానంటూ ప్రకటించినా.. అది ఆచరణలోకి రాలేదు. అయితే ఇక్కడ రెండు రాష్ట్రాలుగా విడిపోయిన తరువాత అవార్డ్ ల విషయంలో .. ఎవరిని ఏ ప్రభుతవ్వం సిఫారసు చేయాలనే విషయంలో కన్ ఫ్యూజన్ ఏర్పడింది. దాంతో అసలు పట్టించుకోవడం మానేశారన్న వాదన వినిపిస్తుంది.

ఈ విషయంలో మార్పు రావాలని సినీ పరిశ్రమనుంచి డిమాండ్ వినిపిస్తుంది. ఇప్పుడు తెలుగు వారికి రెండు ప్రభుత్వాలు ఉన్నాయి. కాబట్టి తెలుగు కళాకారుళను ప్రాంతీయ బేధం లేకుండా రెండు ప్రభుత్వాలు సపోర్డ్  చేయాలంటున్నారు. పద్మా అవార్ద్ ల విషయంలో కూడా రెండు రాష్ట్రాలు కలిసి కళాకారులను గౌరవించుకోవలసిని అవసరం ఉంది అంటూన్నారు పెద్దలు.

click me!