ఈ ఏడాదే పెళ్లికి రెడీ అయిన కియారా అద్వాని - సిద్ధార్థ్‌, క్లారిటీ ఇచ్చిన మరో హీరో..

Published : Aug 24, 2022, 09:49 PM IST

బాలీవుడ్ లో లవ్ బార్డ్స్ వరుసగా పెళ్ళి పీటలెక్కుతున్నవేళ.. మరో జంట పెళ్ళికి సై అంటున్నారు. చాలా కాలంగా సస్పెన్స్ లో ఉన్న కియారా అద్వాని - సిద్థార్థ్ మల్హోత్రా పెళ్ళికి..ముహూర్తం ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. 

PREV
16
ఈ ఏడాదే పెళ్లికి రెడీ అయిన కియారా అద్వాని - సిద్ధార్థ్‌,  క్లారిటీ ఇచ్చిన మరో హీరో..

బాలీవుడ్‌ లవ్‌ బర్డ్స్‌ కియారా అద్వానీ-సిద్దార్థ్‌ మల్హోత్రాలు గత కొంతకాలంగా డేటింగ్‌లో ఉన్నరు కాని ఈ విషయాన్ని ఎప్పుడూ వారు ఒప్పుకోలేదు. ఈ రూమర్స్ పై ఎప్పుడూ స్పందించలేదు. ఎప్పటికప్పుడు తమ ప్రేమను సీక్రేట్ గా ఉంచుతూ వస్తున్నారు. కాని వీరి ప్రేమ గురించి బాలీవుడ్ అంతా ఫిక్స్ అయిపోయి ఉన్నారు. 

26

 కలిసి హాలీడే వెకేషన్స్‌కి వెళ్లడం, ముంబై రోడ్లపై చెట్టాపట్టాలేసుకుంటూ తిరగడం చేస్తుంటారు ఈ జంట. ఇలా చాలా సార్లు  మీడియా కెమెరాలకు  కూడా చిక్కింది జంట. దాంతో వీరిద్దరి మధ్య సమ్‌థింగ్‌, సమ్‌థింగ్‌ నడుస్తోందని అంతా ఫిక్స్‌ అయ్యారు. ఈ క్రమంలోనే కరణ్‌ జోహార్‌ టాక్ షో కాఫీ విత్‌ కరణ్‌ తమ ప్రేమ గురించి చెప్పకనే చెప్పింది ఈ జంట. 

36

రీసెంట్ గా ఈ టాక్  షోకు వచ్చిన సిద్ధార్థ్‌ మల్హోత్రా కియారాతో డేటింగ్‌పై పరోక్షంగా క్లారిటీ ఇచ్చాడు. కెరీర్‌ ప్లాన్‌ ఏంటని సిద్ధార్థ్‌ను కరణ్‌ ప్రశ్నించగా.. తాను లైఫ్ ను హ్యాపీగా.. బ్రైట్ గా జీవించాలని  కోరుకుంటున్నానని చెప్పాడు సిద్ధార్థ్‌.  కియారాతోనా? అని కరణ్‌ అనడంతో.. నవ్వుతూ.. ఆమె అయితే ఇంకా బాగుంటుందంటూ తమ ప్రేమ విషయాన్ని చెప్పకనే చెప్పాడు సిద్ధార్థ్‌. 
 

46

ఇక రీసెంట్ గా కరణ్ షోకి  హీరో షాహిద్‌ కపూర్‌తో కలిసి వచ్చింది కియారా అద్వాని.  ఈ షోలో సందడి చేసింది. ఈ సందర్భంగా తనకు పరిశ్రమలో అంత్యంత క్లోజ్‌ ఎవరని అడగ్గా షాహిద్‌ పేరు చెప్పింది కియారా. మరి  సిద్ధార్థ్‌తో ఉన్న రిలేషన్ షిప్ ఎలాంటిది అని కరణ్ జోహార్ అడగ్గా.. అతడు ఫ్రెండ్‌ కంటే ఎక్కువ అంటూ  సిగ్గుపడింది బ్యూటీ. 

56

ఇక ఇంతలో  షాహిద్‌ కల్పించుకుని ఈ ఏడాది చివర్లో ఎప్పుడైన బిగ్‌ అనౌన్స్‌మెంట్‌ రావోచ్చు రెడీగా ఉండండి అంటూ. షాహిద్ హింట్ ఇచ్చాడు.. అది సినిమాకు సంబంధించినది మాత్రం కాకపోవచ్చు అంటూ కియారా -  సిద్థార్థ్ ల పెళ్ళి గురించి చెప్పకనే చెప్పాడు. దీంతో సిద్ధార్థ్‌, కియారాలు త్వరలోనే గుడ్‌న్యూస్‌ చెప్పబోతున్నారని, ఈ ఏడాది చివర్లో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారంటూ బాలీవుడ్‌ మీడియాల్లో బ్రేకింగ్ న్యూస్ లు పడుతున్నాయి. 

66

ఎట్టకేలక లవ్వీ బాలీవుడ్ కపుల్స్.. పెళ్ళి చేసుకోబోతున్నరన్న వార్త వినగానే ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.  కియార-సిద్ధార్థ్‌ బిగ్‌ అనౌన్స్‌మెంట్‌ ఇవ్వబోతున్నారన్నమాట అంటూ నెటిజన్లు కామెంట్స్‌ చేస్తున్నారు. మరి ఈ ఏడాది చివర్లో బాలీవుడ్ లో పెళ్ళి బాజాలు మొగుతున్నట్టు తెలుస్తోంది. 

click me!

Recommended Stories