తెలుగు సినిమాల్లో అందగాడు అంటే శోభన్ బాబు పేరే చెబుతారు. అందుకే ఆయన్ని అంతా ముద్దుగా `సోగ్గాడు` అని పిలుస్తుంటారు. సోగ్గాడు అంటే కేవలం అందగాడిగా అలరించడమే కాదు, నటనతో మెప్పించాడు. ఇంటిళ్లిపాది ఆడియెన్స్ ని అలరించారు. అందుకే ఆయన ఎవర్ గ్రీన్ సోగ్గాడిగా నిలిచిపోయారు. ఆయన లేకపోయినా ఇప్పటికీ శోభన్ బాబు గురించి మాట్లాడుకుంటున్నామంటే అది ఆయన ప్రత్యేకత.
శోభన్ బాబుకి మాస్ ఆడియెన్స్ లో కంటే ఫ్యామిలీ ఆడియెన్స్ లోనే ఎక్కువ ఫాలోయింగ్ ఉంది. ఆయన్ని ఆడవాళ్లు బాగా ఇష్టపడేవారు. ఆయన సినిమాలంటే ఫ్యామిలీ ఫ్యామిలీలు బండ్లు కట్టుకుని సినిమాకి వెళ్లేవారు. ఫ్యామిలీ ఆడియెన్స్ తో థియేటర్లు కళకళలాడేవి. మరి సోగ్గాడు చేసిన మాయేంటి? ఎందుకు ఆయన్ని అంతగా ఇష్టపడేవారు? ఆ ట్రిక్ ఏంటి? అనేది చూస్తే,
అదే సమయంలో మహిళలకు చాలా రెస్పెక్ట్ ఇచ్చేవారు. శోభన్ బాబు సినిమాల్లో ఆడవారిని కించపరిచినట్టు ఒక్క సన్నివేశం కూడా ఉండదు, ఒకవేళ ఉన్నా, అవి ఆ పాత్రల్లో ఉండే నెగటివిటీ వల్ల వచ్చేది మాత్రమే. ఇలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు, అలాంటి సినిమాలే ఎక్కువగా చేశారు. అందుకే శోభన్‌బాబు అంటే ఆడవాళ్లు పడిచచ్చేశారు.
లేడీ ఫాలోయింగ్ ఆయకు ఎక్కువగా ఉండేది. ఇతర హీరోల్లా ఎక్కువగా యాక్షన్ సినిమాలు చేయకుండా ఇలా ఇంటిళ్లిపాది కలిసి చూసే సినిమాలే ఎక్కువగా చేశారు. సక్సెస్ అయ్యారు. ఆడవాళ్లు మెచ్చిన హీరో అయ్యారు. ఇప్పటికీ సోగ్గాడిగా నిలిచిపోయారు.
కానీ శోభన్ బాబులా ఆయన సమకాలీకులైన ఎన్టీఆర్, కృష్ణ, కృష్ణంరాజులకు ఇంతటి ఫాలోయింగ్ లేదు. మహిళలు శోభన్ బాబుని ఆరాధించినట్టుగా ఈ హీరోలను ఆరాధించలేదు. వీరంతా యాక్షన్ సినిమాలు చేశారు. మధ్య మధ్యలో కొన్ని చేసినా ఎక్కువగా యాక్షన్ మూవీస్ కే ప్రయారిటీ ఇచ్చారు.
ఎన్టీఆర్ పౌరాణిక చిత్రాలు చేశారు. కృష్ణ యాక్షన్ మూవీస్ చేశారు. కృష్ణంరాజు కూడా అదే పంథాలో వెళ్లారు. ఒక్క ఏఎన్నార్ మాత్రమే శోభన్ బాబు తర్వాత ఎక్కువగా ఫ్యామిలీ మూవీస్ చేశారు. అయితే ఆయన ప్రేమ కథలకు ప్రయారిటీ ఇచ్చారు. అలా ఈ విషయంలో శోభన్‌బాబుతో పోటీ పడలేకపోయారు.
ఆ తర్వాత జనరేషన్‌లో కూడా ఎవరూ ఆ దిశగా ఎక్కువగా ఫోకస్ పెట్టలేదు. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున కూడా యాక్షన్ చిత్రాల వైపే మొగ్గుచూపారు. చిరంజీవి పూర్తి కమర్షియల్ చిత్రాలతో రాణించారు.
బాలకృష్ణ ప్రారంభంలో కొన్ని ఫ్యామిలీ మూవీస్ చేసినా ఆ తర్వాత యాక్షన్ వైపే వెళ్లారు. నాగార్జున ప్రారంభంలో యాక్షన్ సినిమాలు ఆ తర్వాత లవ్ స్టోరీస్ చేశారు. అమ్మాయిల్లో ఫాలోయింగ్‌ని పెంచుకున్నారు. అయితే నాగ్‌ని కుర్ర అమ్మాయిలు ఇష్టపడ్డారు కానీ, ఫ్యామిలీ ఆడియెన్స్ నుంచి ఆ స్థాయిలో రెస్పాన్స్ లేదు.