ప్రాణంగా భావించే ఫ్రెండ్ విషయంలో ఊహించని రచ్చ? పవన్ కోసం వాళ్ళతో గొడవ పెట్టుకున్న అల్లు అరవింద్

Published : Jul 11, 2024, 03:06 PM IST

ఉస్తాద్ భగత్ సింగ్, హరిహర వీరమల్లు, ఓజి లాంటి చిత్రాలని పవన్ కళ్యాణ్ పూర్తి చేయాల్సి ఉంది. ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ గురించి తరచూ ఏదో ఒక రూమర్ వైరల్ అవుతూ ఉంటుంది. 2003లో జరిగిన ఒక సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.

PREV
18
ప్రాణంగా భావించే ఫ్రెండ్ విషయంలో ఊహించని రచ్చ?  పవన్ కోసం వాళ్ళతో గొడవ పెట్టుకున్న అల్లు అరవింద్

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎం గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన పవన్ కళ్యాణ్ పూర్తి చేయాల్సిన సినిమాలు కూడా పెండింగ్ లో ఉన్నాయి. ఉస్తాద్ భగత్ సింగ్, హరిహర వీరమల్లు, ఓజి లాంటి చిత్రాలని పవన్ కళ్యాణ్ పూర్తి చేయాల్సి ఉంది. ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ గురించి తరచూ ఏదో ఒక రూమర్ వైరల్ అవుతూ ఉంటుంది. 

28

2003లో జరిగిన ఒక సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఈ సంఘటన పవన్ కళ్యాణ్, నాగబాబు, అల్లు అరవింద్ కి సంబంధించినది. 2003లో పవన్ కళ్యాణ్. నాగబాబు, అల్లు అరవింద్ ఒక మీడియా సంస్థ ఆఫీస్ కి వెళ్లి వాగ్వాదానికి దిగారు. 

 

38

ఎందుకంటే ఆ మీడియా సంస్థ నిత్యం పవన్ కళ్యాణ్ ప్రతిష్టని దిగజార్చే విధంగా ఫేక్ వార్తలు ప్రచురిస్తూ ఉండేది. పవన్ కళ్యాణ్, పరిటాల రవి మధ్య ఒక ఫేక్ న్యూస్ సృష్టించి దానిని వైరల్ చేశారు. ఆ తర్వాత పరిటాల కుటుంబమే ఈ విషయంలో క్లారిటీ ఇచ్చింది అసలు పవన్ కళ్యాణ్ కి, పరిటాల రవికి ఎలాంటి సంబంధం లేదని వాళ్ళ ఫ్యామిలీ తెలిపారు. 

 

48

అదే విధంగా పవన్ కళ్యాణ్ కి ఇండస్ట్రీలో అతి తక్కువ మంది స్నేహితులు ఉన్నారు. ఉన్న కొద్దిమంది స్నేహితులని పవన్ కళ్యాణ్ ప్రాణంగా భావిస్తారు. ఆనంద్ సాయి, త్రివిక్రమ్,  ఖుషి డైరెక్టర్ ఎస్ జె సూర్య పవన్ కి బెస్ట్ ఫ్రెండ్స్. ఖుషి చిత్రం తర్వాత ఎస్ జె సూర్య, పవన్ మధ్య ఏదో జరిగినట్లు సదరు మీడియా సంస్థ ఫేక్ న్యూస్ క్రియేట్ చేసింది. 

58
allu aravind

ఖుషి షూటింగ్ లో పవన్ కళ్యాణ్.. ఎస్ జె సూర్యని కొట్టారని వార్త ప్రచురించింది. ఒక వైపు పరిటాల రవి గురించి ఫేక్ న్యూస్, మరో వైపు తన బెస్ట్ ఫ్రెండ్ ని కొట్టినట్లు ఫేక్ న్యూస్ సృష్టించడంతో పవన్ కళ్యాణ్.. నాగబాబు, అల్లు అరవింద్ తో కలసి ఆ మీడియా సంస్థ ఆఫీస్ కి వెళ్లారు. పవన్ కళ్యాణ్ ఆ ఆఫీస్ లో ఆందోళనకి దిగారు. 

68

అయితే అల్లు అరవింద్ మీడియా సంస్థ సిబ్బందితో గొడవ పడ్డారట. పవన్ పై రాసిన వార్తలకు ఆధారాలు ఇవ్వాలని అడగడంతో కొన్ని రోజులు సమయం కావాలని వాళ్ళు నీళ్లు నమిలినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. అల్లు అరవింద్.. పవన్ కళ్యాణ్ ని ఇలా ఫేక్ న్యూస్ లతో ఎందుకు టార్గెట్ చేస్తున్నారు అని వాళ్ళని ప్రశ్నించారట. 

78

ఇప్పుడు ఈ విషయం ఎందుకు వైరల్ గా మారింది అంటే.. ఇప్పుడు సదరు మీడియా సంస్థ అధినేత ఓ వివాదంలో అరెస్ట్ అయ్యారు. ఆ మీడియా సంస్థ పై కూడా ప్రస్తుతం ట్రోలింగ్ జరుగుతోంది. ఆంధ్ర ప్రదేశ్ కి సంబంధించిన వివాదాస్పద వార్తని ప్రచురించడం వల్ల ట్రోల్ చేస్తున్నారు. దీనితో ఫేక్ న్యూస్ సృష్టించే వారికి తగిన శాస్తి జరిగింది అంటూ నెటిజన్లు పోస్ట్ చేస్తున్నారు. 

88

పవన్ కళ్యాణ్, ఎస్ జె సూర్య మధ్య అంత గొడవ నిజంగా జరిగి ఉంటేఆ తర్వాత వీళ్లిద్దరి కాంబినేషన్ లో కొమురం పులి చిత్రం వచ్చేది కాదు. ఇటీవల ఎస్ జె సూర్య.. ఇండియన్ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ లో తన మిత్రుడు పవన్ కళ్యాణ్ ని అభినందించారు. పవన్ డిప్యూటీ సీఎం అయినందుకు సంతోషంగా ఉందని.. ఒకరోజున పవన్ ముఖ్యమంత్రి కూడా అవుతారని ఆకాంక్షించారు. 

Read more Photos on
click me!

Recommended Stories