ఇంతలో నామినేషన్స్ లో ఉన్న వారిలో ఒకరిని సేవ్ చేసే ప్రక్రియ మొదలైంది. ఆదిరెడ్డి, శ్రీసత్య, రేవంత్, ఫైమా నామినేషన్స్ లో ఉన్నారు. వారిలో రేవంత్ మాత్రమే సేవ్ అయ్యాడు. దీనితో రేవంత్ తనకి ఓట్లు వేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపాడు. నాకు కుమార్తె పుట్టింది. అక్కడ తల్లి బిడ్డా సేఫ్.. ఇక్కడ నేను సేఫ్ అంటూ సంతోష పడ్డాడు రేవంత్.