చూడ్డానికి డబ్బా ఫోన్‌లా ఉన్న `పుష్ప 2` స్టార్‌ వాడిని మొబైల్‌ ఏంటో తెలుసా? ధరనే 8 లక్షలు

Published : Jul 20, 2025, 06:28 AM IST

నటుడు ఫహాద్ ఫాజిల్ వెర్టు అనే లగ్జరీ బ్రాండ్ బటన్ ఫోన్‌ను ఉపయోగిస్తున్నారు. దాని ధర ఎంతో ఈ వార్తలో తెలుసుకుందాం.

PREV
15
`పుష్ప 2`తో తెలుగులో పాపులర్‌ అయిన ఫహద్‌ ఫాజిల్‌

ఫహద్‌ ఫాజిల్‌ మలయాళంలో స్టార్‌ హీరో. కానీ మనకు `పుష్ప 2`లోని భన్వర్‌ సింగ్‌ షేకావత్‌గానే పరిచయం. ఇందులో ఆయన పోలీస్‌ ఆఫీసర్‌గా చేసిన రచ్చ వేరే లెవల్‌ అని చెప్పొచ్చు. 

పుష్పరాజ్‌ పాత్రకి చెమటలు పట్టించిన షేకావత్‌ గా  ఫాహద్‌ తెలుగు ఆడియెన్స్ కి బాగా దగ్గరయ్యారు. `పుష్ప 2`తో మరింతగా ఆకట్టుకున్నారు. ఆయన పాత్రలో సీరియస్‌ నెస్‌తోపాటు కామెడీ కూడా బాగా అలరించింది. 

25
డబ్బా ఫోన్‌తో వార్తల్లో నిలిచిన ఫాహద్‌

తాజాగా ఫహద్ ఫాజిల్‌ సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌లోకి వచ్చారు. ఆయన వాడిన ఫోన్‌ అందుకు కారణంగా చెప్పొచ్చు. ఫహద్‌ చేతిలో ఒక డబ్బా ఫోన్‌ ఉంది. పెద్ద స్టార్‌ హీరో ఇలాంటి ఫోన్‌ వాడుతున్నాడేంటి? అని అంతా ఆశ్చర్యపోతున్నారు. ఆయన ఫోటోలను వైరల్‌ చేస్తున్నారు. 

ఈ క్రమంలో ఈ ఫోన్‌ గురించి ఆసక్తికర విషయాలు బయటకు వచ్చాయి. ఫ్యాన్స్ ఈ ఫోన్‌ ఏంటి? దాని ధర ఎంత అనేది ఆరా తీయగా షాకిచ్చే విషయాలు బయటకు వచ్చాయి. 

35
ఫహద్‌ వాడింది డబ్బా ఫోన్‌ కాదు, వర్టు ఫోన్‌

ఫహద్‌ వాడుతున్నది డబ్బా ఫోన్‌ కాదు. వర్టు ఫోన్‌. ఇది ఇంగ్లాండ్‌కి చెందిన లగ్జరీ మొబైల్‌ బ్రాండ్‌. చూడ్డానికి డబ్బా ఫోన్‌లా ఉన్నా, ఇది మామూలు ఫోన్‌ కాదు. ఇందులో చాలా సరికొత్త ఫీచర్స్ ఉన్నాయి. ఐఫోన్ కి మించిన ఫీచర్స్ ఉంటాయి. చాలా అరుదుగానే ఈ ఫోన్‌ని వాడుతుంటారు. అందుకు కారణం దీని ధర. 

45
వర్టు ఫోన్‌ ధర తెలిస్తే షాకే

ఇంగ్లాండ్‌కి చెందిన ఈ వర్టు ఫోన్‌ ధర ఏకంగా ఎనిమిది లక్షలు కావడం విశేషం. ఇది ప్రపంచంలోనే అత్యంత లగ్జరీ ఫోన్‌. అతి కొద్ది మంది మాత్రమే దీన్ని ఉపయోగిస్తారు. ఇందులో కీ పాడ్‌ ప్రత్యేకంగా డిజైన్‌ చేసి ఉంటుంది. 

దీని ఆపరేటింగ్‌ సిస్టమ్‌ అంతా విభిన్నంగా ఉంటుంది. అందుకోసం ప్రత్యేకంగా ట్నైన్‌ కావాల్సి ఉంటుందట.  ఈ ఫోన్‌ తో కనిపించి ఇప్పుడు వార్తల్లో నిలిచారు ఫహద్‌. ఆయన అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. 

55
ఫహద్‌ కొత్త సినిమాలు

`పుష్ప`, `పుష్ప 2` తో తెలుగు ఆడియెన్స కి దగ్గరైన ఫహద్‌.. ఆ తర్వాత మళ్లీ తెలుగు సినిమాలు ఒప్పుకోలేదు.  తమిళంలో `మారీషన్‌`, మలయాళంలో `ఒడుమ్‌ కుథిర చడుమ్‌ కుథిర`, `డోంన్ట్ ట్రబుల్‌ ది ట్రబుల్‌`, `కరాటే చంద్రన్‌`, `పెట్రియాట్‌` అనే చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories