`బిగ్‌ బాస్‌ తెలుగు 8` లోకి వీజే సన్నీ.. వైల్డ్ కార్డ్ ఎంట్రీకి మాజీ విన్నర్‌ ? క్రేజీ డిటెయిల్స్

First Published | Oct 26, 2024, 12:14 PM IST

బిగ్‌ బాస్‌ తెలుగు 8 షోకి టీఆర్‌పీ రేటింగ్‌ మరీ డల్‌గా ఉంటుంది. కంటెస్టెంట్లు ఏమాత్రం కంటెంట్లు ఇవ్వడం లేదు. దీంతో మాజీ బిగ్‌ బాస్‌ విన్నర్‌ని వైల్డ్ కార్డ్ ద్వారా దించబోతున్నట్టు తెలుస్తుంది. 
 

బిగ్‌ బాస్‌ తెలుగు 8వ సీజన్‌ ఎనిమిదో వారం రన్‌ అవుతుంది. ఈ సారి షో డల్‌గా ఉన్న నేపథ్యంలో నిర్వాహకులు చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. షోకి హైప్‌ తెప్పించే ప్రయత్నం చేస్తున్నారు. అందుకోసం ఎప్పుడూ లేని విధంగా ఎనిమిది మంది మాజీ కంటెస్టెంట్లని వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ చేయించారు. అయినా షోకి హైప్‌ రావడం లేదు. అనుకున్నంత టీఆర్‌పీ రేటింగ్‌ రావడం లేదు.  మరీ డల్‌గా ఉంటుంది. వైల్డ్ కార్డ్ ద్వారా కమెడియన్లని దించినా ఎంటర్‌టైన్‌మెంట్‌ పెద్దగా ఉండటం లేదు. దీంతో నిర్వహకులు తలలు పట్టుకుంటున్నారని తెలుస్తుంది. 

బిగ్‌ బాస్‌ తెలుగు 8 అప్‌ డేట్స్ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.
 

Bigg boss telugu 8

బిగ్‌ బాస్‌ తెలుగు 8 షో సెప్టెంబర్‌ 1న 14 మందితో ప్రారంభమైన విషయం తెలిసిందే. బేబక్క, శేఖర్‌ బాషా, ఆదిత్య ఓం, అభయ్‌ నవీన్‌, ప్రేరణ, యష్మి, మణికంఠ, నబీల్‌, నిఖిల్‌, పృథ్వీరాజ్‌, నైనిక, కిర్రాక్‌ సీత, విష్ణు ప్రియ, సోనియా లతో షో ప్రారంభమైంది.

ఇందులో ఆరుగురు కంటెస్టెంట్లు ఎలిమినేట్‌ అయ్యాక ఐదో వారంలో వైల్డ్ కార్డ్ ద్వారా మరో 8 మంది కంటెస్టెంట్లని తీసుకొచ్చారు.  అవినాష్‌, గంగవ్వ, హరితేజ, టేస్టీ తేజ, నయని పావని, గౌతమ్‌, మెహబూబ్‌ వచ్చారు. వీళ్ల రాకతో అయినా షో పుంజుకుంటుందని భావించారు. కానీ పెద్దగా తేడా లేదని తెలుస్తుంది. 
 

Latest Videos


ఇదిలా ఉంటే బిగ్‌ బాస్‌ లోకి ఐదో సీజన్‌ విన్నర్‌ వీజే సన్నీ రాబోతున్నారనే వార్త ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. షో ని రక్తికట్టించడం కోసం క్రేజీ కంటెస్టెంట్‌గా దించే ప్లాన్‌ జరుగుతుందనే వార్తలు వచ్చాయి. అయితే నిజం ఏంటంటే ఇందులో తానే బిగ్‌ బాస్‌ షోకి రావాలనుకున్నారట వీజే సన్నీ. తనకు రిలీఫ్‌ కోసం మరోసారి షోలో రచ్చ చేయాలని భావించారట. ఈ క్రమంలో తానే నిర్వాహకులను అప్రోచ్‌ అయినట్టు తెలుస్తుంది. కానీ బిగ్‌ బాస్‌ టీమ్‌ భయపడిపోయారట. దానికి కారణాలు చూస్తే, 
 

Bigg Boss 5 winner Sunny

వీజే సన్నీ ఐదో సీజన్‌లో చేసిన రచ్చ ఏ రేంజ్‌లో ఉందో ఆ షోని ఫాలో అయ్యేవారికి తెలిసే ఉంటుంది. టాస్క్ ల విషయంలో, గేమ్‌ల్లో, నామినేషన్స్ లో ఆయన రెచ్చిపోయిన తీరు వేరే లెవల్‌. షోకి ఆ టైమ్‌లో హైప్‌ రావడంలో వీజే సన్నీ పాత్ర చాలా ఉందని చెప్పొచ్చు. షణ్ముఖ్‌, సిరిలను ధీటుగా ఎదుర్కొన్నాడు. ఆ సమయంలో ఆయన్ని చాలా మంది ఇతర కంటెస్టెంట్లు టార్గెట్‌ చేయడంతో దాన్ని తనకు పాజిటివ్‌గా మార్చుకుని సక్సెస్‌ కొట్టాడు.

ఊహించని విధంగా బిగ్‌ బాస్‌ విన్నర్‌గా నిలిచాడు. దీంతో ఇప్పుడు ఆయన మళ్లీ షోలోకి వస్తే, విన్నర్‌ ఆయనే అని, మరోసారి ఆయనకు కప్‌ ఇవ్వలేమని టీమ్‌ భావించారట. దీంతో ఆయన రిక్వెస్ట్ ని సున్నితంగా తిరస్కరించారట. అలా సన్నీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ మిస్‌ అయిపోయింది. నిజానికి మరోసారి సన్నీ వస్తే ఈ సారి సీజన్‌ రక్తికట్టేలా ఉండేదని చెప్పడంలో అతిశయోక్తి లేదు. 

ఇక సన్నీ.. వీజేగా కెరీర్‌ని ప్రారంభించి నటుడిగా మారాడు. బిగ్‌ బాస్‌ షోకి రాకముందే ఆయన హీరోగా సినిమా చేశాడు. బిగ్‌ బాస్‌ తెలుగు 5 విన్నర్‌ అయ్యాక ఆయనకు హీరోగా వరుసగా సినిమా ఆఫర్లు వచ్చాయి. `సకల గునాభి రామ`, `అన్‌ స్టాపబుల్‌`, `సౌండ్‌ పార్టీ` వంటి సినిమాల్లో హీరోగా నటించాడు. కానీ ఈ సినిమాలు అనుకున్నంత స్థాయిలో విజయాలు సాధించలేకపోయాయి.

వెబ్‌ సిరీస్‌ `ఏటీఎం` మాత్రం మంచి ఆదరణ పొందింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు హీరోగా స్ట్రాంగ్‌ కమ్ బ్యాక్‌ కోసం వెయిట్‌ చేస్తున్నాడు సన్నీ. ఈ సారి అదిరిపోయే కథతో రాబోతున్నట్టు తెలుస్తుంది. మరి ఆయన కమ్‌ బ్యాక్‌ ఎలా ఉంటుందో, ఎప్పుడు ఉంటుందో చూడాలి. 

read more: ఎన్టీ రామారావు జర్వం వస్తే ఏం చేస్తాడో తెలుసా? కోడికి మొత్తం ఉప్పు కారం గట్టిగా దట్టించి, దుప్పటి కప్పుకొని

click me!