Aaruguru Pathivrathalu: అప్పట్లో కుర్రాళ్లకు పిచ్చేక్కించిన సినిమా.. ఆరుగురు పతివ్రతలు రీ-రిలీజ్‌ ఎప్పుడంటే?

Published : Oct 03, 2026, 08:00 AM IST

Aaruguru Pathivrathalu: అప్పట్లో యూత్‌కు కిక్కెక్కించిన సినిమాలు కొన్ని ఉన్నాయి. అలాంటి సినిమాల్లో 'ఆరుగురు పతివ్రతలు' కూడా ఒకటి. ఈ సినిమా దాదాపు 20 ఏళ్ల తరువాత మరోసారి థియేటర్లలో సందడి చేయబోతోంది.

PREV
15
ఊపు ఊపిన బోల్డ్ కామెడీ డ్రామా

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ప్రస్తుతం రీ-రిలీజ్ ట్రెండ్ పీక్స్ లో కొనసాగుతోంది. కేవలం స్టార్ హీరోల మాస్, కమర్షియల్ యాక్షన్ చిత్రాలు మాత్రమే కాకుండా, అప్పట్లో బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ సృష్టించిన వైవిధ్యమైన కథా చిత్రాలు కూడా సరికొత్త హంగులతో మళ్లీ వెండితెరపైకి వస్తున్నాయి.

అప్పటి వారినే కాదు.. నేటి తరం ప్రేక్షకులను కూడా అలరిస్తున్నాయి. ఈ వరుసలోనే, సరిగ్గా రెండు దశాబ్దాల క్రితం టాలీవుడ్‌లో ఒక ఊపు ఊపిన బోల్డ్ అండ్ రియలిస్టిక్ కామెడీ డ్రామా 'ఆరుగురు పతివ్రతలు' మళ్లీ థియేటర్లలో గ్రాండ్‌‌ రీ-రిలీజ్‌కు సిద్ధమైంది.

25
ఇ.వి.వి. సత్యనారాయణ మార్క్ సెన్సేషనల్ మూవీ

హాస్య బ్రహ్మ, దివంగత లెజెండరీ దర్శకుడు ఇ.వి.వి. సత్యనారాయణ తన సొంత నిర్మాణ సంస్థ 'ఇ.వి.వి. సినిమా' బ్యానర్‌పై స్వీయ దర్శకత్వంలో ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. 2004 ఫిబ్రవరి 6న విడుదలైన ఈ మూవీ, ఆ సమయంలో పెను సంచలనం సృష్టించింది. సమాజం యాక్సెప్ట్ చేయని సరికొత్త కాన్సెప్ట్.. వినూత్నమైన పోస్టర్లు, బోల్డ్ ప్రచార చిత్రాలు, విభిన్నమైన కథాంశంతో టాలీవుడ్‌ను ఊపేసింది.

35
అసలు కాన్సెప్ట్ ఏంటంటే?

పెళ్లిళ్ల పేరిట సమాజంలో జరిగే మోసాలు, పెళ్లయిన కొత్తలో దంపతుల మధ్య తలెత్తే అహం (ఈగోలు), అపార్థాలు, కాపురాల్లో వచ్చే మనస్పర్థలను ఇ.వి.వి. అత్యంత సహజంగా, కాస్త బోల్డ్‌గా చూపిస్తూనే.. ఆద్యంతం కడుపుబ్బా నవ్వించే వినోదంతో వెండితెరపై ఆవిష్కరించారు. సమాజంలోని చేదు నిజాలను, వైవాహిక జీవిత సమస్యలను హాస్యంతో మేళవించి ఆయన చెప్పిన తీరు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. అయితే ఈ సినిమాలో రొమాన్స్ డోస్ కాస్త ఎక్కువే ఉంటుంది.

45
ఆరుగురు పతివ్రతలు రీ-రిలీజ్ ఎప్పుడంటే?

4K అల్ట్రా హెచ్‌డీ, డాల్బీ సౌండ్‌తో గ్రాండ్ రీ-రిలీజ్ కాబోతోంది ఆరుగురు పతివ్రతలు సినిమా. ఈ కల్ట్ క్లాసిక్ చిత్రం ఇప్పుడు సరికొత్త సాంకేతిక మెరుగులు దిద్దుకుని ప్రేక్షకుల ముందుకు వస్తోంది. 4K అల్ట్రా హెచ్‌డీ విజువల్స్, డాల్బీ సౌండ్ క్వాలిటీతో పోచమ్మ ఫిల్మ్స్ సమర్పణలో ఈ చిత్రాన్ని అక్టోబర్ 29న థియేటర్లలో గ్రాండ్‌గా రీ-రిలీజ్ చేస్తున్నట్లు నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా సరికొత్త రీ-రిలీజ్ పోస్టర్‌ను కూడా విడుదల చేశారు.

55
నేటితరం ఆడియన్స్ ను అలరిస్తుందా?

ఈ చిత్రానికి కమలాకర్ సంగీతం అందించగా, ప్రముఖ రచయిత జనార్థన మహర్షి పవర్ ఫుల్ డైలాగ్స్ రాశారు. నాగిరెడ్డి సినిమాటోగ్రఫీ ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలిచింది. రిలీజై ఇరవై ఏళ్లు పూర్తయినప్పటికీ, ఈ సినిమాలోని సందేశం, కామెడీ ఇప్పటికీ తాజాగా అనిపిస్తాయి. రెండు దశాబ్దాల తర్వాత మళ్లీ బిగ్ స్క్రీన్ పైకి రాబోతున్న ఈ ఇ.వి.వి. మార్క్ బోల్డ్ కామెడీ ఎంటర్‌టైనర్ నేటి తరం యంగ్‌స్టర్స్‌తో పాటు, నాటి జ్ఞాపకాలను నెమరువేసుకునే సినిమా ప్రేమికులను ఎంతగా అలరిస్తుందో చూడాలి.

Read more Photos on
click me!

Recommended Stories