Chiranjeevi: 40 ఏళ్ళు పూర్తి చేసుకున్న చిరంజీవి సినిమా, 100 కేజీఎఫ్ లతో సమానం..పేరు లేకుండానే సూపర్ హిట్

Published : Oct 03, 2026, 07:57 AM IST

చిరంజీవి నటించిన ఓ సినిమాలో ఆయన పాత్రకు పేరే లేదు. కానీ ఆ సినిమా సంచలన విజయం సాధించింది. 40 ఏళ్ళు పూర్తి చేసుకున్న ఆ చిత్రానికి కేజీఎఫ్ చిత్రంతో చాలా పోలికలు ఉన్నాయి.

PREV
15
Chiranjeevi

మెగాస్టార్ చిరంజీవి సుప్రీం హీరోగా వెలుగొందుతున్న రోజుల్లో వరుసగా సూపర్ హిట్ సినిమాలు చేశారు. 1986లో చిరంజీవి రాక్షసుడు అనే అద్భుతమైన సినిమాలో నటించారు. ఈ చిత్రానికి కోదండ రామిరెడ్డి దర్శకుడు. యండమూరి వీరేంద్ర నాథ్ రచయిత. ఇళయరాజా ఈ చిత్రానికి సంగీతం అందించగా కేఎస్ రామారావు నిర్మించారు. ఈ మూవీ విడుదలై 40 ఏళ్ళు పూర్తవుతోంది.దీంతో అభిమానులు ఈ చిత్ర విశేషాలని సోషల్ మీడియాలో గుర్తు చేసుకుంటున్నారు.

25
కోదండరామిరెడ్డి దర్శకత్వం

యండమూరి వీరేంద్రనాథ్ అందించిన కథ, కోదండరామిరెడ్డి దర్శకత్వం, చిరంజీవి నటన, సంగీతం ఈ మూవీని మరో స్థాయిలో నిలబెట్టాయి. రాధా, సుహాసిని హీరోయిన్లు. అన్నపూర్ణ చిరంజీవి తల్లి పాత్రలో నటించింది. ఈ సినిమాలో చాలా విశేషాలు ఉన్నాయి. ఇప్పుడంటే మాఫియా, గ్యాంగ్ స్టర్ సినిమాలలో కేజీఎఫ్ గురించి ఎక్కువగా మాట్లాడుతుంటాయి. అప్పట్లోనే కేజీఎఫ్ తరహా బ్యాక్ డ్రాప్ లో అద్భుతంగా తెరకెక్కిచిన చిత్రం ఇది.

35
కేజీఎఫ్ తరహా కథ

ఇప్పటి హంగులతో కనుక ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తే 100 కేజీఎఫ్ లతో సమానం అయ్యే మూవీ అవుతుంది అని చెప్పడంలో సందేహం లేదు. కేజీఎఫ్ లో మదర్ సెంటిమెంట్ ఎక్కువగా ఉంటుంది. చిన్న తనంలోనే హీరో తల్లిని కోల్పోతాడు. చనిపోయే ముందు హీరోకి అతడి తల్లి ఎలాగైనా గొప్పవాడివి కావాలి, డబ్బు సంపాదించాలి అని చెబుతుంది. రాక్షసుడు మూవీలో కూడా అదే సెంటిమెంట్ ఉంది. చిన్నతనంలో తల్లికి హీరో తల్లికి దూరమవుతారు. తన తల్లిని వెతకడమే హీరో పని. ఆమె కూడా తన కొడుకు గొప్పవాడు కావాలి అని బలంగా కోరుకుంటుంది.

45
మాఫియా సామ్రాజ్యంలో బానిసగా..

ఒక తాగుబోతు చిన్న పిల్లాడిగా ఉన్న హీరోని ఒక మాఫియాకి అమ్మేస్తాడు. ఆ మాఫియా గ్యాంగ్ చిన్న పిల్లలని ఒక దీవిలో బానిసలుగా చేసుకుని డబ్బు సంపాదిస్తూ ఉంటుంది. ఆ గ్యాంగ్ కి ఒక ప్రధాన కమాండర్ ఉంటారు. రావు గోపాల రావు పెట్టే షరతు, ఒప్పందంతో హీరో తిరిగి ఆ మాఫియా గ్యాంగ్ లోకి ప్రవేశిస్తాడు. అక్కడ బానిసగా ఉన్నట్లు నటిస్తూ వాళ్ళని అంతం చేసి తల్లి జాడ తెలుసుకోవడం హీరో లక్ష్యం. అదే విధంగా అక్కడ ఉన్న బానిసలకు విముక్తి కలిగించడం కూడా హీరో చేసే పని.

55
చిరంజీవి పాత్రకు పేరే లేదు

ఇలా కేజీఎఫ్ తో రాక్షసుడు సినిమాకి చాలా పోలికలు ఉన్నాయి.తల్లి కోసం చిరంజీవి పడే ఆరాటం, యాక్షన్ సన్నివేశాలు ఈ చిత్రంలో హైలైట్ గా నిలిచాయి. చిరంజీవి బ్రదర్ నాగబాబు ఈ మూవీలో కీలక పాత్రలో నటించారు. నాగబాబు నటుడిగా పరిచయమైన తొలి చిత్రం ఇదే. మరో ట్విస్ట్ ఏంటంటే ఈ మూవీలో చిరంజీవికి అసలు పేరే ఉండదు. అందరూ ఫ్రెండ్ అని కానీ, అతడు అని కానీ పిలుస్తుంటారు.

Read more Photos on
click me!

Recommended Stories