తన కొడుకు తాను హీరోను అవుతానని చెప్పడంతో యాక్టింగ్ ట్రైయినింగ్ ఇప్పించానని.. అయితే అతనిలో టాలెంట్ చూసి.. నిర్మాతలు సినిమా చేయడానికి పోటీపడ్డారని ఆయన అన్నారు. ఇక రెండు సినిమాలు అలానే చేశాడని.. కాని కమర్షియల్ హీరోగా ఎదగాలని.. ఈ రామ్ నగర్ బన్నీ సినిమాను తానే స్యయంగా నిర్మించాన్నారు. ఈసినిమా కోసం ముందుగా అనుకున్న బడ్జెట్ రెండు కోట్లు... కాని చివరకు అది 5 కోట్లు అయ్యింది.
సినిమా బాగా రావడంతో కలెక్షన్స్ కూడా గట్టిగా వస్తాయని అనుకున్నాను. సినిమా రిలీజ్ తరువాత పాజిటీవ్ రివ్యూస్ వచ్చాయి.. కాని అదే టైమ్ లోఎన్టీఆర్ దేవర సినిమా రిలీజ్ అవ్వడం.. ఆ మూవీ సూపర్ హిట్ అవ్వడంతో.. మా సినిమాను చూసేవారు లేకుండాపోయారు. దాంతో చాలా నష్టపోవల్సి వచ్చింది. చాలా పెద్ద దెబ్బ తగిలింది అన్నారు ప్రభాకర్. దేవర సినిమా రిలీజ్ తో చంద్రహాస్ సినిమా కనిపించకుండాపోయింది.