నాగ మణికంఠ షో నుండి వైదొలగడానికి ప్రధాన కారణం అనారోగ్య సమస్యలు.హోస్ట్ నాగార్జునతో కూడా ఆయన ఇదే చెప్పాడు. నేను చాలా వరకు ట్రై చేశాను. ఇంకా నా వల్ల కాలేదు. అందుకే వచ్చేశాను అన్నారు. కాగా నాగ మణికంఠకు అనారోగ్య సమస్యలు తలెత్తడానికి హౌస్లో ఉన్న పరిస్థులేనట. ఈ విషయాన్ని నాగ మణికంఠ నేరుగా చెప్పారు. సరిపడా తిండి లేకపోవడం తన ఆరోగ్యాన్ని దెబ్బ తీసింది అన్నాడు.
కేవలం నిమిషం సమయంలో హౌస్ మేట్స్ అందరికి సరిపడా సరుకులు తెచ్చుకోవాల్సి వచ్చేది. కొన్నిసార్లు కూరగాయలు తెచ్చేవారు కాదు. కొన్నిసార్లు రైస్ తెచ్చేవారు కాదు. కొన్నిసార్లు పెరుగు మిస్ అయ్యేది. నిర్ణీత సమయం మాత్రమే వంటకు ఉంటుంది. దాంతో రోజుకు రెండు, మూడు చపాతీలు మాత్రమే వచ్చే వి. పూత రేకుల్లా ఉండే దోశలు రెండు మూడు వచ్చేవి. దాని వలనే నా ఆరోగ్యం దెబ్బతింది అన్నాడు. కడుపునిండా ఆహారం ఉండేది కాదని నాగ మణికంఠ చెప్పకనే చెప్పాడు.