ఒంటరిగా ఉండలేను రెండో పెళ్లి చేసుకుంటా.. కానీ అలాంటి వాడు కావాలి.. కోరిక బయటపెట్టిన ఎస్తేర్‌ నోర్హా

Published : May 13, 2024, 02:05 PM IST

హీరోయిన్‌ ఎస్తేర్‌ నోర్హ.. నోయల్‌తో విడిపోయి ఒంటరిగానే ఉంటున్న విషయం తెలిసిందే. తాజాగా రెండో పెళ్లిపై ఆమె స్పందించింది. ఒంటరిగా ఉండలేనని కామెంట్‌ చేసింది.  

PREV
15
ఒంటరిగా ఉండలేను రెండో పెళ్లి చేసుకుంటా.. కానీ అలాంటి వాడు కావాలి.. కోరిక బయటపెట్టిన ఎస్తేర్‌ నోర్హా

హీరోయిన్‌ ఎస్తేర్‌ ఒకప్పుడు హీరోయిన్‌గా మెప్పించింది. విజయాలు అందుకుంది. సునీల్‌తో `భీమవరం బుల్లోడు`తో మెరిసి అందరి దృష్టిని ఆకర్షించింది. అయితే హీరోయిన్‌గా ఈ బ్యూటీకి సక్సెస్‌ రాలేదు. అడపాదడపా సినిమాలు చేసినా అవి పెద్దగా ఆడలేదు. పైగా అన్నీ చిన్న సినిమాలే కావడం గమనార్హం. 
 

25

ఈ క్రమంలో ఆమె నటుడు నోయల్‌ని ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఒక అండర్‌ స్టాండింగ్‌తో వివాహం చేసుకున్నారు. కానీ పెళ్లి తర్వాత నోయల్‌ అసలు రూపం బయటపడిందని వెల్లడించింది ఎస్తేర్‌. ఇద్దరి మధ్య గొడవలు ప్రారంభమయ్యాయని, నోయల్‌ మోసం చేశాడంటూ ఆరోపిస్తూ ఎస్తేర్‌ విడాకులు తీసుకుంది. తరచూ నోయల్‌ గురించి చెబుతూ వచ్చింది. కానీ అసలు మ్యాటర్‌ దాచేసింది. 
 

35

ఇక ఇప్పుడు నటిగా బిజీగా ఉంది. బోల్డ్ రోల్స్ లోనూ నటిస్తుంది. ఇటీవల `టెనెంట్‌`లో ఇన్వెస్టిగేషన్‌ ఆఫీసర్‌గా కనిపించింది. స్టయిల్‌ గా మెరిసి అదరగొట్టింది. యాక్షన్‌తోనూ మెప్పిస్తుంది. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను పంచుకుంది. తన వ్యక్తిగత విషయాలను షేర్‌ చేసుకుంది. అందులో భాగంగా రెండో పెళ్లిపై రియాక్ట్ అయ్యింది. 
 

45

ఎస్తేర్‌.. ప్రస్తుతం ఒంటరిగానే ఉంది. ఈ నేపథ్యంలో రెండో పెళ్లి చేసుకునే ఉద్దేశ్యం ఉందా అని యాంకర్‌ ప్రశ్నించగా, తాను ఓకే అని చెప్పింది. తానకు ఒంటరిగా ఉండాలని లేదు. రెండో పెళ్లి చేసుకుంటాను అని చెప్పింది ఎస్తేర్‌. పెళ్లి చేసుకోవాలనే ప్లాన్‌ ఉంది, ఒంటరిగా బతకాలని అనుకోవడం లేదు. నాకు పార్టనర్‌ కావాలి, బ్యూటీఫుల్‌ లైఫ్‌ కావాలి. అయితే ఎవరిని చేసుకోవాలి, ఎప్పుడు చేసుకోవాలి అనేది ఇంకా తెలియదని చెప్పింది. 
 

55

ఈ సందర్భంగా ఎలాంటి వాడిని చేసుకోవాలనుకుంటుందో తెలిపింది ఎస్తేర్‌. మొదటిసారి పెళ్లి చేసుకుంటేనే ఇలా అయ్యింది. మరి రెండో సారి మ్యారేజ్‌ అంటే చాలా ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. తనని బాగా అర్థం చేసుకునేవాడు కావాలి. మంచి ఫ్రెండ్‌ అయితే బాగుంటుందని చెప్పింది ఎస్తేర్. షో కేస్‌ లాంటి మొగుడు నాకు వద్దు, మంచి లైఫ్‌ పార్టనర్‌, నా జీవితాన్ని మంచిగా పంచుకునే వాడు కావాలి. అలాంటి వ్యక్తినే మ్యారేజ్‌ చేసుకుంటానని తెలిపింది ఎస్తేర్‌. ఇంకేంటి మరి ఎస్తేర్‌ చెప్పిన లక్షణాలు మీలో ఉంటే, మీరు అలా ఉండాలనుకుంటే ట్రై చేసుకోవచ్చేమో. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories