పవన్ కళ్యాణ్ కు హరీష్ శంకర్ ల ఎప్పటి నుంచో అభిమాని. అలాగే గతంలో పవన్ కళ్యాణ్ కెరియర్ లో అతి పెద్ద హిట్ సినిమాలలో ఒకటైన గబ్బర్ సింగ్ కి దర్శకత్వం వహించింది హరీష్ శంకర్. పులి, తీన్ మార్, పంజా వంటి మూడు వరుస డిజాస్టర్ ల తర్వాత పవన్ కళ్యాణ్ అందుకున్న మొట్టమొదటి బ్లాక్ బస్టర్ ఆ సినిమా. అందుకే పవన్ కళ్యాణ్ కి ఇష్టమైన వ్యక్తులలో హరీష్ శంకర్ కూడా ఒకరు.