రానా యాక్టింగ్ అంత దారుణమా?.. కారులో ఎక్కించుకుని నాలుగు గంటలు క్లాస్‌ పీకిన సూర్య.. ఇలా షాకిచ్చారేంటి?

Published : May 13, 2024, 11:56 AM IST

సూర్య, రానా మంచి స్నేహితులు. అయితే ప్రారంభంలో రానా యాక్టింగ్‌ స్కిల్స్ పై సూర్య క్లాస్‌ పీకాడట. కారులు ఎక్కించుకుని మూడు నాలుగు గంటలు గ్యాప్‌ లేకుండా ఆడుకున్నాడట.   

PREV
16
రానా యాక్టింగ్ అంత దారుణమా?.. కారులో ఎక్కించుకుని నాలుగు గంటలు క్లాస్‌ పీకిన సూర్య.. ఇలా షాకిచ్చారేంటి?

రానా.. ప్రముఖ నిర్మాత రామానాయుడు మనవడిగా, విక్టరీ వెంకటేష్‌ అక్కడ కొడుకుగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. తొలి సినిమాతోనే తన ప్రత్యేకత చాటుకున్నాడు. `లీడర్‌` సినిమా రాజకీయాలను ప్రశ్నించాడు. అవినీతి రాజకీయాన్ని ప్రక్షాళన చేశాడు. ఆ సినిమా పెద్ద విజయం సాధించింది. 

26
Rana Daggubati

ఆ తర్వాత బాలీవుడ్‌ వెళ్లాడు. అక్కడ `దమ్ మారో దమ్‌` చిత్రంలో నటించాడు. అది మంచి ఆదరణ పొందింది. దీంతోపాటు `నేను నా రాక్షసి`తోనూ ఆకట్టుకున్నాడు. `నా ఇష్టం`లతో అలరించే ప్రయత్నం చేశాడు. మళ్లీ `డిపార్ట్ మెంట్‌`తో బాలీవుడ్‌ సినిమాతో మెప్పించాడు. `కృష్ణం వందే జగద్గురుమ్‌`, `బేబీ`, `బాహుబలి`, `రుద్రమదేవి`, `ఘాజి`, `నేనే రాజు నేనే మంత్రి`, `ఎన్టీఆర్‌ః మహానాయకుడు`, `హౌజ్‌ఫుల్‌ 4`, `అరణ్య`, `భీమ్లా నాయక్‌`, `విరాటపర్వం` వంటి చిత్రాలతో మెప్పించాడు. 
 

36

ఇదిలా ఉంటే సూర్య, రానా మంచి స్నేహితులు. సుమారు పదిహేనేళ్లుగా ఆ స్నేహం కొనసాగుతుందట. ప్రారంభంలో ఆయన తెలియదని ఆ తర్వాత పరిచయమై ఇప్పుడు క్లోజ్‌ ఫ్రెండ్స్ అయినట్టు తెలిపాడు రానా. ఈ సందర్భంగా ఓ షాకింగ్‌ విషయాన్ని తెలిపాడు. సూర్య తనకు క్లాస్‌ పీకిన ఘటన బయటపెట్టాడు. 
 

46

పది పన్నేండ్ల క్రితం సూర్య ఓ రోజు తన సినిమాని ఎడిటింగ్‌ రూమ్‌లో చూశాడట. దీంతో తన కారులో ఎక్కించుకుని మూడు నాలుగు గంటలు హైదరాబాద్‌ మొత్తం తిప్పుతూ రానాకి పిచ్చ పిచ్చగా క్లాస్‌ పీకాడట. `అరేయ్‌ నువ్వు చేసేది యాక్టింగ్ కాదు, ఏదో చంపేస్తున్నావు. అని ఏకంగా నాలుగు గంటలు నాన్‌ స్టాప్‌ గా క్లాస్‌ పీకాడట సూర్య. 
 

56

ఆ రోజు సూర్య అలా క్లాస్‌ పీకడం వల్లే తన నుంచి ఓ భళ్లాల దేవగానీ(బాహుబలిలో పాత్ర), డానియల్‌ శేఖర్‌గానీ( భీమ్లా నాయక్‌లో పాత్ర) చేశానని తెలిపారు రానా. ఈ విషయాన్ని ఆయన సూర్య నటించిన `ఈటీ` ప్రీ రిలీజ్‌ ప్రెస్‌ మీట్‌లో తెలిపారు. 2022లో ఈ మూవీ విడుదలైంది. ఈ మూవీ తెలుగు ప్రమోషన్స్ కోసం హైదరాబాద్‌లో ఈవెంట్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా రానా ఈ విషయాన్ని బయటపెట్టాడు. 
 

66

స్టేజ్‌పై రానా ఈ విషయం చెప్పడంతో సూర్య దగ్గరగా వచ్చి రానాని హగ్‌ చేసుకోవడం విశేషం. ఈ వీడియో క్లిప్‌ ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. ప్రస్తుతం సూర్య `కంగువా` చిత్రంలో నటిస్తున్నారు. భారీ పాన్‌ ఇండియా మూవీ ఇది. ద్వితీయార్థంలో విడుదల కాబోతుంది. ఇక రానా ప్రస్తుతం రజనీకాంత్‌తో `వెట్టైయాన్‌`లో కీలక పాత్ర పోషిస్తున్నారు. `హిరణ్య కశ్యప`, అలాగే `నేనే రాజు నేనే మంత్రి`కి సీక్వెల్‌లో నటిస్తున్నారు రానా. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories