ఇషా గుప్తా, తెలుగు ఆడియెన్స్ కు కూడా చాలానే దగ్గరైంది. టాలీవుడ్ లో రెండు సినిమాల్లోనే నటించినా గుర్తిండిపోయేలా చేసింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan)తో కలిసి ‘వినయ విధేయ రామ’ చిత్రంలో స్పెషల్ అపియరెన్స్ ఇచ్చింది. గ్లామర్ స్టెప్పులతో ఆడియెన్స్ ను కట్టిపడేసింది. ప్రస్తుతం హిందీలోనే ‘దేసీ మ్యాజిక్, హేరా పేరీ 3’లో నటిస్తోంది.