బన్నీలో సగం బాలయ్య కంటే కూడా దారుణం... బుల్లితెరపై పవన్ కి ఊహించని షాక్!

Published : May 19, 2022, 03:45 PM IST

భారీ ఫ్యాన్ బేస్ కలిగిన పవన్ కళ్యాణ్ సినిమా ఇంత దారుణమైన టీఆర్పీ రాబడుతుందని బహుశా ఎవరూ ఊహించి ఉండరు. బన్నీ సినిమా అటుంచితే సీనియర్ స్టార్స్ బాలయ్య, నాగార్జున సినిమాల కంటే కూడా దారుణమైన ఫలితాన్ని భీమ్లా నాయక్ అందుకుంది.

PREV
17
బన్నీలో సగం బాలయ్య కంటే కూడా దారుణం... బుల్లితెరపై పవన్ కి ఊహించని షాక్!
Bheemla Nayak TRP

2022లో బుల్లితెరపై ప్రసారమైన స్టార్ హీరోల సినిమాల టీఆర్పీ గమనించిన చిత్ర వర్గాలు విస్తుపోయారు. అల్లు అర్జున్ పుష్ప(Pushpa), బాలయ్య అఖండ, నాగార్జున బంగార్రాజు చిత్రాలతో పాటు పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ టెలివిజన్ లో ప్రసారం అయ్యాయి. వీటిలో బన్నీ తన మార్క్ చూపిస్తూ అత్యధిక టీఆర్పీ దక్కించుకోగా.. పవన్ అందరికంటే తక్కువ టీఆర్పీ పొందాడు. 
 

27

పుష్ప మూవీతో అల్లు అర్జున్ (Allu Arjun) పాన్ ఇండియా విజయం అందుకున్నాడు. హిందీలో రూ. 100 కోట్లకు పైగా వసూళ్లతో ఈ చిత్రం సంచలనాలు నమోదు చేసింది. బుల్లితెరపై కూడా అదే స్థాయిలో ఇరగదీసింది. పుష్ప ఏకంగా 22.54 టీఆర్పీ రాబట్టింది. అల్లు అర్జున్ కెరీర్ లో అల వైకుంఠపురంలో తర్వాత సెకండ్ హైయెస్ట్ టీఆర్పీ అందుకుంది. 
 

37

ఇక బాలయ్య అఖండ (Akhanda) మూవీతో సంచలనాలు నమోదు చేసిన విషయం తెలిసిందే. రూ. 120 కోట్ల వరల్డ్ వైడ్ గ్రాస్ రాబట్టిన ఈ చిత్రం నిర్మాతతో పాటు డిస్ట్రిబ్యూటర్స్ కి లాభాలు పంచింది. అఖండ శాటిలైట్ రైట్స్ దక్కించుకున్న స్టార్ మా... వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తో చెప్పుకోదగ్గ టీఆర్పీ రాబట్టింది. అఖండ 13.31 టీఆర్పీ సాధించింది. 
 

47

అనూహ్యంగా బంగార్రాజు బాలయ్య (Balakrishna)అఖండకు మించి టీఆర్పీ దక్కించుకోవడం విశేషం. మార్చి 27న జీ తెలుగులో ప్రసారమైన బంగార్రాజు 14 టీఆర్పీ రాబట్టింది. పండగ రోజు కావడం ఈ చిత్రానికి కలిసొచ్చింది. బాక్సాఫీస్ వద్ద యావరేజ్ ఫలితం అందుకున్న బంగార్రాజు (Bangarraju)బుల్లితెరపై ఇరగదీసింది. 
 

57

కాగా భీమ్లా నాయక్ (Bheemla Nayak0రేటింగ్ ఎవరూ ఊహించనిది. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన భీమ్లా నాయక్ వరల్డ్ ప్రీమియర్ షో అట్టర్ ఫ్లాప్ రేటింగ్ రాబట్టింది. మే 8 ఆదివారం ప్రసారమైన భీమ్లా నాయక్ కేవలం 9.06 టీఆర్పీ మాత్రమే అందుకుంది. అంటే పుష్ప మూవీ చూసిన ప్రేక్షకుల సంఖ్యలో సగం కూడా భీమ్లా నాయక్ చూడలేదు. బాలయ్య, నాగార్జున చిత్రాల కంటే కూడా తక్కువ టీఆర్పీ అందుకోవడం ఊహించని పరిణామం. 
 

67

బాక్సాఫీస్ వద్ద భీమ్లా నాయక్ మిక్స్డ్ రిజల్ట్ చూసింది. నైజాంలో బ్రేక్ ఈవెన్ కి చేరుకున్న ఈ చిత్రం ఏపీలో నష్టాలు మిగిల్చింది. బుల్లితెరపై మాత్రం దారుణమైన వ్యూవర్షిప్ దక్కించుకుంది. కాగా పవన్ (Pawan Kalyan)కమ్ బ్యాక్ చిత్రం వకీల్ సాబ్ 19.12 టీఆర్పీ దక్కించుకోవడం విశేషం. పవన్ కెరీర్ లో హైయెస్ట్ టీఆర్పీ సాధించిన చిత్రంగా వకీల్ సాబ్ ఉంది. 
 

77

ఇక టాప్ ఫైవ్ టాలీవుడ్ చిత్రాలు చూస్తే... అల వైకుంఠపురంలో(29.4), సరిలేరు నీకెవ్వరు(23.04)బాహుబలి 2(22.7)శ్రీమంతుడు(22.54)డీజే(21.7)చిత్రాలు ఉన్నాయి. బన్నీ, మహేష్ రెండు చిత్రాలతో, ప్రభాస్ ఒక చిత్రంతో అగ్ర స్థానంలో కొనసాగుతున్నారు.    
 

Read more Photos on
click me!

Recommended Stories