పేగు తెంచుకుని పుట్టిన బిడ్డని కళ్లు తెరిచేలోపలే చిదిమేస్తున్నారు.. చిరంజీవి, థమన్‌ మధ్య ఎమోషనల్ కన్వర్జేషన్‌

Published : Jan 18, 2025, 07:38 PM IST

`డాకు మహారాజ్‌` ఈవెంట్‌లో థమన్‌ చేసిన కామెంట్స్ కి చిరంజీవి ఎమోషనల్‌గా రియాక్ట్ అయ్యారు. దీనికి థమన్‌ కూడా అంతే ఎమోషనల్‌గా స్పందించారు. ఇదే ఇప్పుడు హాట్‌ టాపిక్‌ అవుతుంది.   

PREV
16
పేగు తెంచుకుని పుట్టిన బిడ్డని కళ్లు తెరిచేలోపలే చిదిమేస్తున్నారు.. చిరంజీవి, థమన్‌ మధ్య ఎమోషనల్ కన్వర్జేషన్‌

రామ్‌ చరణ్‌ నటించిన `గేమ్‌ ఛేంజర్‌` మూవీకి ప్రారంభం నుంచి నెగటివ్‌ టాక్‌ ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. సోషల్‌ మీడియాలో చాలా దారుణంగా ట్రోల్స్ నడిచాయి. కావాలని కొందరు ఈ మూవీని చంపేసే ప్రయత్నం చేసినట్టుగా తెలుస్తుంది. నిజానికి సినిమా బాగానే ఉంది.

ట్రోల్స్ చేసి, నెగటివ్‌ ప్రచారం చేసేంత బ్యాడ్‌గా లేదు. కానీ కొందరు సోషల్‌ మీడియాలో చేసే నెగటివ్‌ ప్రచారం సినిమాపై తీవ్ర ప్రభావం పడింది. ఇందులో అగ్ర హీరోల అభిమానులు ఉన్నారని తెలుస్తుంది. వాళ్లే కావాలని చేసినట్టుగా తెలుస్తుంది. ఈ విషయంలో ఇప్పటికే కొందరిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. 

26

ఈ సినిమాకి థమన్‌ సంగీతం అందించారు. ఆయన అందించిన పాటలకు మంచి స్పందన లభించింది. ఆయన మ్యూజిక్‌ చేసిన మరో మూవీ `డాకు మహారాజ్‌` కూడా ఈ సంక్రాంతికే విడుదలైంది. బాలయ్య నటించిన ఈ మూవీ హిట్‌ టాక్‌తో దూసుకుపోతుంది. ఇప్పటికే వంద కోట్ల కలెక్షన్లు దాటింది.

రూ.150కోట్ల దిశగా వెళ్తుంది. అయితే ఈ మూవీ సక్సెస్‌ మీట్‌లో మ్యూజిక్‌ డైరెక్టర్‌ థమన్‌ మాట్లాడారు. `గేమ్‌ ఛేంజర్‌`పై ట్రోల్స్ జరుగుతున్న నేపథ్యంలో ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఓ రకంగా థమన్‌ తన  ఫ్రస్టేషన్‌ కక్కేశాడు. ఎమోషనల్‌గా మాట్లాడారు. 
 

36

మనం జీవితంలో ముందుకు వెళ్లాలంటే సక్సెస్‌ ఎంతో దోహదపడుతుందని, ఆ సక్సెస్‌ ఎంత డబ్బు పెట్టినా దొరకదు అన్నారు. సక్సెస్ ఇచ్చే ఎనర్జీ వేరే లెవల్‌ అని, సక్సెస్‌ లేకపోతే నేను ఫిల్మ్ నగర్‌ కి వెళ్లేవాడిని కాదు అని, విజయం వచ్చిందని చెప్పడానికి నిర్మాతలు భయపడుతున్నారని,

అలా చెబితే నెగటివ్‌గా ట్రోల్‌ చేస్తున్నారని వెల్లడించారు థమన్‌. మీరు చేసే నెగటివ్‌ ప్రచారం వల్ల నిర్మాతల జీవితాలు ఎఫెక్ట్ అవుతున్నాయని ఆయన అన్నారు. ఈ క్రమంలో సహనం కోల్పోయిన థమన్‌ ఎమోషనల్‌ కామెంట్స్ చేశారు. 

read more: బాక్సాఫీసు వద్ద బాలయ్య, వెంకీ మధ్య పోటీ.. `డాకు మహారాజ్‌`, `సంక్రాంతికి వస్తున్నాం` కలెక్షన్లు ఎలా ఉన్నాయంటే
 

46

ఇప్పుడు ప్రపంచం మొత్తం మన తెలుగు సినిమా వైపు గర్వంగా చూస్తుంది. తెలుగు సినిమా ఇప్పుడు ఒక వెలుగు వెలుగుతుంది. ఏ ఇండస్ట్రీకి వెళ్లినా తెలుగు సినిమా చేయాలంటున్నారు. కానీ మనమే మన సినిమాని చంపేసుకుంటుంటే ఏం బ్రతుకు బతుకుతున్నామో అర్థం కావట్లేదు.

విపరీతమైన ట్రోల్స్ వల్ల బాధగా ఉంది. ఒక సక్సెస్‌ని నిజంగా చెప్పుకోలేకపోతున్నాం. ఇది ఎంత దురదృష్టకరం, మీరు పర్సనల్‌గా కొట్టుకోండి, కానీ సినిమాని చంపేయకండి` అంటూ ఆవేదన వ్యక్తం చేశారు థమన్‌. ఆయన కామెంట్స్ వైరల్‌ అయ్యాయి. 
 

56

దీనిపై చిరంజీవి స్పందించారు. ఆయన ఎమోషనల్‌ కామెంట్స్ చేశారు. సుతిమెత్తగా చురకలు అంటించారు. డియర్‌ థమన్‌ నిన్న నువ్వు మాట్లాడిన మాటలు హృదయాల్ని తాకేలా ఉన్నాయి. ఎప్పుడూ సరదాగా మాట్లాడుతూ ఉండే నీలో ఇంత ఆవేదన ఉండటం నాకు ఒకింత ఆశ్చర్యంగా అనిపిస్తుంది.

కానీ మనసు ఎంత కలత చెందితే నువ్వింతగా స్పందించావో అనిపిస్తుంది. విసయం సినిమా అయినా, క్రికెట్‌ అయినా, మరో సామాజిక సమస్య అయినా, సోషల్‌ మీడియాలో వాడుతున్న ప్రతి ఒక్కరు తమ మాటల తాలూకూ ప్రభావం ఆ వ్యక్తుల మీద ఎలా ఉంటుందని ఆలోచించాలి. ఎవరో అన్నట్టు మాటలు ఫ్రీనే, మాటలు మనలో స్ఫూర్తిని నింపుతాయి.

అవే మాటలు మనల్ని నాశనం కూడా చేస్తాయి. మీకేం కావాలనేది మీరే నిర్ణయించుకోండి. మనం పాజిటివ్‌గా ఉంటే ఆ ఎనర్జీ మన జీవితాలను కూడా అంతే పాజిటివ్‌గా ముందుకు నడిపిస్తుంది. ఆలోచింప చేసే మాటలు మైడియర్‌` అంటూ పేర్కొన్నారు చిరంజీవి. 
 

66

దీనికి థమన్‌ కూడా స్పందించారు. డియర్‌ అన్నయ్యా, మీ మాటలకు నాకు కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన, అన్న భగవద్గీత శ్లోకాన్ని గుర్తు చేశాయి. ఎంత కాదనుకున్నా మనుషులం కదా, ఒక్కోసారి ఆవేదన గుండె తలుపులు దాటి వచ్చేస్తూ ఉంటుంది. పేగు తెంచుకుని పుట్టిన బిడ్డని, కళ్లు తెరిచే లోపలే చిదిమేస్తుంటే వచ్చిన బాధ అది.

నన్ను అర్థం చేసుకుని స్పందించిన మీ మాటలు నాకు జీవితాంతం గుర్తు ఉంటాయి` అని వెల్లడించారు థమన్. ఇలా అటు చిరు, ఇటు థమన్‌ మధ్య ఎమోషనల్‌ కన్వర్జేషన్‌ అందరిని ఆలోచింప చేస్తుంది. ట్రోల్స్, నెగటివ్‌ ప్రచారం సినిమానేకాదు, ఆయా టెక్నీషియన్లని కూడా ఎంతగానో మనోవేదనకు గురి చేస్తుంది.   

read more:దిల్‌ రాజుని నిలబెట్టేందుకు రామ్‌ చరణ్‌ సంచలన నిర్ణయం, పారితోషికం కట్‌.. అభిమాని కోసం ఏం చేశాడో తెలుసా?

also read: చిరంజీవి డాన్స్ చూసి బెదిరిపోయిన స్టార్‌ హీరో, శ్రీదేవితో ఆ పనిచేయించడానికి అభ్యంతరం!
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories