`డాకు మహారాజ్‌`, `సంక్రాంతికి వస్తున్నాం` కలెక్షన్లు.. బాక్సాఫీసు వద్ద బాలయ్య, వెంకీ మధ్య తీవ్ర పోటీ

Published : Jan 18, 2025, 05:53 PM ISTUpdated : Jan 18, 2025, 07:40 PM IST

టాలీవుడ్‌ సీనియర్‌ హీరోలు వెంకటేష్‌, బాలకృష్ణ బాక్సాఫీసు వద్ద పోటీ పడుతున్నారు. వీరిద్దరి సినిమాలు `డాకు మహారాజ్‌`, `సంక్రాంతికి వస్తున్నాం` భారీ కలెక్షన్లతో దూసుకుపోతున్నాయి.    

PREV
14
`డాకు మహారాజ్‌`, `సంక్రాంతికి వస్తున్నాం` కలెక్షన్లు.. బాక్సాఫీసు వద్ద బాలయ్య, వెంకీ మధ్య తీవ్ర పోటీ

ఈ సంక్రాంతికి సీనియర్లు దుమ్మురేపుతున్నారు. బాలకృష్ణ, వెంకటేష్‌ చాలా రోజుల తర్వాత బాక్సాఫీసు వద్ద పోటీ పడుతున్నారు. బాలయ్య నటించిన `డాకు మహారాజ్‌`, వెంకటేష్‌ నటించిన `సంక్రాంతికి వస్తున్నాం` సినిమా థియేటర్లలో రచ్చ చేస్తున్నాయి. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ మూవీస్‌కి ఆడియెన్స్ నుంచి విశేష స్పందన లభిస్తుంది. ఈ క్రమంలో ఈ ఇద్దరు సీనియర్లు కలెక్షన్ల విషయంలోనూ పోటీ పడుతున్నారు. 
 

24

బాలకృష్ణ హీరోగా రూపొందిన `డాకు మహారాజ్‌` మూవీ సంక్రాంతి కనుకగా ఈ నెల 12న విడుదలైంది. బాబీ దర్శకత్వం వహించిన ఈ మూవీలో ప్రగ్యా జైశ్వాల్‌, ఊర్వశీ రౌతేలా హీరోయిన్లుగా నటించారు. శ్రద్ధా శ్రీనాథ్‌ కీలక పాత్రలో నటించింది. బాబీ డియోల్‌ విలన్‌ పాత్ర పోషించారు. నాగవంశీ ఈ మూవీని నిర్మించిన విషయం తెలిసిందే.

ఆదివారం విడుదలైన ఈ చిత్రం భారీ కలెక్షన్ల దిశగా వెళ్తుంది. ఈ మూవీ ఆరు రోజుల్లో రూ. 124(75 కోట్ల షేర్‌) కోట్లు వసూలు చేసింది. భారీ వసూళ్ల దిశగా వెళ్తుంది. ఈ మూవీకి రూ.83కోట్లు వస్తే బ్రేక్‌ ఈవెన్‌ అవుతుంది. ఈ శని, ఆదివారంతో బ్రేక్‌ ఈవెన్‌ దాటుకుని లాభాల్లోకి వెళ్తుందని చెప్పొచ్చు. 

34

ఇక వెంకటేష్‌ నటించిన `సంక్రాంతికి వస్తున్నాం` మూవీ కూడా భారీ స్పందనతో దూసుకుపోతుంది. అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో ఐశ్వర్యా రాజేష్‌, మీనాక్షి చౌదరీ హీరోయిన్లుగా నటించారు. దిల్‌ రాజు నిర్మించిన ఈ మూవీ నాలుగు రోజుల్లో రూ.131కోట్లు వసూలు చేసింది.

సుమారు రూ. 80 కోట్ల షేర్‌ సాధించింది. ఈ మూవీ బ్రేక్‌ ఈవెన్‌ రూ.45కోట్లు. ఇప్పటికే బ్రేక్‌ ఈవెన్‌ దాటి అందరికి లాభాల పంట పండిస్తుంది. ఇదే కొనసాగితే ఈ మూవీ రెండు వందల కోట్ల మార్క్ వెళ్లబోతుందని అర్థమవుతుంది. 
 

44

వెంకటేష్‌, బాలకృష్ణ బాక్సాఫీసు వద్ద పోటీ పడటం చాలా అరుదు. ఆరేళ్ల క్రితం 2019లో వెంకటేష్‌ `ఎఫ్‌ 2`తో వచ్చాడు. బాలకృష్ణ `ఎన్టీఆర్‌ ః కథానాయకుడు` చిత్రాలతో ఆడియెన్స్ ముందుకు వచ్చాడు. ఆ సమయంలో కూడా వెంకీ సినిమానే సక్సెస్‌ అయ్యింది. బాలయ్య మూవీ డిజప్పాయింట్‌ చేయగా, వెంకీ మూవీ మంచి సక్సెస్‌ అయ్యింది.

కామెడీ మూవీ కావడంతో దీన్ని ఆడియెన్స్ బాగా ఆదరించారు. అయితే ఇప్పుడు ఇద్దరి మధ్య పోటీ ఉన్నా వెంకీదే పై చేయి కనిపిస్తుంది. ఇదిలా ఉంటే ఇప్పటి మాదిరిగానే అప్పుడు కూడా రామ్‌ చరణ్‌ `వినయ విధేయ రామ`తో వచ్చాడు. ఆ మూవీ డిజాస్టర్‌ అయ్యింది. ఇప్పుడు `గేమ్‌ ఛేంజర్‌` ఫలితం కూడా అలానే ఉంది. 

read more: దిల్‌ రాజుని నిలబెట్టేందుకు రామ్‌ చరణ్‌ సంచలన నిర్ణయం, పారితోషికం కట్‌.. అభిమాని కోసం ఏం చేశాడో తెలుసా?

also read: చిరంజీవి డాన్స్ చూసి బెదిరిపోయిన స్టార్‌ హీరో, శ్రీదేవితో ఆ పనిచేయించడానికి అభ్యంతరం!

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories