Bigg Boss Telugu 9: తనూజకి షాక్‌.. కళ్యాణ్‌ సీక్రెట్‌ క్రష్‌ బయటపెట్టిన ఇమ్మాన్యుయెల్‌

Published : Dec 16, 2025, 11:46 PM IST

బిగ్‌ బాస్‌ తెలుగు 9 టాప్‌ 5 కంటెస్టెంట్లకి సరదా యాక్టివిటీస్‌తో టైమ్‌ పాస్‌ చేయిస్తున్నారు బిగ్‌ బాస్‌. అందులో భాగంగా మంగళవారం ఆద్యంతం ఎంటర్‌టైనింగ్‌గా సాగింది. 

PREV
15
సరదా టాస్క్ లతో చివరి వారం బిగ్‌ బాస్‌

బిగ్‌ బాస్‌ తెలుగు 9 చివరి వారం మొత్తం సరదా గేమ్‌లతో టైమ్‌ పాస్ చేస్తున్నారు. చిన్న చిన్న టాస్క్ లు ఇస్తూ కంటెస్టెంట్లకి కావాల్సిన, ఇష్టమైన ఫుడ్‌ని ఇస్తూ వారిని ఖుషీ చేస్తున్నారు. ఈ క్రమంలో మంగళవారం ఎపిసోడ్‌లో కూడా సరదా టాస్క్ లు ఇచ్చారు. వన్స్ మోర్‌ వన్‌ లాస్ట్ ఛాన్స్ అంటూ టాస్క్ ఇచ్చారు. ఇందులో డీమాన్‌ పవన్‌ విన్ అయ్యారు. ఈరోజు ప్లేయర్‌ ఆఫ్‌ ది డే తనూజ విన్ అయ్యింది. దీంతో ఆమెకి ఇంటి నుంచి ఫోటో వచ్చింది. తన చెల్లి పెళ్లి ఫోటో. అందులో తనని కూడా మెర్జ్ చేయడంతో తనూజ ఎమోషనల్‌ అయ్యింది.

25
డీమాన్‌ పవన్ ఎమోషనల్‌

డీమాన్‌ పవన్‌ టాస్క్‌ లో విన్‌ అయ్యాక తన భావాలను పంచుకున్నారు. బిగ్‌ బాస్‌కి థ్యాంక్స్ చెప్పారు. చివరి వారానికి చేరుకోవడం బాధగా ఉందని, అయితే హౌజ్‌ని వదిలి వెళ్లాలని లేదని చెప్పాడు. కాస్త ఎమోషనల్‌ అయ్యాడు. తన ఈ జర్నీలో సపోర్ట్ చేసిన వారికి థ్యాంక్స్ చెప్పాడు. అయితే కొన్ని సార్లుతాను గట్టిగా మాట్లాడలేకపోయానని, అలా మాట్లాడితే హర్ట్ అవుతారని భావించి తాను మాట్లాడలేకపోయానని తెలిపారు పవన్‌.

35
అత్తగా ఇమ్మూ, కోడళ్లపై ఫైర్‌

ఇక ఎక్స్ ట్రా కట్‌లో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. అందరు కలిసి ఓ స్కిట్‌ ప్రదర్శించారు. ఇందులో ఇమ్మాన్యుయెల్‌ అత్తగా, కళ్యాణ్‌, పవన్‌ కొడుకులుగా, సంజనా, తనూజ కోడళ్లుగా నటించారు. ఇందులో ఇమ్మూ రెచ్చిపోయాడు. కోడళ్లపై ఫైర్‌ అయ్యాడు. తనూజని సరిగా పని చేయడం లేదని, ముచ్చట్లు పెడుతున్నావని ఫైర్‌ అయ్యాడు. ఆ తర్వాత సంజనాపై కూడా మండిపడ్డాడు. ఇది నాకే అత్తగా ఉంది, నాకు కోడళు ఏంట్రా అంటూ రచ్చ చేశాడు.

45
కళ్యాణ్‌కి రమ్యని సెట్‌ చేస్తానని చెప్పిన ఇమ్మూ

అయితే పదే పదే అత్త పిలవడంతో విసుగు చెంది తన ఇంటి నుంచి వెళ్లిపోతానని పోతుంది. దీంతో ఇమ్మాన్యుయెల్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మీకు మంచి అమ్మాయిలు దొరుకుతారు అని చెప్పి నీకు రీతూని ఇచ్చి పెళ్లి చేస్తానని పవన్‌కి చెప్పడం విశేషం. మరోవైపు కళ్యాణ్‌ని ఉద్దేశించి చెబుతూ, నీకు ఎవరు కావాల్రా అని అడిగాడు, ఒకరు పేరు చెప్పాడు. ఆ తర్వాత రమ్య  కావాలా? అని చెప్పడంతో కళ్యాణ్‌ నవ్వులు పూయించారు. మొత్తంగా ఈ రోజు ఎపిసోడ్‌ ఆద్యంతం నవ్వులు పూయించేలా సాగింది. ఇమ్మాన్యుయెల్‌ సరదాగా చెప్పినా, రమ్య పేరు తీసుకురావడం ఆశ్చర్యంగా మారింది. కళ్యాణ్‌, రమ్యకి మధ్య ఏదో ఉందనే విషయాన్ని ఇమ్మూ చెప్పకనే చెప్పాడు.

55
తనూజకి షాక్‌

ఇదిలా ఉంటే రమ్య.. కళ్యాణ్‌పై పలు ఆరోపణలు చేసింది. అమ్మాయి పిచ్చి అనేలా కామెంట్‌ చేసింది. అది పెద్ద వైరల్‌గా, ట్రోల్‌కి గురయ్యింది. కళ్యాణ్‌ వ్యక్తత్వాన్నే రాంగ్గా పోట్రే చేసింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆమె పేరుని ఇమ్మాన్యుయెల్‌ చెప్పడం ఆశ్చర్యపరుస్తోంది. తెరవెనుక వేరే కథ ఉందా అనే అనుమానాలకు తావిస్తోంది. ఇదిలా ఉంటే స్కిట్‌లో కళ్యాణ్‌కి జోడీగా తనూజ కనిపించింది. ఆమెని కాదని, రమ్యని తీసుకురానా అంటూ ఇమ్మాన్యుయెల్‌ చెప్పడం నవ్వులు పూయించింది. అదే సమయంలో కథ వేరే ఉందనిపిస్తోంది.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories