దీనిపై నోరా ఫతేహి స్పందిస్తూ.. వ్యక్తిగతంగా మా మధ్యన ఎలాంటి సంభాషణ జరగలేదు. ఆ ఈవెంట్ లోనే కేవలం ఒక్క బ్యాగ్, ఐఫోన్ ఇచ్చినట్లు నోరా పేర్కొంది. కానీ ఆమె సొంతంగా 4 బ్యాగులు సెలెక్ట్ చేసుకున్నట్లు సుఖేష్ వివరించారు. 4 గంటల పాటు జరిగిన విచారణలో ఈడీ అధికారులు ఆమె స్టేట్మెంట్ ని రికార్డ్ చేశారు. శివేందర్ సింగ్, అదితి సింగ్ వద్ద సుఖేష్ చంద్రశేఖర్ మోసానికి పాల్పడి 200 కోట్లు దోపిడీ చేశాడు. ఈ స్కామ్ లో నోరా ఫతేహికి కూడా సంబంధాలు ఉన్నాయనేది ఆరోపణ.