బిగ్ బాస్ హౌస్ పిచ్చోళ్లుగా మార్చే ఫ్యాక్టరీ... దాని డిజైన్ వెనకున్న ఒళ్ళు గగుర్లిగొలిపే నిజాలు! 

Published : Sep 03, 2022, 01:05 PM ISTUpdated : Sep 03, 2022, 01:07 PM IST

బిగ్ బాస్ షో పట్ల చాలా మందికి మంచి అభిప్రాయం ఉండదు. పెట్టింది తిని చక్కగా ఆడుకుంటూ ఒక ఇంట్లో కొన్ని రోజులు ఉండటం పెద్ద విషయమా అనుకుంటారు. కానీ చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే అది ఒక నరకం...   

PREV
16
బిగ్ బాస్ హౌస్ పిచ్చోళ్లుగా మార్చే ఫ్యాక్టరీ... దాని డిజైన్ వెనకున్న ఒళ్ళు గగుర్లిగొలిపే నిజాలు! 

 షోలో పాల్గొనే కంటెస్టెంట్స్ మానసిక స్థితిని దెబ్బతీసేలా, వాళ్ళ మనో ధైర్యాన్ని పరీక్షించేలా హౌస్ డిజైన్, గేమ్స్, టాస్క్ ఉంటాయి. కంటెస్టెంట్స్ కారణం లేకుండా ఎందుకు ఏడ్చేస్తారు, కోప్పడతారని మనం అనుకుంటాం. దానికి రీజన్ ఆ హౌస్, అక్కడ పరిస్థితులు కంటెస్టెంట్స్ ని ఆ విధంగా ప్రేరేపిస్తాయి. 

26

 హౌస్ కి డిఫరెంట్ డార్క్ కలర్స్ వాడతారు. సైన్స్ ప్రకారం భిన్నమైన ముదురు రంగులు మానసిక ప్రశాంత దెబ్బతీస్తాయి. మన ఇళ్లలో చూస్తే కేవలం ఒకే రంగు, అది కూడా లేత రంగై ఉంటుంది. బిగ్ బాస్ హౌస్ లో ఆ రంగులు అందం కోసం అనుకుంటే పప్పులో కాలేసినట్లే. మానసిక ప్రశాంతను దెబ్బతీసే ఆ రంగులు కంటెస్టెంట్స్ మధ్య గొడవలకు కారణం అవుతాయి. 

 

36

ఇక మనిషి ఆరోగ్యం, మానసిక స్థితి నిద్ర, ఆహారం మీద ఆధారపడి ఉంటుంది. బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కి అతిపెద్ద సవాల్ ఈ రెండు ప్రాథమిక అవసరాలు. హౌస్ లో నిద్ర లేచే టైమింగ్స్, పడుకునే టైమింగ్స్ బిగ్ బాస్ నిర్ణయిస్తాడు. ఆ నిర్ణీత సమయంలో మాత్రమే పడుకోవాలి. అలా కాదని ఎవరైనా కునుకు వేస్తే కుక్క అరుస్తుంది. ఆ అరుపు పిచ్చ చికాకు తెప్పిస్తుంది. 

46


ఇక భోజనం విషయంలో కూడా అంతే. టాస్క్ లో గెలిచిన ఆధారంగా రేషన్ వస్తుంది. నీకు నచ్చింది అక్కడ ఉండదు. వాళ్ళు పెట్టింది మాత్రమే తినాలి. అలాగే టాస్క్స్ ఆధారంగా వంట చేసేది ఎవరో నిర్ణయిస్తారు. వాళ్ళ వంట నచ్చినా నచ్చకున్నా అడ్జస్ట్ అవ్వాలి. ఈ కారణాలతో సరిపడా నిద్ర, ఆహారం ఉండదు. ఎవరి రెండు లేని మనిషి తరచుగా విచక్షణ కోల్పోతారు. 

56


అమ్మా, నాన్న,భార్య, పిల్లలు, ప్రేయసి వంటి బంధాలకు దూరం అవుతారు. హోమ్ సిక్ విపరీతంగా ఉంటుంది. ఇంటి సభ్యులను తలచుకొని ఏడ్చే కంటెస్టెంట్స్ ని మనం చూశాం. అది ఒక సైకలాజికల్ ఛాలెంజ్ అని చెప్పాలి. ఇది అధిగమించలేని వాళ్ళు మధ్యలోనే వచ్చేస్తారు. 

66

వయసులో ఉన్న అబ్బాయిలు అమ్మాయిలు దగ్గరవుతారు. షో కోసం యంగ్ బ్యూటీస్ ని హాట్ బాయ్స్ ని హౌస్ లోకి పంపుతారు . ఒక ఇంట్లో ఉండడంతో పాటు ఒంటరి తనాన్ని అందమైన అమ్మాయిలు, అబ్బాయిలు ప్రభావితం చేస్తారు. కంటెస్టెంట్స్ ని ఆకర్షించేలా వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్ ఉంటుంది. ఇక ప్రేమలు, రిలేషన్స్ స్టార్ట్ అవుతాయి. ఈ విధంగా బిగ్ బాస్ హౌస్ కంటెస్టెంట్స్ మానసిక శక్తికి పరీక్ష పడుతుంది.

click me!

Recommended Stories