దావూదు ఇబ్రహీం.. ఒకప్పుడు ముంబయ్ అండర్ వరల్డ్ డాన్ గా.. ఇండియాతో పాటు.. ప్రపంచ దేశాలను గడగడలాడించాడు. ప్రస్తుతం పాకీస్తాన్ లో ఉన్నట్టు.. ఆయన పై విష ప్రయోగం జరిగి... హాస్పిటల్ లో ట్రీట్మెంట్ ఇస్తున్నట్టు వార్తలు వైరల్అవుతుండా.. దావూద్ పై రకరకాల కథనాలు వెలువడుతున్నాయి. 1993 ముంబై వరుస పేలుళ్ల సూత్రధారి దావూద్.. టెక్నాలజీ అందుబాటులో లేని రోజుల్లోనే.. తెలివితేటలు ఉపయోగించి అడ్వాన్స్ గా ఆలోచించి ప్లాన్లు వేయగల ఇబ్రహీం.. ప్రస్తుతం వయస్సు మళ్ళిపోయాడు.
విజయ్ కాంత్ కు అవమానం, బాలీవుడ్ వాళ్లను కొట్టడానికి వెళ్లిన కుష్బూ, ఏం జరిగింది..?
అండర్ వరల్డ్ డాన్ గా ఉన్న దావూద్ .. అన్నిరంగాలతో పాటు సినిమా రంగంపై కూడా ప్రభావం చూపించాడు. బాలీవుడ్ స్టార్స్ చాలా మందికి అతనితో డీలింగ్స్ ఉన్నట్టు పుకార్లు ఉన్నాయి. ముఖ్యంగా హీరోయిన్లత్ దావూద్ ప్రేమాకలాపాలు అప్పటలో హాట్ టాపిక్ అయ్యాయి. 80 నుంచి 90 దశకంలో.. బాలీవుడ్ ను ఏలుతున్న హీరోయిన్లలో మందాకిని నుండి జాస్మిన్ ధున్ వరకు చాలా మంది బాలీవుడ్ తారలు దావూద్ ఇబ్రహీంతో ప్రేమలో పడ్డారట.
40 లక్షలు సాయం.. నటుడు పొన్నంబలంకు ప్రాణం పోసిన తెలుగు స్టార్ హీరో ఎవరో తెలుసా..?
పాకిస్థాన్‌కు చెందిన అనితా అయూబ్. అతని గర్ల్‌ఫ్రెండ్ అని పుకారు వచ్చింది. బాలీవుడ్‌లో స్టార్‌గా ఎదిగిన ఆమె ఆ తర్వాత ఇండియాను వదిలి వెళ్లిపోయింది. అనితా అయూబ్ పాకిస్తాన్‌లోని కరాచీలో జన్మించింది. కరాచీ విశ్వవిద్యాలయం నుండి ఆంగ్ల సాహిత్యంలో మాస్టర్స్ డిగ్రీని పొందింది. ఆతరువాత మోడలింగ్ చేసి.. బాలీవుడ్ బాట పట్టింది.
షూటింగ్ చూడ్డానికి వచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకున్న స్టార్ డైరెక్టర్..
ముంబైలోని రోషన్ తనేజా స్కూల్ ఆఫ్ యాక్టింగ్ నేర్చుకున్న అనితా పాకిస్థాన్‌లో మోడల్‌గా తన కెరీర్‌ను ప్రారంభించింది. 1993లో, ఆమె ఒక కమర్షియల్ షూటింగ్ కోసం భారతదేశానికి వచ్చింది అదే టైమ్ లో కొత్త హీరోయిన్ కోసం వెతుకుతున్న దేవ్ ఆనంద్ దృష్టిని ఆకర్షించింది. ఆమె నటన చూసి ప్యార్ కా తరానాలో అవకాశం ఇచ్చాడు.
నటిగా బాలీవుడ్ లో బిజీ అవుతున్న టైమ్ లో .. ఆమె దావూద్ తో ప్రేమలో ఉందని.. ఆయనకోసం పనిచేస్తుందని పుకారు వచ్చింది. దాంతో అనితా ఆయూబ్ కు అవకాశాలు తగ్గిపోయాయి. 1995లో, నిర్మాత జావేద్ సిద్ధిక్ తన సినిమాలో అవకాశం ఇవ్వడానికి నిరాకరించాడు. దాంతో దావూద్ ఇబ్రహీం తరఫు వ్యక్తులు అతడిని కాల్చి చంపినట్లు బాలీవుడ్ లో టాక్. ఇలా ఆమెపై పాకిస్తాని గూఢచారి అనిపేరు పడింది. ఇండస్ట్రీ నుంచి అనితాను బహిష్కరించారు కూడా. దాంతో ఆమె సినిమాలు మానేసి పాకిస్తాన్ వెళ్లిపోయింది.
ఇక దావూదు లిస్ట్ లో మరీ ముఖ్యంగా హీరోయిన్ మందాకినితో దావూద్ లవ్ ఎఫైర్ ప్రత్యేకంగా చెప్పుకోవాలి. 1980 నుంచి రెండు దశాబ్దాల పాటు.. బాలీవుడ్ ను ఏలింది మందాకిని. వెండితెర తారగా వెలుగు వెలిగింది. బాలీవుడ్ లో నటి మందాకిని అంటే పడిచచ్చిపోయేవారు. తన అందచందాలతో అప్పటి కుర్రకారును ఓ ఊపుఊపేసి వదిలిపెట్టింది సీనియర్ బ్యూటీ. రామ్ తేరీ గంగా మైలీ తో బాలీవుడ్ లో కెరీర్ స్టార్ట్ చేసింది మందాకిని.. ఈసినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. ఆమె అందం నటనకు ఫిదా అయిపోయి.. వరుస ఆఫర్లు ఆమెను వెతుక్కుంటూ వచ్చాయి.
ఎంత ఫాస్ట్ గా ఎదిగి.. స్టార్ గా మారిందో.. అంతే ఫాస్ట్ గా పతనం చెందింది ఆమె సినిమా కెరీర్. దానికి కారణం ఒక్క ఫోటో. అప్పట్లో నిర్మాతలు పీల్చి పిప్పిచేసేవాడు దావూద్ ఇబ్రహీం.కాని ఆయన మందాకిని అందానికి ముగ్ధుడైపోయాడు.. మందాకిని చూస్తే చాలు మత్తెక్కిపోయేవాడు. దాంతో ఆమెను పిచ్చిగా ప్రేమించాడు. చివరికి ఆమెను తన ప్రేమలో పడేశాడు. చాన్నాళ్లు కలిసి తిరిగారట. లివింగ్ రిలేషన్ లో ఉన్నారట. దాంతో మందాకిని కెరీర్ బాలీవుడ్ లో పడిపోతూ వచ్చింది. ఇద్దరి ఫోటోలు బయటకురావడంతో ఈ విషయం అప్పట్లో సంచలనంగా మారింది.
అంతే కాదు దావూద్ తో కలిసి మందానికి కూడా చట్ట వ్యతిరేక పనులు చేస్తుంది అని ఆరోపణలు చుట్టుముట్టాయి. దాంతో ఆమెకు సినిమాల్లో అవకాశాలు తగ్గడం స్టార్ట్ అయ్యింది. క్రమంగా సినీ అవకాశాలు తగ్గడంతో మందాకిని కెరీర్ పాతాళానికి పడిపోయింది. దావూద్ సినిమా వాళ్లను హింసించడం.. అతనిపై ఉన్న నెగెటివిటీ కారణంగా నిర్మాతలు మందాకినికి సినిమాల్లో అవకాశం ఇవ్వడం మానేశారు. దీంతో మందాకినీ ఫిల్మ్ ఇండస్ట్రీకి పూర్తిగా దూరం అయ్యింది.