Karthika Deepam: మోనిత వల్ల కార్తీక్ కి తృటిలో తప్పిన ప్రమాదం.. వాణి మీద దుర్గకు అనుమానం!?

Published : Oct 26, 2022, 07:23 AM IST

Karthika deepam:బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్,కుటుంబ కథా నేపథ్యంతో కొనసాగుతూ ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఈరోజు అక్టోబర్ 26వ తేదీన ఏం జరుగుతుందో తెలుసుకుందాం.  

PREV
18
Karthika Deepam: మోనిత వల్ల కార్తీక్ కి తృటిలో తప్పిన ప్రమాదం.. వాణి మీద దుర్గకు అనుమానం!?

ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే.. దుర్గ ఇడ్లీ తిందామనే సరికి వాణి ఇడ్లీని కింద పారేస్తుంది. ఎందుకిలా చేశావు అని దుర్గ అనగా, కార్తీక్ అన్నయ్య వచ్చారు కదా అన్నయ్యతో తిను నువ్వు ఒక్కడివే ముందు తింటే బాగోదు అని అంటుంది. ఇంతలో కార్తీక్ కూడా దీప ఇచ్చిన ఇడ్లీ ప్లేట్ పట్టుకొని తినడం మొదలుపెట్టేసరికి మోనిత అక్కడికి వస్తుంది.  వచ్చి కార్తీక్ చేతిలో ఉన్న ఇడ్లీ ప్లేట్ ని కింద పడేసి, అసలు ఏమనుకుంటున్నావ్ కార్తీక్ ఎందుకు ప్రతిసారి ఇక్కడ వస్తున్నావు నేను ఇంట్లో ఉన్నాను అని తెలుసు కదా అని అరుస్తుంది. అప్పుడు వాణి, ఏంటి రెచ్చిపోతున్నావు ఎవరి దగ్గరికి వచ్చి ఏం మాట్లాడుతున్నావు అని అరుస్తుంది. దానికి మోనిత, నా భర్త దగ్గరికి వచ్చి నేను మాట్లాడితే మధ్యలో నీకెందుకే అని తిడుతుంది. అలా వాళ్ళిద్దరూ కుర్చీలు తీసుకొని ఒకరినొకరు కొట్టుకుంటూ ఉంటారు. 

28

ఇంతలో కార్తీక్ వాళ్ళని ఆపుతాడు రా కార్తిక్ మనం ఇంటికి వెళదాము అని మోనిత కార్తీక్ ని కోపంగా అక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోతుంది. అప్పుడు దుర్గ వాణి తో, కొంచెం కంట్రోల్ చేసుకోవాలని వాణి కార్తీక్ సార్ ముందు మోనితని ఏమీ అనొద్దు అని అనగా లేకపోతే నాతోనే పెట్టుకుంటాదా! అన్నయ్యని వదినని విడదీయాలనుకునే ఎవరిని నేను వదిలిపెట్టను అని వాణి అంటూ మనసులో హమ్మయ్య పెద్ద ప్రమాదం తప్పింది సరైన సమయానికి మోనిత వచ్చింది సరిపోయింది అని అనుకుంటుంది. అప్పుడు దీప టిఫిన్ కింద పడిపోయింది నేను వెళ్లి దోసెలు చేసుకొని వస్తాను అని అంటాది. మరోవైపు ఇంద్రుడు ఆటో క్లీన్ చేస్తూ చంద్రమ్మా జ్వాల ఏది ఇంకా రాలేదు అని అడగగా జ్వాలమ్మ బాత్రూంలో ఉన్నది లేవయ్యా అని అంటుంది చంద్రమ్మ. ఇందాకే స్నానం చేసింది కదా అంటే మళ్ళీ చేసింది అర్థం చేసుకో పెద్దమనిషి అయింది అని అనగా ఇంద్రుడు ఎంతో ఆనందపడతాడు.

38

 అప్పుడు చంద్రమ్మ వెళ్లి చాప లాంటి కావలసిన పదార్థాలు అని కొనమని చెప్తుంది. మరోవైపు దీప, తన ఇంట్లో కూర్చుంటూ కార్తీక్,  వాళ్ల ఇంటి బయట కూర్చుంటూ శౌర్య గురించి ఆలోచిస్తూ ఉంటారు. శౌర్య, ఎన్ని కష్టాలు వచ్చాయి నీకు. ఈ వయసులోనే నువ్వు ఇలా బతకాల్సి వస్తుంది అందరూ ఉన్న ఒంటరిగా ఉన్నట్టున్నావు నీకేంటమ్మా ఈ కర్మ. అయినా నువ్వు ఒక్కదానివే ఉన్నావా లేక ఎవరైనా చూసుకుంటున్నారా అసలు బాగోగులు ఏంటి. అయినా ఇదంతా మోనిత వల్లే జరిగింది అని ఇద్దరు మనసులో అనుకుంటారు.అప్పుడు కార్తీక్, ఈ మోనిత ని ఎలాగైనా తన గుట్టు తనంటే తానే బయటకు విప్పేలా చేయాలి కచ్చితంగా దాని పని పడతాను అని కోపంగా ఉంటాడు. అదే సమయంలో దీప కూడా, అయినా నా కళ్ళముందే నా మొగుడు చెయ్యి పట్టుకుని వెళ్తుంటే నేనెందుకు ఊరుకొని కూర్చోవాలి. 

48

నేను ఏంటో చూపిస్తాను అని దీప అనుకుంటుంది. ఆ తర్వాత సీన్లో మోనిత హాల్లో కూర్చుంటూ సరైన సమయానికి వాణి మెసేజ్ పెట్టింది కనుక సరిపోయింది లేకపోతే కార్తీక్ ఏమయి ఉండేవాడు. ఈ మాత్రం నేను చేయలేం ఏంటి? మట్టి నా చేతికి అంటుకోకూడదని దాన్ని పెట్టాను అని అనుకుంటూ ఉండగా ఇంతలో కార్తీక్ వచ్చి ప్రియమణి ఎవరు అని అడుగుతాడు. దానికి మోనిత షాక్ అయ్యి నాకు తెలియదు కార్తీక్ అని నెమ్మదిగా అంటుంది. నిజంగా నీకు తెలీదా అని అడగగా మోనిత గతంలో ప్రియమణి గురించి గుర్తుతెచ్చుకుంటుంది. లేదు కాబట్టి నాకు అలా ఎవరూ తెలీదు అని అంటుంది. దానికి కార్తీక్, నాకు తను ఇందాక కనిపించింది నీ దగ్గర పని చేసిందట అడిగితే మన ఇద్దరికీ పెళ్లి ఎప్పుడు అయింది అని అడుగుతుంది అని అనగా ప్రియమైన ఇక్కడ ఉండడం ఏంటి అని మోనిత మనసులో అనుకుంటూ, నా దగ్గర చాలా మంది పనిచేస్తుంటారు కార్తీక్. 
 

58

ప్రతిఒక్కలు పేరు నేను గుర్తుంచుకోలేను కదా అలాగే తను కూడా గుర్తుండలేదేమో అందుకే పెళ్లికి పిలవలేనట్టున్నాను అని అంటుంది. మరి దానికి దీప ఎవరో తెలుసా అని కార్తీక్ అడగగా మోనిత, హమ్మయ్య దీప ప్రస్తావన రాలేనట్టు ఉన్నది అని అనుకుంటూ, తను ఎవరో నాకు తెలియదు అన్నప్పుడు తనకి దీప తెలుసా లేదా అనేది నాకేం తెలుసు కార్తీక్ అని అంటుంది మోనిత. దానికి కార్తీక్ మనసులో, భలే తెలివిగా సమాధానం ఇస్తున్నావు మోనిత అనుకొని, అయితే మన బిడ్డ విషయం ఏంటి మనకు ఎప్పుడు పెళ్లయింది మోనిత? ఆనంద్ ని చూస్తుంటే సంవత్సరం పిల్లాడిలా ఉన్నాడు. అంటే మనకు పెళ్ళై సంవత్సరం న్నర లేక రెండు సంవత్సరాలు అయి ఉండొచ్చు కదా మరి మన వయసును చూస్తే ఏ పదో 12 ఏళ్ల పిల్లలు ఉండేటట్టు ఉంది కదా అని అనగా మోనిత భయపడుతూ ప్రతి ఒక్కరూ 21 ఏళ్లకే పెళ్లి చేసుకోవాలని లేదు కదా కార్తీక్. మనం వెయిట్ చేసి సెటిల్ అయిన తర్వాత పెళ్లి చేసుకున్నాము అని అంటుంది మోనిత. 

68

అప్పుడు కార్తీక్, నువ్వు నా దగ్గర ఏదో దాస్తున్నావు మోనిత. నువ్వు చెప్పిన గతానికి నాకు ఇక్కడ తెలుస్తున్న నిజాలకి ఎటువంటి సమాధానము లేదు ఒకవేళ నిజంగా నువ్వు నా దగ్గర ఏమైనా దాస్తున్నావని తెలిసిందా నాలో ఉన్న రాక్షసుడిని చూస్తావు అని చెప్పి వెళ్ళిపోతాడు కార్తీక్. అప్పుడు మోనిత భయపడుతుంది. ఆ తర్వాత సీన్లో దుర్గా వాణి రోడ్ మీద నడుచుకుంటూ వెళుతూ ఉంటారు. అప్పుడు వాణి దుర్గతో, నీకు దీప వదిన ఎప్పటినుంచి తెలుసు అని అడగగా పదేళ్ల నుంచి తెలుసు పాపం చాలా కష్టపడింది మొన్న మొన్నే మళ్ళీ కనిపించింది.  సంతోషంగా ఉన్నారు అనుకుంటే ఇంత జరిగింది అని అంటాడు. అప్పుడు వాణి మనసులో, వీడిని బుట్టలోకి దించాలి నా పని సులువుగా అవుతుంది అని అనుకుంటూ మొన్న వెళ్లిన రెస్టారెంట్ కి మళ్ళీ వెళ్దామా అని అడుగుతుంది. అదే సమయంలో అటువైపుకి ఇద్దరు పోలీసులు వస్తారు.

78

పోలీసులను చూసిన దుర్గ ఒక వైపు పారిపోతే వాణి ఇంకోవైపు పారిపోతుంది. పోలీసులు వెళ్లిపోతారు అప్పుడు దుర్గ మనసులో, పోలీసులు చూసిన వెంటనే భయమేస్తుంది ఇప్పుడు నేను దాక్కున్నానంటే తను ఏమనుకుంటుందో అనుకొని చూసేసరికి తను దాక్కొని ఉంటుంది. నేను దాక్కున్నాను అంటే ఒక అర్థం ఉన్నది అది ఎందుకు దాక్కుంది అని దుర్గ అనుకుంటూ వాణి దగ్గరికి వెళ్లి నువ్వు ఎందుకు దాక్కున్నావ్ అని అడుగుతాడు. ఏమీ లేదు  నాకు పోలీసులుంటే చిన్న భయం మనం తినడానికి వెళ్దాం అనుకున్నాం కదా వెళ్దామా అని వాణి అనగా, ఇదేదో దాస్తుంది అనుమానస్పదంగా ఉన్నది అని దుర్గ మనసులో అనుకుంటాడు. ఆ తర్వాత సీన్లో చంద్రమ్మ ఇంద్రుడు దగ్గరకు వెళ్లి, రేపే జ్వాలమ్మకి స్నానం తను గొప్ప ఇంట్లో పుట్టిన బిడ్డ కదా మనం చేయగలిగింది ఏమైనా చేయాలి చిన్న ఫంక్షన్ లాంటిది ఏమైనా చేయాలి అని అంటుంది. దానికి ఇంద్రుడు, మరి డబ్బులు ఎక్కడివి ఇప్పటికిప్పుడు అంటే ఎక్కడి నుంచి వస్తాయి అని అనగా, నా దగ్గర ఉన్నాయి కదా పుట్టింటి నుంచి తెచ్చింది అని అంటుంది చంద్రమ్మ. 

88

దానికి ఇంద్రుడు,  వద్దు అవి మనం వ్యాపారం పెట్టి జ్వాలమ్మ భవిష్యత్తును మెరుగుపరచడానికి కదా దాని నుంచి రూపాయి కూడా తీయొద్దు నేను ఎలాగైనా డబ్బు ఏర్పాట్లు చూస్తాను అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత సీన్లో కార్తీక్, శౌర్య వినాయకుడు బొమ్మలు అమ్మిన స్థలం దగ్గరికి వచ్చి, వాళ్ళు పండగలప్పుడు వస్తారు అని చెప్పారు కదా వినాయకుడి బొమ్మలు అమ్మడానికి వచ్చారంటే దీపావళి క్రాకర్స్ కూడా అమ్మడానికి వస్తారు కదా అని అనుకుంటూ అక్కడ ఉన్న అతని ఇక్కడ దీపావళికి క్రాకర్స్ ఎక్కడ అమ్ముతారు అని అడుగుతాడు. అదే సమయంలో ఇంద్రుడు తన ఆట ఎదురుగుంట నించొని ఆలోచిస్తూ ఉంటాడు. ఇప్పుడు జ్వాలమ్మ కి  ఫంక్షన్ పెట్టాలి డబ్బులు లేవు కొట్టేద్దాం అంటే జ్వాలమ్మ ఒట్టించుకుంది అని అనుకుంటాడు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది. తర్వాయి భాగంలో ఏం జరిగిందో తెలియాలంటే రేపటి వరకు ఎదురు చూడాల్సిందే!

click me!

Recommended Stories