అనుకున్నట్లే 'డంకీ' కొంప మునిగింది.. ప్రభాస్ 'సలార్'కి పోటీగా రావడం బ్లండర్ మిస్టేక్

First Published Dec 21, 2023, 3:11 PM IST

సలార్ కి డంకీ ఏమాత్రం పోటీ కాదని విశ్లేషకులు, ఫ్యాన్స్ తేల్చేస్తున్నారు. సినిమా చాలా స్లోగా సాగుతోందట. పైగా రాజ్ కుమార్ హిరానీ స్థాయి చిత్రం కూడా కాదని తేల్చేస్తున్నారు. 

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కిన సలార్ చిత్రం మరికొన్ని గంటల్లో ఆడియన్స్ ముందుకు రానుంది. ఇండియా వ్యాప్తంగా సలార్ మ్యానియా మామూలుగా లేదు. అడ్వాన్స్ బుకింగ్స్ చూస్తుంటే సలార్ తొలిరోజు వసూళ్ళలో ప్రభంజనం సృష్టించబోతున్నట్లు అర్థం అవుతోంది. 

ప్రశాంత్ నీల్ కెజిఎఫ్ ని మించేలా ప్రభాస్ కి ఎలివేషన్స్ ఇస్తున్నారు. సెకండ్ ట్రైలర్ రిలీజ్ అయ్యాక సలార్ ఫీవర్ ఫ్యాన్స్ లో ఎక్కువైపోయింది. ఒక్కసారిగా హైప్ పీక్స్ కి చేరింది. సినిమా బావుంటే బాక్సాఫీస్ రికార్డులు అన్నీ సలార్ పాదాక్రాంతం అవుతాయని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 

Latest Videos


అయితే నార్త్ లో సలార్ పరిస్థితి ఎలా ఉండబోతోంది అనే చిన్న టెన్షన్ ఫ్యాన్స్ లో ఉండేది. ఎందుకంటే సలార్ డిసెంబర్ 22న రిలీజ్ అవుతుంటే ఒకరోజు ముందు కింగ్ ఖాన్ షారుఖ్ తన డంకీ చిత్రంతో వస్తున్నాడు. నార్త్ లో షారుఖ్ ఎంత పెద్ద స్టారో చెప్పనవసరం లేదు. పఠాన్, జవాన్ లాంటి వరుస హిట్ల తర్వాత షారుఖ్ నుంచి వస్తున్న చిత్రం ఇది. దీనితో సలార్ పై డంకీ ప్రభావం ఎలా ఉంటుందో అనే చిన్న టెన్షన్ ఉండేది. 

కానీ డంకీపై ఉన్న అనుమానం ఏంటంటే.. ఇది రాజ్ కుమార్ హిరానీ చిత్రం. రాజ్ కుమార్ హిరానీ గురించి తెలిసిందేగా.. ఆయన ఎప్పుడూ మాస్ కథలు చేయరు. కానీ బలమైన సందేశంతో ఆకట్టుకుంటారు. ఏది ఏమైనా షారుఖ్ ఖాన్ లాంటి పెద్ద స్టార్ సినిమా కావడంతో సలార్ కి డంకీ ఎఫెక్ట్ తప్పదనే అంచనాలు వినిపించాయి. నేడు డంకీ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సలార్ ఫ్యాన్స్ అనుమానాలన్నీ తొలగిపోయాయి. 

సలార్ కి డంకీ ఏమాత్రం పోటీ కాదని విశ్లేషకులు, ఫ్యాన్స్ తేల్చేస్తున్నారు. సినిమా చాలా స్లోగా సాగుతోందట. పైగా రాజ్ కుమార్ హిరానీ స్థాయి చిత్రం కూడా కాదని తేల్చేస్తున్నారు. రాజ్ కుమార్ హిరానీ గత చిత్రాలతో పోల్చితే ఇది అంత గొప్ప చిత్రం కాదని అంటున్నారు. షారుఖ్ పెర్ఫామెన్స్ బావున్నప్పటికీ సౌత్ లో ఈ తరహా చిత్రాలు నిలబడలేవు. నార్త్ లో కూడా డంకీకి కష్టమే అని అంటున్నారు. రేపటి నుంచి సలార్ రంగంలోకి దిగుతోంది. 

ప్రస్తుతం సలార్ కి ఉన్న క్రేజ్ దృష్ట్యా బాక్సాఫీస్ వద్ద ఆ తుఫాన్ లో డంకీ చిత్రం కొట్టుకుపోవడం ఖాయం అంటున్నారు. సలార్ లాంటి మాస్ చిత్రానికి పోటీగా డంకీని దించడం పెద్ద బ్లండర్ అంటున్నారు. సలార్ కి సూపర్ హిట్ టాక్ వస్తే డంకీ కనిపించడం కూడా కష్టమే. 

వరుసగా ఈ ఏడాది ఆల్రెడీ షారుఖ్ నుంచి రెండు సూపర్ హిట్ చిత్రాలు వచ్చాయి. హ్యాట్రిక్ కొట్టాలనుకున్న షారుఖ్ ఫ్యాన్స్ అసలు ఫలించలేదు. కాస్త కామెడీ, ఎమోషన్స్ ఉన్నప్పటికీ డంకీ రాజ్ కుమార్ హిరానీ, షారుఖ్ ఖాన్ చేయాల్సిన చిత్రం కాదు అని అంటున్నారు. పాత కథతో హిరానీ ఎమోషన్స్ పండించే ప్రయత్నం చేశారు. అయితే అది పూర్తిగా వర్కౌట్ కాలేదు. బాహుబలి తర్వాత నార్త్ లో ఆ రేంజ్ లో బాక్సాఫీస్ పై ప్రభాస్ విరుచుకుపడేందుకు లైన్ క్లియర్ అయింది అని చెప్పొచ్చు. 

click me!