Pallavi Prashanth Arrest: ప్లీజ్ నా తమ్ముడిని వదిలేయండి... చేతులు జోడించి వేడుకున్న అశ్వినిశ్రీ!

First Published | Dec 21, 2023, 3:08 PM IST


పల్లవి ప్రశాంత్ అరెస్ట్ అయిన నేపథ్యంలో తోటి కంటెస్టెంట్స్ స్పందిస్తున్నారు. అశ్విని శ్రీ ప్రశాంత్ ని వదిలివేయాలని ఓ ఎమోషనల్ వీడియో షేర్ చేసింది. 
 

Pallavi Prashanth Arrest

టైటిల్ గెలిచిన ఆనందం పల్లవి ప్రశాంత్ కి దక్కలేదు. అనూహ్యంగా జైలుపాలయ్యాడు. డిసెంబర్ 17 రాత్రి అన్నపూర్ణ స్టూడియో ఎదుట పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ విపరీత చర్యలకు పాల్పడ్డారు. పుబ్లిక్, ప్రైవేట్ ప్రాపర్టీ ధ్వంసం చేశారు. బయట గొడవగా ఉందని పోలీసులు పల్లవి ప్రశాంత్ ని వెనుక డోర్ నుండి పంపించారు. అయితే పోలీసుల సూచనలు బేఖాతరు చేస్తూ ప్రశాంత్ అన్నపూర్ణ స్టూడియోకి వచ్చాడు. 
 

Pallavi Prashanth Arrest


దీంతో పల్లవి ప్రశాంత్ పై పోలీసులు పలు సెక్షన్స్ క్రింద కేసు నమోదు చేశారు. బుధవారం రాత్రి పల్లవి ప్రశాంత్ ని పోలీసులు తన స్వగ్రామంలో అరెస్ట్ చేశారు. కోర్టు అతనికి 14 రోజుల రిమాండ్ విధించింది. పల్లవి ప్రశాంత్ ని బయటకు తీసుకురావాలని లాయర్లు నాంపల్లి కోర్టులో బెయిల్ పిటీషన్ దాఖలు చేశారు. 



ఇదిలా ఉంటే పల్లవి ప్రశాంత్ అరెస్ట్ పై మాజీ కంటెస్టెంట్స్ తో పాటు సీజన్ 7 కంటెస్టెంట్స్ స్పందిస్తున్నారు. భోలే షావలి అరెస్ట్ విషయం తెలుసుకుని జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ కి వెళ్ళాడు. మీడియాతో మాట్లాడుతూ... అతడికి లా అండ్ ఆర్డర్ గురించి తెలియదు. అభిమానులను చూసి ఆనందంలో ర్యాలీ చేశాడు. అత్యుత్సాహంలో జరిగిన పొరపాట్లు తప్పితే కావాలని చేసింది లేదు అన్నాడు. 

Pallavi Prashanth Arrest

హౌస్లో కష్టపడి ఆడాడు. ప్రశాంత్ బయటకు రావాలని కోరుకోండని భోలే షావలి అన్నారు. మరొక కంటెస్టెంట్ అశ్విని శ్రీ ఆవేదన చెందారు. అశ్విని శ్రీ పల్లవి ప్రశాంత్ అరెస్ట్ ని తీవ్రంగా ఖండించింది. 
 

Pallavi Prashanth Arrest

ఫ్యాన్స్ చేసిన తప్పుకు పల్లవి ప్రశాంత్ ని అరెస్ట్ చేయడం ఏమిటీ? ఇది చాల తప్పు. అసలు జైల్లో పెట్టడమేంటండి?. నాకు మాటలు కూడా రావడం లేదు. వాడు చాలా ఇన్నోసెంట్. మంచి వాడు. దయ చేసి నా తమ్ముడిని బయటకు తీసుకురండి, అని చేతులెత్తి వేడుకుంది. అశ్విని శ్రీ వీడియో వైరల్ అవుతుంది. 
 

ఫైనల్ రోజు అశ్విని శ్రీ కారు అద్దాలు కూడా పగలగొట్టారు. ఆమె చాలా ఆవేదన చెందారు. ఆ పని చేసింది పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ అని ప్రచారం జరిగింది. అయినప్పటికీ అశ్విని శ్రీ పల్లవి ప్రశాంత్ కి మద్దతుగా నిలిచింది. అతడు విడుదల కావాలని కోరుకుంది.  
 

Latest Videos

click me!