16 ఏళ్లకే ప్రేమలో పడ్డ దుల్కర్ సల్మాన్... స్కూల్ సీక్రేట్స్ విప్పిన యంగ్ హీరో..

First Published | Oct 31, 2024, 1:33 PM IST

దుల్కర్ సల్మాన్ తన కార్ల కలెక్షన్ గురించి, భార్య అమల్ సుఫియాను స్కూల్లో కలిసిన విషయాలను పంచుకున్నారు.

సౌత్ స్టార్ హీరో మమ్ముట్టి వారసుడిగా  దుల్కర్ సల్మాన్  ఇండస్ట్రీలోకి వచ్చినా.. తక్కువ సమయంలోనే మలయాళం, తమిళం, తెలుగు భాషల్లో స్టార్ హీరోగా ఎదిగారు. ఇక తాజాగా ఆయన నటించిన తెలుగు సినిమా  లక్కీ భాస్కర్'  దీపావళికి విడుదల కానుంది. ఈ సందర్భంగా  ఓ ఇంటర్వ్యూలో ఆయన చెప్పిన విషయాలు అందరి దృష్టిని ఆకర్షించాయి.

Also Read: హీరో మీద ప్రేమతో మతం మార్చుకున్న నయనతార

NBK సీజన్ 4లో దుల్కర్

నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా నిర్వహిస్తున్న  NBK సీజన్ 4 అన్‌స్టాపబుల్ షోలో దుల్కర్ సల్మాన్ పాల్గొన్నారు.  ఈ ఇంటర్వ్యూలో తన లైఫ్ లో జరిగిన అద్భుతాలు.. సినిమా జీవితం.. ప్రస్తుతం కెరీర్ గురంచి  మాట్లాడారు. దుల్కర్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. 

Also Read: 300 కోట్ల రెమ్యునరేషన్ తో దళపతి విజయ్‌ను అధిగమించిన తెలుగు స్టార్ హీరో ఎవరో తెలుసా..?


లక్కీ భాస్కర్ సినిమా

తనకు కార్లంటే చాలా ఇష్టమని, కారులో కూర్చొని తినడం ఇష్టమని దుల్కర్ చెప్పారు. గంటకు 300 కి.మీ. వేగంతో ప్రయాణించానని అది తన జీవితంలో మర్చిపోలేనని  చెప్పి బాలయ్యనే  ఆశ్చర్యపరిచారు దుల్కర్ సల్మాన్.

Also Read: కోట శ్రీనివాసరావు ముఖంపై కాండ్రించి ఉమ్మేసిన బాలకృష్ణ

దుల్కర్ సల్మాన్

దుల్కర్ దగ్గర పోర్ ఫెరారీ, మెర్సిడెస్, BMW, రోల్స్ రాయిస్ వంటి కార్లు ఉన్నాయి. విదేశీ, వింటేజ్ కార్లంటే ఈ యంగ్ హీరోకు చాలా  ఇష్టమని చెప్పారు.

Also Read: రొమాన్స్ కు రెడీ అవుతున్న మోక్షజ్ఞ, బాలయ్య కొడుకు మామూలోడు కాదు

దుల్కర్ సల్మాన్ కుటుంబం

భార్య అమల్ సుఫియాతో 13 ఏళ్లుగా ప్రేమగా ఉన్నానని దుల్కర్ చెప్పారు. ఇద్దరూ ఒకే స్కూల్లో చదువుకున్నారు. 5వ తరగతిలో ఉన్నప్పుడు భార్యపై తనకు క్రష్ ఉండేదని చెప్పారు. 16 ఏళ్లకే తన ప్రేమను ప్రపోజ్ చేసినట్టు ఆయన వెల్లడించాడు. స్కూల్ లో తను ఘాడంగా ప్రేమించిన అమల్ ను పెళ్ళాడాడు దుల్కర్. వారికి ఓ పాప. 

సీనియర్ ఎన్టీఆర్ ఒంటిపై ఉండే ఏకైక పచ్చబొట్టు రహస్యం ఏంటో తెలుసా..?

దుల్కర్ సల్మాన్ భార్య

దుల్కర్ - అమల్ జంటకు మరియం అనే కూతురు ఉంది. భార్యపై తనకున్న ప్రేమను, ఆమె ఎంతగా సపోర్ట్ చేసిందో దుల్కర్ ఇంతకు ముందు చాలా ఇంటర్వ్యూలలో చెప్పారు. ప్రస్తతం ఆయన మలయాళంతో పాటు.. తెలుగు , తమిళ భాషల్లో కూడా బిజీ అయిపోయాడు. వరుస సినిమాలను ప్లాన్ చేసుకుంటున్నాడు. 

Latest Videos

click me!