దుల్కర్ ‘ఆకాశంలో ఒక తార’: క్రేజీ లాంచింగ్, విశేషాలు

Published : Feb 02, 2025, 05:18 PM IST

మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్, తెలుగులో వరుస సినిమాలు చేస్తున్నారు. ఆయన తాజా చిత్రం 'ఆకాశంలో ఒక తార' ఈ రోజు లాంచ్ అయ్యింది. ఈ చిత్రానికి పవన్ సాధినేని దర్శకత్వం వహిస్తున్నారు.

PREV
13
దుల్కర్ ‘ఆకాశంలో ఒక తార’: క్రేజీ లాంచింగ్,  విశేషాలు
Dulquer Salmaan, Aakasam Lo Oka Tara, Pavan Sadineni


మళయాళం నుంచి మెల్లిగా తెలుగులో సెటిల్ అవుతున్నారు హీరో దుల్కర్ సల్మాన్. ఆయన నటించిన సినిమాలన్నీ తెలుగు నాట హిట్టే. ఇలా  వరుస విజయాలతో దూసుకుపోతున్న ఆయన కథలు, దర్శకుల ఎంపిక విభిన్నంగా ఉంటోంది. ఈ క్రమంలోనే  పాన్ ఇండియా హీరోగా మారి సత్తా చాటుతున్నారు. తెలుగులో మహనటి, సీతారామం, లక్కీ భాస్కర్ చిత్రాలతో మరిచిపోలేని సక్సెస్ ను అందుకున్నారు దుల్కర్. ఆయన తాజా చిత్రం ‘ఆకాశంలో ఒక తార’ఈ రోజు లాంచ్ అయ్యింది. 

23
dulquer salmaan next movie is Aakasam Lo Oka Tara in telugu


దుల్కర్‌ సల్మాన్  హీరోగా నటించనున్న సినిమాకు ‘ఆకాశంలో ఒక తార’చిత్రానికి యంగ్ డైరక్టర్ పవన్  సాధినేని దర్శకత్వం వహించనున్నారు. గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా, లైట్‌ బాక్స్‌ మీడియా సమర్పణలో సందీప్‌ గుణ్ణం, రమ్య గుణ్ణం నిర్మించనున్న ఈ సినిమా లాంచింగ్ ఈ రోజు జరగింది.

 హైదరాబాద్ లో జరిగిన ఆ కార్యక్రమానికి సంబంధించిన పిక్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ ఫోటోలో అశ్వనీదత్, గుణ్ణం గంగరాజు, అల్లు అరవింద్, దుల్కర్, పవన్ సాదినేని కనిపిస్తున్నారు. తెలుగులో ఇద్దరు మెగా ప్రొడ్యూసర్స్ అల్లు అరవింద్, అశ్వనీదత్ కలిసి చిత్రం లాంచింగ్ కు హాజరు కావటంతో  ఈ సినిమాకు కావాల్సినంత బజ్ ఏర్పడింది. 

33
పవన్ సాధినేని

 'ప్రేమ ఇష్క్ కాదల్, సావిత్రి' వంటి లవ్ స్టోరీస్‌తో సినిమాలు తీసిన పవన్ సాధినేని తర్వాత తన దృష్టిని వెబ్ సీరిస్ ల వైపు తిప్పి అక్కడ సెన్సేషన్ క్రియేట్ చేసారు. సేనాపతి వంటి చిన్న సినిమాతో మరోసారి అందరి దృష్టిని ఆకర్షించారు.

ఆ తర్వాత రీసెంట్ గా పవన్ సాధినేని తీసిన ఈ 'దయా' ఇటీవల వచ్చిన చాలా వెబ్ సిరీస్‌ల కంటే బాగుందనే టాక్ తెచ్చుకుంది. ఇప్పుడు ఏకంగా దుల్కర్ నే డైరక్ట్ చేయబోతున్నారు.  ‘ఆకాశంలో ఒక తార’టైటిల్ తో రూపొందే ఈ  చిత్రంలో తమిళ హీరోయిన్  సాత్విక వీరవల్లి తెలుగుకు పరిచయం అవుతోంది. ఈ మూవీ 2025లో విడుదల కానుంది. 

click me!

Recommended Stories