ఆ తర్వాత అక్కినేని నాగేశ్వర రావు దొంగరాముడు చిత్రంలో ఆయనకి చెల్లిగా నటించే అవకాశం అందుకుంది. ఈ చిత్రం ఘనవిజయం సాధించడంతో జమున వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. ఇక ఆ తర్వాత భూకైలాస్’, ‘పెళ్ళినాటి ప్రమాణాలు, ‘అప్పుచేసి పప్పుకూడు’, చిరంజీవులు’, ‘ఇల్లరికం’, ‘ఈడూజోడూ’, ‘రాముడు భీముడు’, ‘శ్రీకృష్ణ తులాభారం’, ‘గులేబకావళికథ’, ‘లేతమనసులు’, గుండమ్మకథ, మూగమనసులు శ్రీకృష్ణ తులాభారం చిత్రాలతో జమున పాపులారిటీ తారాస్థాయికి చేరింది.