Drishyam 3: మే నెలలో ఇండియా మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన రెండు సినిమాలు సూర్య 'కరుప్పు', మోహన్‌లాల్ 'దృశ్యం 3'. వీటిలో కరుప్పు సినిమా రికార్డులను బద్దలు కొడుతూ దృశ్యం 3 మొదటి రోజే బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది.
మే నెలలో ఇండియా మొత్తం ఎదురుచూసిన రెండు పెద్ద సినిమాలు సూర్య 'కరుప్పు', మోహన్‌లాల్ 'దృశ్యం 3'. కరుప్పు రికార్డులను బద్దలు కొడుతూ దృశ్యం 3 మొదటి రోజే బాక్సాఫీస్ వద్ద దుమ్ములేపింది. కరుప్పు మొదటి రోజు రూ.28.93 కోట్లు వసూలు చేయగా, దృశ్యం 3 ఆ రికార్డును అధిగమించింది.
25
దృశ్యం 3 గ్రాండ్‌గా రిలీజ్
మలయాళంలో ఈ మధ్య భారీ ప్రీ-రిలీజ్ హైప్‌తో వచ్చిన సినిమా 'దృశ్యం 3'. మోహన్‌లాల్ పుట్టినరోజు నాడే రిలీజ్ అవ్వడంతో అభిమానులకు డబుల్ ట్రీట్ అయింది. ఫస్ట్ షో తర్వాత పాజిటివ్ టాక్ రావడంతో 'బుక్ మై షో'లో టికెట్ల అమ్మకాలు జెట్ స్పీడ్‌లో జరిగాయి. ఒకానొక దశలో గంటకు 41,000 టికెట్లు అమ్ముడయ్యాయి.
35
దృశ్యం 3 భారీ ఓపెనింగ్స్
అధికారిక సమాచారం ప్రకారం, ఈ సినిమాను నిన్న 67 దేశాల్లో రిలీజ్ చేశారు. మొదటి రోజు సాయంత్రం 4 గంటలకే థియేటర్ ఆక్యుపెన్సీ 90 శాతానికి పైగా చేరింది. దీంతో కేరళలో మాత్రమే నిన్న 500కు పైగా లేట్ నైట్ షోలు వేశారు. ప్రముఖ బాక్సాఫీస్ ట్రాకర్ సాక్‌నిల్క్ ప్రకారం, ఈ చిత్రం ఇండియాలో మొదటి రోజు రూ.18.37 కోట్ల గ్రాస్, రూ.15.85 కోట్ల నెట్ వసూలు చేసింది.
జీసీసీ సహా ఓవర్సీస్ మార్కెట్లలోనూ ఈ సినిమాకు మొదటి రోజు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా తొలిరోజు వసూళ్లు రూ.48.37 కోట్లు అని అంచనా వేస్తున్నారు. ఇది అత్యధిక ఓపెనింగ్ అని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో సూర్య కరుప్పు మూవీ రికార్డుని `దృశ్యం 3` బ్రేక్ చేసిందని చెప్పొచ్చు.
55
దృశ్యం 3 సంచలనం
ఏది ఏమైనా, 'ఎంపురాన్' తర్వాత మలయాళ సినీ చరిత్రలో రెండో అతిపెద్ద ఓపెనింగ్ సాధించిన చిత్రంగా 'దృశ్యం 3' నిలిచింది. మూడో స్థానంలో ఉన్న 'పేట్రియాట్' మొదటి రోజు రూ.28.05 కోట్లు వసూలు చేసింది. 'ఎంపురాన్' సినిమా ప్రపంచవ్యాప్తంగా తొలిరోజు రూ.68.20 కోట్లు వసూలు చేయడం విశేషం.