Bigg Boss 10: పులివేషం వేసుకున్న గుంటనక్క.. ఆటగాడిలా ఆడు, పోటుగాడిలా కాదు.. ముఖేష్‌, రోహిత్, అమన్‌కి వార్నింగ్‌

Published : Oct 06, 2026, 11:44 PM IST

బిగ్‌ బాస్‌ తెలుగు 10 ఐదో వారం నామినేషన్ల ప్రక్రియ వాడివేడిగా జరిగింది. రోహిత్‌ని అంతా టార్గెట్‌ చేశాడు. సుధీర్‌ ఆడుకున్నాడు. ముఖేష్‌ పరువు పోయింది. మరి ఈ వారం నామినేషన్‌లో ఎవరు ఉన్నారంటే?

PREV
16
బిగ్‌ బాస్‌ తెలుగు 5వ వారం నామినేషన్‌

బిగ్‌ బాస్‌ తెలుగు 10 ఐదో వారానికి సంబంధించిన నామినేషన్ల ప్రక్రియ జరుగుతుంది. సోమవారంతోపాటు మంగళవారం ఎపిసోడ్‌లోనూ ఇది కొనసాగింది. కంటెస్టెంట్లు ఇతరులను నామినేట్‌ చేస్తూ చేసిన కామెంట్లు, దానికి కౌంటర్లతో బిగ్‌ బాస్‌ మంగళవారం ఎపిసోడ్‌ రసవత్తరంగా సాగింది. ఈ రోజు ఎపిసోడ్‌లో మొదట కుండని దక్కించుకున్న సుధీర్‌ రెడ్డి.. రోహిత్‌ని నామినేట్‌ చేశాడు. హీరోలా పోజులుకొడుతున్నాడని, ఇతరులకు రెస్పెక్ట్ లేదని, యాటిట్యూడ్‌ చూపిస్తున్నాడని ఆరోపించారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. రోహిత్‌పై సుధీర్‌ రెడ్డి వేసిన సెటైర్లకి ఇతర కంటెస్టెంట్లు నవ్వారు. దీనికి రోహిత్‌ రియాక్ట్ అవుతూ, ఆయన స్టాండప్‌ కామెడీ చేయడం లేదని చెప్పడం విశేషం.

26
షాలిని పులిలా ఆడాలి

అనంతరం షాలినిని నామినేట్‌ చేస్తూ, నువ్వు పులిలా ఆడుతావని భావించాను, కానీ నీరసిస్తున్నావని, మళ్లీ స్ట్రాంగ్‌ కావాలని నామినేట్‌ చేస్తున్నట్టు తెలిపాడు సుధీర్‌. ఈ విషయంలో ఆమె కౌంటర్‌ ఇచ్చారు. ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఇందులో టెంపర్‌ వంశీ రియాక్ట్ అయ్యాడు. అటు వంశీ, ఇటు షాలిని రెచ్చిపోయారు. కాసేపు హిటెక్కింది హౌజ్‌. ఆ తర్వాత చరణ్‌.. ముఖేష్‌ గౌడని నామినేట్‌ చేస్తూ, స్టార్‌ అనేదానికి అందరు అర్హులే అని, కామనర్స్ ని తక్కువ చేసి మాట్లాడుతున్నావని చెప్పాడు, ఇక్కడ అంతా సమానమే అని, కామనర్‌గా వచ్చినవాళ్లు ఈజీగా వచ్చారని చెప్పడం సరికాదని, ఈ యాటిట్యూడ్‌ మార్చుకోవాలని తెలిపారు. దీనికి ముఖేష్‌ రియాక్ట్ అవుతూ, చాలా గొప్పగా మెచ్యూర్ గా చెప్పావ్‌, నీ అంతా ఆలోచన నాకు లేదు, నేను నేర్చుకుంటానని తెలిపాడు.

36
మారు వేషం వేసుకున్న గుంటనక్క ముకేష్‌

కుండని దక్కించుకున్న అపూర్వ.. ముఖేష్‌ని నామినేట్‌ చేస్తూ. పులివేషం వేసుకున్న గుంటనక్క అని కామెంట్‌ చేసింది. నా క్యారెక్టర్‌ ని అస్సాసినేట్‌ చేశారని ఆరోపించింది. దీనికి ముఖేష్‌ రియాక్ట్ అవుతూ, నేను నక్కని కాదా, నాతోని ఎందుకు సహవాసం చేశారని ప్రశ్నించారు. ఒక టీమ్‌ లో ఉండి, మరో టీమ్‌లో పావులు కదుపుతున్నావని ఆరోపించింది అపూర్వ. ఈ క్రమంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఇక అపూర్వ.. సింగర్‌ ఝాన్సీని నామినేట్‌ చేస్తూ, డాగర్ల విషయంలో స్వార్థంగా గేమ్‌ ఆడావని, నీకోసం కాకుండా ఇతర కోసం ఆడుతున్నావని చప్పింది. ఈ క్రమంలో రోహిత్‌, సుధీర్‌ల ప్రస్తావన వచ్చింది. వాళ్లు ఇన్‌ వాల్వ్ కావడంతో కాస్త హీటెక్కింది. గట్టిగానే గొడవ జరిగింది.

46
చరణ్‌కి ఇచ్చిపడేసిన జబర్దస్త్ నరేష్‌

నరేష్‌.. చరణ్‌ ని నామినేట్‌ చేస్తూ. రెండు రోజుల్లో మిథిలేష్‌ 15 లక్షలు తీసుకెళ్లాడు, గ్రేట్‌ అన్నావు. మరి ఇందులో నాలుగు వారాలు ఉండి నువ్వు ఏం చేస్తున్నావంటూ ప్రశ్నించాడు. నీవు కామనర్‌గా ఈజీగా రాలేదు. ఎంతో మందిని దాటుకొని వచ్చావు. కానీ నీకంటే బెటర్‌ వాళ్లు వచ్చి ఉంటే బాగుండేది అని కామెంట్‌ చేశాడు నరేష్‌. జనాలకు సంబంధించిన విషయం మీకు అవసరం లేదని కౌంటర్‌ ఇచ్చాడు చరణ్‌. మీరేం ఆడుతున్నారంటూ రివర్స్ ఎటాక్‌ కి దిగాడు. ఈ క్రమంలో రామ్‌ ప్రసాద్‌, షాలిని రంగంలోకి దిగాడు. ఒకరికొకరు సపోర్ట్ చేసుకున్నారు. ఇది కూడా గట్టిగానే వాగ్వాదానికి కారణమయ్యిందని చెప్పొచ్చు.

56
రోహిత్‌ ప్రవర్తనని టార్గెట్‌ చేసిన సింగర్‌ ఝాన్సీ

సింగర్‌ ఝాన్సీ.. రోహిత్‌ని నామినేట్‌ చేస్తూ, ఆయన ప్రవర్తన గురించి మాట్లాడింది. నా ఆట గురించి పాయింట్‌ ఔట్‌ చేసే ముందు మీ ఆట గురించి ఆలోచించుకోండి అని రోహిత్‌ కౌంటర్‌ ఇచ్చాడు. ఆ తర్వాత అమన్‌ని నామినేట్‌ చేస్తూ, ఆటని ఆటగాడిలా ఆడు, పోటుగాడిలా కాదు. పిల్ల బచ్చగాడు అనే కామెంట్‌కి నామినేట్‌ చేసింది. వాళ్లు అన్నది తప్పు అయితే, నువ్వు అన్నది ఏంటి` అని ప్రశ్నించింది సింగర్‌ ఝాన్సీ. ఈ క్రమంలో ఇద్దర మధ్య గట్టిగానే వాగ్వాదం జరిగింది. ఝాన్సీ మీద మీదకు వచ్చాడు అమన్‌. ఇతర సభ్యులు వారిని ఆపే ప్రయత్నం చేశారు. దేబ్జానీ.. రోహిత్‌ ఆరోగెన్సీ, యాటిట్యూడ్‌ గురించి నామినేట్‌ చేసింది.

66
ఎఫ్‌ఐఆర్‌ రాసుకో అంటూ రోహిత్‌

రోహిత్‌.. నరేష్‌ ని నామినేట్‌ చేస్తూ, చరణ్‌ని కాన్ఫిడెన్స్ ని తక్కువ చేయడం నచ్చలేదన్నాడు. రామ్‌ ప్రసాద్‌ నరేష్‌కి సపోర్ట్ చేయడంపై నామినేట్‌ చేశాడు. షాలినికి నీకు నాలుగు నెలల ఫ్రెండ్‌. కానీ నాకు నరేష్‌ 15ఏళ్లు తెలుసు. అందుకే సపోర్ట్ చేస్తా అని రామ్‌ ప్రసాద్‌ స్పందించాడు. ఈ క్రమంలో షాలిని ఇన్‌ వాల్వ్ కాగా, ఎఫ్‌ ఐఆర్‌ రాస్కో అంటూ కౌంటర్‌ ఇచ్చాడు రామ్‌ ప్రసాద్‌. టెంపర్‌ వంశీ రోహిత్‌ని నామినేట్‌ చేశాడు. ఇక మొత్తంగా ఐదో వారంలో అమన్‌, అపూర్వ, ముఖేష్‌ గౌడ, రోహిత్‌, సింగర్‌ ఝాన్సీ, చరణ్‌, నరేష్‌, షాలిని, రామ్‌ ప్రసాద్‌, త్రిగుణ్‌ నామినేట్‌ అయ్యారు.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories