మౌళి `90 ఏ మిడిల్ క్లాస్ బయోపిక్`, `లిటిల్ హార్ట్స్`తో ఆకట్టుకున్నాడు. `లిటిల్ హార్ట్స్`తో థియేట్రికల్‌గా పెద్ద హిట్‌ని అందుకున్నాడు. ఇప్పుడు `దొంగ నా కొడుకు` అనే వెరైటీ టైటిల్‌తో ఆడియెన్స్ ముందుకు వచ్చాడు. ఈ చిత్రం గత శుక్రవారం(నవంబర్ 13న)విడుదలైంది. ఇందులో సుష్మిత శెట్టి హీరోయిన్‌గా నటించింది. అలీ, రజిత, రఘుబాబు, భద్రం, గుండు సుదర్శన్, ప్రియా కీలక పాత్రలు పోషించారు. శ్రీను కంబాల దర్శకత్వం వహించారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మాతలుగా, అనిల్ యెర్నేని సహ నిర్మాతగా వ్యవహరించారు. క్రైమ్ కామెడీగా తెరకెక్కిన ఈ చిత్రానికి నెగటివ్ టాక్ వచ్చింది. కామెడీ ఆశించిన స్థాయిలో లేదని, ఇరికించినట్టుగా ఉందనే టాక్ వినిపించింది. కానీ కలెక్షన్లు మాత్రం అదిరిపోయాయి.