ఇక ఈ సీరియల్ లో నటించిన వంటలక్క, డాక్టర్ బాబు పాత్రల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నిజానికి వీరి కోసమే సీరియల్ చూసిన వాళ్ళు ఉన్నారు. గత కొంతకాలం కిందట వీరి పాత్ర ముగియటంతో చాలా మంది ప్రేక్షకులు విచారం వ్యక్తం చేశారు. ఇక తమకు ఇష్టమైన డాక్టర్ బాబు, వంటలక్క పాత్రలు లేకపోతే ఈ సీరియల్ చూడమని చాలామంది కూడా సీరియల్ చూడటమే మానేశారు.