పవన్ తో రెండు రీమేక్ లు రిజెక్ట్.. భవదీయుడు మ్యాటర్ మొత్తం చెప్పేసిన హరీష్, డైలాగ్స్ పదేళ్లు మోతే..

First Published May 20, 2022, 1:42 PM IST

గబ్బర్ సింగ్ హ్యాంగోవర్ ని పవన్ అభిమానులు పదేళ్ల పాటు ఎంజాయ్ చేశారు. భవదీయుడు భగత్ సింగ్ అంతకు మించేలా.. పవన్ ఫ్యాన్స్ మరో పదేళ్లు పండగ చేసుకునేలా ఉండబోతుందని డైరెక్టర్ హరీష్ శంకర్ హామీ ఇచ్చారు.

Bhavadeeyudu Bhagat Singh

గబ్బర్ సింగ్ హ్యాంగోవర్ ని పవన్ అభిమానులు పదేళ్ల పాటు ఎంజాయ్ చేశారు. భవదీయుడు భగత్ సింగ్ అంతకు మించేలా.. పవన్ ఫ్యాన్స్ మరో పదేళ్లు పండగ చేసుకునేలా ఉండబోతుందని డైరెక్టర్ హరీష్ శంకర్ హామీ ఇచ్చారు. ఇది పక్కా కమర్షియల్ మూవీ అని క్లారిటీ ఇచ్చారు. తాజాగా ఇంటర్వ్యూలో హరీష్ శంకర్ భవదీయుడు భగత్ సింగ్ గురించి చెప్పిన విశేషాలు సినిమాపై అంచనాలు పెంచే విధంగా ఉన్నాయి. 

హరీష్ శంకర్ మాట్లాడుతూ.. గబ్బర్ సింగ్ రిలీజై పదేళ్లు ఎలా గడిచిపోయాయో తెలియడం లేదు. పవన్ కళ్యాణ్ తో మరో సినిమా చేయడానికి పదేళ్ల సమయం పట్టడానికి కూడా ప్రత్యేక కారణాలు అంటూ లేవు. ఆయన పాలిటిక్స్ తో బిజీగా ఉన్నారు అని హరీష్ తెలిపాడు. 

గబ్బర్ సింగ్ తర్వాత పవన్ తో రెండు రీమేక్ సినిమాలు చేసే ఆఫర్ వచ్చింది. కానీ ఆ చిత్రాలు నేను చేయలేదు. గబ్బర్ సింగ్ తర్వాత మరో రీమేక్ చేయడం రచయితగా కరెక్ట్ కాదు అనిపించింది. అందుకే పవన్ తో ఈసారి స్టైట్ మూవీనే చేయాలని డిసైడ్ అయ్యా. అందుకే భవదీయుడు కథ రెడీ చేశా అని హరీష్ అన్నారు. అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయని నాకు తెలుసు. అందుకే పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ గా భవదీయుడు ఉండబోతోంది. 

కెరీర్ లో తొలిసారి పవన్ కళ్యాణ్ లెక్చరర్ పాత్రలో కనిపించబోతున్నారు. అద్భుతమైన సన్నివేశాలు ఈ చిత్రంలో ఉండబోతున్నాయి. ఆగష్టు నుంచి ఈ చిత్ర  షూటింగ్ ప్రారంభించబోతున్నాం. 80 శాతం షూటింగ్ మొత్తం హైదరాబాద్ లోనే ఉంటుంది అని హరీష్ శంకర్ తెలిపారు. 

పవన్ కళ్యాణ్ సినిమా అనేసరికి డైలాగ్స్ విషయంలో నా పై చాలా ఒత్తిడి ఉంటుంది. కానీ పవన్ కళ్యాణ్ అభిమానిగా నేను ఆయన క్యారెక్టర్ కి వెంటనే కనెక్ట్ అవుతాను.  ఈ చిత్రంలో డైలాగులు మరో పదేళ్లు గుర్తుంచుకునేలా ఉంటాయి అని హరీష్ శంకర్ అన్నారు. 

గబ్బర్ సింగ్ చిత్రంలో పవన్ కళ్యాణ్ రోల్ విషయంలో నాకు ఒక లిమిటేషన్ ఉండేది. పోలీస్ రోల్ కాబట్టి ఎక్కువగా ఆయన ఖాఖిలోనే కనిపిస్తారు. కానీ ఈ చిత్రం కాలేజీ బ్యాక్ డ్రాప్ లో ఉండబోతోంది. సో పవన్ కళ్యాణ్ గతంలో ఎన్నడూ లేని విధంగా స్టైలిష్ కాస్ట్యూమ్స్ లో హ్యాడ్సమ్ గా కనిపిస్తారు అని హరీష్ అన్నారు. 

ఈ చిత్రంలో పూజా హెగ్డే పవన్ కళ్యాణ్ సరసన హీరోయిన్ గా నటించబోతోంది. ఇక ఈ మూవీలో కీలక పాత్ర కోసం పంకజ్ త్రిపాఠిని అనుకుంటున్నట్లు హరీష్ శంకర్ రివీల్ చేశారు. మైత్రి మూవీస్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. త్వరలో మరిన్ని వివరాలు తెలియనున్నాయి. ప్రస్తుతం పవన్ హరి హర వీరమల్లు షూటింగ్ తో బిజీగా ఉన్నారు. 

click me!