పదేళ్లు పూర్తి.. భార్యతో పారిస్ లో గోపీచంద్.. మ్యాచో స్టార్ వైఫ్ ఎవరో మీకు తెలుసా?

First Published | May 13, 2023, 12:27 PM IST

హీరో గోపీచంద్ (Gopichand) ప్రస్తుతం తన భార్యతో వెకేషన్ లో ఉన్నారు. వారి పెళ్లిరోజు సందర్భంగా తాజాగా  కొన్ని బ్యూటీఫుల్ ఫొటోలను పంచుకోవడంతో నెట్టింట వైరల్ గా మారాయి. 
 

మ్యాచో స్టార్ గోపీచంద్ (Gopichand) గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. హీరోగానే కాకుండా, విలన్ గానూ మెప్పించి ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసుకున్నారు. రీసెంట్ గా ‘రామబాణం’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ తో ఆకట్టుకున్నారు. 
 

అయితే, గోపీచంద్ సినిమా ప్రమోషన్స్ లో తప్పా మరేక్కడ కనపించరు. ఎక్కువ ఈవెంట్లకు, సినీ ఫంక్షన్లకు కూడా పెద్దగా రారనే విషయం తెలిసిందే. అప్పుడప్పుడు మాత్రం సోషల్ మీడియాలో మెరుస్తుంటారు. ఇక తన ఫ్యామిలీ గురించి కూడా మ్యాచో స్టార్ పెద్దగా చెప్పుకోరు. ఆయా సందర్భాల్లో కొన్ని ఫొటోలను పంచుకున్నారు. 
 


చాలా కాలం తర్వాత గోపీచంద్ పంచుకున్న ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి. తన భార్య రేష్మ (Reshma)తో కలిసి ఉన్న బ్యూటీఫుల్ ఫొటోలను అభిమానులతో షేర్ చేసుకున్నారు. అయితే, గోపీచంద్ ఆ పిక్స్ ను షేర్ చేసేందుకు ఓ రీజన్ ఉంది. మే13న వాళ్ల పెళ్లిరోజు కావడమే విశేషం. 
 

2013లో గోపీచంద్  రేష్మ  వివాహం ఘనంగా జరిగింది. నేటితో వీరి వివాహ బంధం పదేళ్లు పూర్తైంది. ఈ సందర్భంగా ప్యారిస్ లో తన భార్యతో కలిసి వెకేషన్ ను ఎంజాయ్ చేస్తున్నారు.  ఈక్రమంలోనే బ్యూటఫుల్ ఫొటోషూట్ తో ఆకట్టుకున్నారు. ఫొటోలను షేర్ చేయడంతో అభిమానులతో పాటు అందరూ విషెస్ తెలుపుతున్నారు. 
 

గోపీచంద్ ఆ ఫొటోలను పంచుకుంటూ తన భ్యార గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ కూడా చేశారు. ‘ఇన్నాళ్లూ నీతో కలిసి చేసిన ప్రయాణం  అద్భుతమైనది. నిన్ను నా భార్యగా పిలవడం నాకు చాలా సంతోషంగా ఉంది. నా జీవితాన్ని పరిపూర్ణం చేశావు’ అంటూ యానివర్సరీ విషెస్ తెలిపారు. గోపీచంద్ - రేష్మలకు ఇద్దరు సంతానం. ఇద్దరూ కొడుకులే. మొదటి బాబు విరాట్ క్రిష్ణ, రెండో బాబు వియాన్. 
 

ఇక గోపీచంద్ భార్య రేష్మ విషయానికొస్తే.. ఆమె మరెవరో కాదు సీనియర్ నటుడు శ్రీకాంత్ సొంత మేనకొడలు. ఆయన సొంత అక్క కూతురినే గోపీచంద్ పెళ్లి చేసుకున్నారు. రేష్మ అమెరికాలో చదువుకునేప్పుడు.. ఫొటో చూసి ఇష్టపడ్డ గోపీచంద్ ఆమెనే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఆ తర్వాత చలపతిరావు శ్రీకాంత్ ద్వారా ఒప్పించారు. అలా వీరిద్దరూ ఒక్కటయ్యారు. 

Latest Videos

click me!