హన్సికను ఓ హీరో ఇబ్బంది పెట్టాడంటూ వార్తలు.. స్పందించిన యాపిల్ బ్యూటీ.. ఏమంటుందంటే?

First Published | May 24, 2023, 1:28 PM IST

స్టార్ హీరోయిన్ హన్సికా మోత్వానీ (Hansika Motwani)  ప్రస్తుతం వరుస చిత్రాలతో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో ఓ ఇంటర్వ్యూలో తన చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. ఆ రూమర్లపై తాజాగా స్పందించింది.
 

బాలనటిగానే తన కేరీర్ ను ప్రారంభించింది హీరోయిన్ హన్సికా మోత్వానీ. హిందీలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నాలుగైదు చిత్రాల్లో నటించింది. ఆ తర్వాత కొంత గ్యాప్ ఇచ్చి నేరుగా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ‘దేశముదురు’తో మంచి గుర్తింపు దక్కించుకుంది. అప్పటి నుంచి వరుస చిత్రాలతో అలరిస్తూనే ఉంది.
 

గతేడాది హన్సిక తన స్నేహితుడు, బిజినెస్ మ్యాన్ సోహెల్ కతురియాను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. అటు మ్యారీడ్ లైఫ్ ను కొనసాగిస్తూనే ఇటు కేరీర్ లో జోష్ కనిపిస్తోంది. ఈక్రమంలో చేతినిండా సినిమాలతో హన్సిక బిజీగా ఉంది.
 


అయితే, తాజాగా హన్సిక ఓ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన కేరీర్ ప్రారంభంలో ఓ హీరో ఇబ్బంది పెట్టాడని చెప్పినట్టు వార్తలు వైరల్ గా మారాయి. తనతో డేట్ కి వస్తావా అంటూ విసిగించేవాడని, తనకు తగిన బుద్దికి కూడా చెప్పినట్టు చెప్పుకొచ్చిందంటూ రెండ్రోజులుగా రూమర్లు వస్తున్నాయి.
 

సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే హన్సిక దాకా ఈ విషయం చేరింది. దీంతో తాజాగా ట్వీటర్ వేదికన స్పందించింది. ప్రచారం అవుతున్న వార్తల్లో నిజం లేదని ఖండించింది. దీంతో అలాంటి రూమర్లకు అడ్డుకట్ట పడినట్లైంది. 
 

ట్వీట్ లో ‘వార్తలను పబ్లిష్ చేసే ముందు వాటిని క్రాస్ చెక్ చేసకోవాలని మిమ్మల్ని కోరుతున్నాను.  దయచేసి గుడ్డిగా పబ్లిష్ చేసే ముందు వాస్తవాన్ని కూడా చెక్ చేయండి. ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వ్యాఖ్యను నేను ఎప్పుడూ చేయలేదు‘ అంటూ క్లారిటీ ఇచ్చింది. 
 

ప్రస్తుతం సినిమాల పరంగా హన్సిక ఫుల్ బిజీగా ఉంది. ఈ నెల ప్రారంభంలో చెన్నైలో దర్శకుడు ఇగోర్  తెరకెక్కిస్తున్న తమిళ చిత్రం ‘మ్యాన‘ చివరి షెడ్యూల్ షూటింగ్‌ను పూర్తి చేసింది. తెలుగులో పార్ట్నర్, 105 మినిట్స్, మై నేమ్ ఈజ్ శృతి, రౌడీ బేబీ, గార్డియన్, గాంధారి, మ్యాన్ వంటి చిత్రాల్లో నటిస్తోంది.
 

Latest Videos

click me!