హీరోయిన్ గా నిహారిక రీ ఎంట్రీ... విడాకుల తర్వాత జోరు పెంచిన మెగా డాటర్!

First Published | Feb 2, 2024, 10:44 AM IST

నిహారిక కొణిదెల నటిగా రీఎంట్రీ ఇస్తున్నారు. ఆమె హీరోయిన్ గా ఓ చిత్రానికి ఎంపికయ్యారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చేసింది. 
 

మెగా ఫ్యామిలీ నుండి హీరోయిన్ అయిన ఒకే ఒక అమ్మాయి నిహారిక కొణిదెల.  ఈమె ఎంట్రీని ఫ్యాన్స్ తో పాటు కుటుంబ సభ్యులు వ్యతిరేకించారు. అయినప్పటికీ హీరోయిన్ గా మారి పంతం నెగ్గించుకుంది. 
 

Niharika Konidela

ఒక మనసు మూవీతో సిల్వర్ స్క్రీన్ కి పరిచయమైంది. అనంతరం హ్యాపీ వెడ్డింగ్, సూర్యకాంతం చిత్రాల్లో నటించింది. కానీ నిహారికకు బ్రేక్ రాలేదు. దాంతో చేసేదేమీ లేక పెళ్లి చేసుకుంది. 


గుంటూరుకు చెందిన జొన్నలగడ్డ వెంకట చైతన్యతో 2020లో నిహారికకు పెళ్లి జరిగింది. ఓ రెండేళ్లు వీరి కాపురం సవ్యంగా సాగింది. కారణం తెలియదు కానీ ఇద్దరి మధ్య మనస్పర్థలు తలెత్తాయి. విడాకులు తీసుకుని విడిపోయారు. 

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో నిహారిక పరోక్షంగా హింట్ ఇచ్చింది. పెళ్ళయాక కూడా ఆమె నటన కొనసాగించాలి అనుకున్నారు. అందుకు అత్తింటి వారు ఒప్పుకోలేదని తెలిసింది. పెళ్ళైతే నటన ఎందుకు మానేయాలని నిహారిక ఈ ఇంటర్వ్యూలో గట్టిగా చెప్పింది. 

Niharika Konidela

విడాకులు అనంతరం కెరీర్ మీద పూర్తిగా దృష్టి పెట్టిన నిహారిక ఆఫీస్ ఓపెన్ చేసింది. నిర్మాతగా బడ్జెట్ చిత్రాలు, సీరీస్లు నిర్మిస్తుంది. అలాగే నటిగా కొనసాగాలి అనుకుంటుంది. డెడ్ పిక్సెల్స్ టైటిల్ తో ఒక వెబ్ సిరీస్ చేసింది. 

Niharika Konidela

కాగా విడాకులు అనంతరం ఆమె హీరోయిన్ గా ఓ సినిమా ప్రకటించారు. అంటే చాలా కాలం తర్వాత ఆమె సిల్వర్ స్క్రీన్ పై కనిపించనుంది. మద్రాస్ కారన్ టైటిల్ తో ఈ మలయాళ చిత్రం తెరకెక్కుతుంది. షేన్ నిగమ్ హీరోగా నటిస్తున్నాడు. 

మద్రాస్ కారన్ చిత్రానికి వాలి మోహన్ దాస్ దర్శకుడు. నిహారికకు ప్రాజెక్ట్ లోకి వెల్కమ్ చెబుతూ పోస్టర్ విడుదల చేశారు. మొదటి ఇన్నింగ్స్ ఏమంత ఆశాజనకంగా సాగలేదు. కనీసం సెకండ్ ఇన్నింగ్స్ లో అయినా ఆమె సక్సెస్ అవుతుందేమో చూడాలి... 

Latest Videos

click me!